Welcome to

Yadhartha Vadhi TV

అందరికీ నమస్కారం!

యదార్థవాది టీవీ ఛానల్ లో క్షీరసాగర మధనం కార్యక్రమం ద్వారా బైబిల్లో ఉన్న సకల ప్రశ్నలకు, సందేహాలకు, మర్మములకు సమాధానాలు అందరికీ అందించాలి అనే సంకల్పంతో సార్వత్రిక క్రైస్తవ సమాజం సత్యంతో నింపబడాలి అనే కాంక్షతో బైబిల్ లోని ప్రతి ప్రశ్నకి సమాధానం అందరికీ తెలియడం కొరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆత్మీయ జీవితంలో ఎదురయ్యేటువంటి అనేకమైనటువంటి సందేహాలకు, ప్రశ్నలకు కూడా సమాధానాలు తెలియజేయడం జరుగుతుంది.

ఈ తరంలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన అపోస్తలులు ప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు దేవుని నోరుగా సార్వత్రిక క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి సకల సందేహాలకు దేవుని శక్తి చేత, అభిషేకం, చేత సమాధానాలు ఇస్తూ వచ్చారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా వాటిని తీర్చడం కొరకు సర్వ వేళల సిద్ధంగా ఉన్నారు ఇప్పటివరకు అందించబడినటువంటి సమాధానములు మీకు అందుబాటులో టెక్స్ట్ రూపంలో ఉంచాలని ఉద్దేశంతో ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది.

ప్రతి ప్రశ్నకి మీరు ఇక్కడ సమాధానం పొందుకోగలుగుతారు ఇంకా ఏమైనా మీకు ప్రశ్నలు మిగిలిపోయి ఉంటే 9000083219 కి వాట్సాప్ ద్వారా కాని, కాల్ ద్వారా కాని మీ సందేహాన్ని పంపించి ప్రతి శుక్రవారం సాయంత్రం 4:00 నుండి 6 గంటల వరకు జరిగే లైవ్ ప్రోగ్రాం ద్వారా మీరు నేరుగా సమాధానాలు పొందవచ్చు. లేదా వాట్సాప్ ద్వారా మీ సందేహానికి, ప్రశ్నకి లైవ్లో అపోస్తలులు. అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు సమాధానం తెలియచేస్తారు ఇంకా ఏమైనా వివరాలు కావాలి అనుకుంటే మమ్ములను సంప్రదించండి.

అందరికి ధన్యవాదాలు

దేవుడు మిమ్మల్ని దీవించును గాక!

ప్రైస్ ది లార్డ్

 

Latest Question & Answers

267. ప్రశ్న : అక్కడక్కడ క్రైస్తవులు సంగీత వాయిద్యాలు వాయించేవారు టీమ్గా ఏర్పడి క్రైస్తవ ఆరాధనలలో, Meetings లలో వాయిస్తూ ఉంటారు. కానీ వారికుండే పరిచయాల వల్ల హిందూ దేవాలయాల దగ్గర, ఇతర హిందూ దేవతా కార్యక్రమాల దగ్గర సంగీతం వాయించే పరిస్థితి వస్తుంది. అలా హిందూ దేవాలయాలలో, కార్యక్రమాలలో సంగీతం వాయించవచ్చా? వాయించకూడదా? దయచేసి సమాధానం తెలుపగలరు.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      మనం ఇంతకు ముందు ఒక ప్రశ్నకు ఇచ్చిన జవాబు ఉంది చూసారూ. కొబ్బరితోట, వంటలు వండడం అనే వాటి దగ్గర ఉన్నటువంటి Liberal Attitude పరవాలేదులే

Read More »

266. ప్రశ్న : అయ్యగారు దేవుని రాకడ వచ్చేవరకు ఎవరము జీవించి ఉంటామో, తెలియదు కావున చిన్నపిల్లలను భక్తి జీవితంలో ఏ విధంగా నడపాలి. తల్లిదండ్రులు వారి పిల్లల భక్తి సాధనకు ఏవిధంగా కృషి చేయాలి. T.V., Mobile లలో ఎక్కువగా పాప దృశ్యాలు కనిపిస్తున్నాయి కదా చిన్నపిల్లలకు మీరేమైన సందేశం ఇస్తారా! మీరేమైనా చిట్కా / రహస్యం కనుక్కున్నారా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      పిల్లల పెంపకం అనేది అత్యంత క్లిష్టమైన ఒక ప్రక్రియ అది అంత ఈజీ కాదు. కోళ్లను, మేకలను పెంచొచ్చు వాటికి సమయానికి దాన వేస్తే సరిపోతుంది.

