(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: అబద్ద క్రీస్తుగా ఒకడు పుట్టి పెరగడం అనేది ఉండదు! అక్కడ విషయం ఏంటంటే, ఒకడు మామూలు రాజకీయ నాయకుడే! ఒక మామూలు మానవుడే! వాడు మాములుగా నీలాగ, నాలాగా పుట్టాడు. ఆ ముఖ్యమైన పవర్ పొజిషన్ లోనికి వస్తాడు. వచ్చిన తరువాత ఏం జరుగుతాదంటే ఒక చిన్న యుద్ధం జరుగుతుంది. యుగాంతంలో నేను ఈ విషయం క్లియర్గా చెప్పాను. ఒక చిన్న యుద్ధం జరిగినప్పుడు, ఆ రాజు చనిపోతాడు. చనిపోయినప్పుడు అతడు మళ్ళీ పునరుత్తానుడైనాడు! యేసులాగ బ్రదికాడు అన్న నాటకం అక్కడ జరుగుతుంది. జరిగేదేంటంటే చనిపోయిన రాజుగారి ఆత్మ అతనిలోకి మళ్ళీ రాదు. గాని పాతకాలంలో ఎప్పుడో చనిపోయిన పాతాళలోకంలో ఉన్న నిమ్రోదు ఆత్మ వచ్చి అతనిలో ప్రవేశిస్తుంది. నిమ్రోదు ఆత్మ అతనిలో ప్రవేశించిన తర్వాత ఆ క్షణంనుండి క్రీస్తు విరొధి, అబద్ధ క్రీస్తు.
అంతకుముందు ఆయన మాములు రాజకీయ నాయకుడే! ఇప్పుడు అందరు రాజకీయ నాయకులు ఎవరో ఉన్నారు కదా? అన్ని దేశాల అధినేతలు, అతడు కూడ అటువంటివాడే! గనుక ఎవరైతే ఒకవేళ అబద్ధక్రీస్తుగా మారబోతున్నారో, ఎవరి మృతశరీరంలోకి నిమ్రోదు ఆత్మరాడానికి ముందుగానే సైతాను ప్లాన్ చేసి పెట్టాడు. ఆ మనిషి ఇప్పుడు పుట్టి ఉండొచ్చు. కాని సైతాను దేవుని ప్రణాళికల్ని భగ్నం చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నట్లు! సాతాను ప్రణాళికలు భగ్నం చేయడానికి దేవుని వైపునుండి కూడ కొన్ని శక్తులు పని చేయుచు ఎవరినో ఒకరిని ఎంపిక చేసికోవచ్చు, వానిలో నిమ్రోదును ప్రవేశపెట్టాలి అనుకోవచ్చు. వాడు ముందే చచ్చిపోవచ్చు.
అప్పుడు ఇంకొకడిని ఎన్నుకుంటాడు, ఇప్పుడు అక్కడ పలానా వ్యక్తి మాత్రమే అబద్ధక్రీస్తు అవుతాడని నియమమేమి లేదు. ప్రపంచ రాజకీయ నాయకుల్లో, ఆ మద్య ప్రాశ్చంలో ఎవరినైనా వీడు ఎన్నుకుంటాడు, ఆ టైంకి ఎవరు కావాలో ఎన్నుకొని వాని లోపలికి నిమ్రోదు ఆత్మను ప్రవేశపెట్టిన తర్వాత ఆ సెకండ్ నుండి వాడు క్రీస్తు విరోధి. అంతకముందు కాదు.