(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు : ఏమాత్రము లేదు. వసుధైక కుటుంబం అని నమ్మాలంటే, బైబిలు ప్రకారం ఆకాశము క్రింద, భూమి మీద ఉన్న 200 దేశాలలోని జనాభా మొత్తం కూడా ఆదాము, హవ్వ అనే జంటలోనుండి పుట్టినారు అని బైబిలు చెబుతుంది. ఆదిమ జంట మనము చెప్పుకున్నాము. బైబిలు ప్రకారం వారి పేరులు ఆదాము, హవ్వ, అని Quran లో కూడా అదే ఉన్నది. వేరే మతాల వారు ఇంకా ఏ పేర్లయినా పెట్టుకోవచ్చు. ఒకే జంటలోనుండి మొత్తం అన్ని జాతులు పుట్టాయని ఈనాడు జన్యుశాస్త్రం కూడా చెబుతుంది. ఇది నమ్మినప్పుడు వసూధ మొత్తం ఏక కుటుంబం అని నమ్మడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఒకే రక్తం పంచుకొని పుట్టాము, ఒకే తల్లిదండ్రులకు పుట్టాము. అంతేకాని, బ్రహ్మ యొక్క తలలో నుండి బ్రాహ్మణుడు పుట్టాడు, భుజాలలో నుండి క్షత్రియుడు పుట్టాడు, ఉదరంలో నుండి వైశ్యుడు పుట్టాడు, పాదాలలో నుండి శూద్రుడు పుట్టాడు. మిగతా 30% జనాభా పంచములు ఎక్కడి నుండి పుట్టారో తెలియదు, అయినా వారిని మేము ద్వేషిస్తూ ఉంటాము అనే మూర్ఖపు సిద్ధాంతం ఉన్నంతవరకు వసుధైక కుటుంబం ఎలా అవుతుంది? బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య వాళ్లు పుట్టుక తోనే వాళ్ళు Separate అన్నారు. పంచముల పుట్టుక అసలు మాకు తెలియనే తెలియదు అన్నారు. మొత్తం తిప్పికొడితే ఈ దేశం లెక్క కూడా సరిగ్గా చెప్పలేక పోతున్నారు. మిగతా 199 దేశాల లెక్క వీళ్లకు తెలియదు వసుధ ఏక కుటుంబం ఎలా అవుతుంది? చైనా, ఇండియా ఎలా ఏకం అవుతుంది. వసుధైక కుటుంబం అని చెప్పిన ఏకైక గ్రంథం, First and Last Book బైబిలు గ్రంథం. భూమి మీద ఉన్న జనం మొత్తం Single family of Adam and Eve అని బైబిలు చెప్పింది. దాన్ని Genetic Science కూడా ఒప్పుకుంది. నిరూపించేది మీరు వసుధైక కుటుంబం అని గొప్ప గొప్ప ప్రచారాలు, ఆదర్శాలు ప్రచారాల కొరకే పలుకుతారు. హిందువులం బంధువులం, ధర్మ బిందువులం అని గొప్ప, గొప్ప సిద్ధాంతాలు చెబుతారు. మరి బంధువులు అయితే ఇంట్లోకి రానియ్యు, బంధువు అయితే పిల్లనిచ్చి పెండ్లి చెయు, వాళ్ల పిల్లను నీ ఇంటికి తెచ్చుకో, బంధువులే గానీ అంటరాని బంధువులు, బంధువులే గానీ మా ఇంట్లోకి రాకూడని బంధువులు. వీళ్ళు గొప్ప గొప్ప ఆదర్శాలు మాట్లాడుతారు. ప్రజలలో ఏదో ప్రచారం కొరకు మాట్లాడుతారు. తప్ప ఎప్పటి వరకు ఈ మానవ జాతి ఆవిర్భావం గురించి క్లారిటీ రాదో అప్పటి వరకు వసుధైక కుటుంబం అనే భావన ఆచరణలో సాధ్యంకాదు. మానవ జాతి ఒరిజిన్ అనే దాన్ని ఒక కామన్ పేరంటేజ్ నుంచి వచ్చిందని నమ్మినప్పుడే వసుధైక కుటుంబం అనే భావన బలపడుతుంది. ఆచరణలోకి వస్తుంది. అప్పుడు ప్రపంచం అంతం ఒక కుటుంబంగా, నిజంగానే అన్నదమ్ములాగా కలిసి ఉంటుంది.