Read More »

265. ప్రశ్న : క్రైస్తవుల చర్యలలో కొన్నిసార్లు నేను యేసు ప్రభువును తెలుసుకున్నాను, యేసును నమ్ముకొని, బాప్తిస్మము తీసుకొని, రక్షణ పొందాను అని చెప్పినప్పుడు వాళ్లు మీ సాక్ష్యం చెప్పండి అని అడుగుతున్నారు. కొందరికి రక్షణ పొందకమునుపు పెద్దగా ఏ నేరచరిత్ర ఉండదు, చెడ్డ పేరు ఉండదు కదా! అలాంటప్పుడు మీకేమి గొప్ప సాక్ష్యం లేదన్నమాట అంటున్నారు అలా ఆదాము గారికి కూడా నేరచరిత్ర లేదు కదా! గొప్ప సాక్ష్యం అని అనిపించుకోవాలంటే ఖచ్చితంగా చెడ్డ కార్యాలు చేసి ఉండాలా? దయచేసి వివరణ ఇవ్వగలరు.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      ఒకసారి గండిగుంట రాజబాబు గారి Meetings లో Stuvartupuram Sudhakar garu సాక్ష్యం చెప్పారు. నేను భారతదేశంలో అంతరాష్ట్ర గజదొంగగా అన్ని జైళ్లకు వెళ్లాను. అన్ని

Read More »

264. ప్రశ్న : సార్ నేను ఒక విశ్వాసిని వంటలు చేస్తాను. హిందు సహోదరులు వారి ఫంక్షన్స్ ఉన్నప్పుడు నన్ను పిలుస్తారు. దశదినకర్మ, సంవత్సరికం అని వివిధ సంధర్భాలలో భోజనాలు సిద్ధపరచడానికి నన్ను పిలుస్తారు. నేను చేయవచ్చా దయచేసి తెలియజేయగలరు.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      తప్పకుండా చేయవచ్చు. మీ డ్యూటి మీది. మామూలు నీళ్లు శంఖంలో పోస్తేనే శంఖుతీర్థం అవుతుంది. అని సామెత దాన్ని మనం ఏ దృష్టితో చూస్తున్నామనేదాన్ని బట్టె

Read More »

263. ప్రశ్న : 1 సమూయేలు 28వ అధ్యాయంలో సౌలు కర్ణపిశాచి గల స్త్రీ దగ్గరకు వెళ్లి సమూయేలు పైకి రమ్మని అడుగుతాడు. కర్ణపిశాచి పిలిస్తే సమూయేలు పైకి రావడమేమిటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      కర్ణపిశాచి పిలిస్తే భక్తులు ఆత్మలు గానీ, ప్రవక్తల ఆత్మలుగానీ, భక్తిహీనుల ఆత్మలు కూడా రావు. కర్ణపిశాచి అంటే పడిపోయిన దేవదూతల ఆత్మ వీళ్ల మీదికి రావడం.

Read More »

262. ప్రశ్న : 1 తిమోతి 1:20లో వారిలో హుమెనైయును అలెక్సంద్రును ఉన్నారు; వీరు దూషింపకుండ శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని” అని పౌలు వ్రాసాడు. సాతానుకు అప్పగించితిని అంటే ఏమిటి? ఎలా అప్పగిస్తాడు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు:      ప్రతి ఒక్కరిని కాపాడమని మనం ప్రార్థిస్తూ ఉంటాం కదా! ఆ ప్రార్థనను మానేస్తే సైతానుకు వాడు దొరికిపోతాడు. ఎందుకంటే “వారు దూషింపకుండా శిక్షింపబడునట్లు” అన్నాడు. వారు

Read More »

Send your questions

Do you have a question which is bothering you ? Don’t hesitate to reach out to us, we are happy to help you!