(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: అసలు మానభంగం అనేది ఒక క్షమించరాని నేరం. మానభంగం అనేది ఎప్పుడు ఏ ఆడపిల్లకు కూడా జరుగకూడదు. ఒకసారి ఒక అమ్మాయికి మానభంగం జరిగితే ఆమె హృదయము, ఆమె శరీరం, ఆమె మనసు, ఆమె జీవితమే గాయపడుతుంది. గనుక మానభంగం జరిగితే కఠినమైన శిక్ష ఉండాలి. ఇప్పుడు వరంగల్ జిల్లాలో మీరు చెప్పినది మరి విపరీతమది. It is totally an insane act. అంటే ఏ విధంగా కూడా ఊహించటానికి కూడా వీలుకాని విషయం. ఇప్పుడు కొంత మంది రేపిస్టులను సమర్ధించేవారు ఏమంటారంటే, ఆమె Low neck blouse వేసుకున్నది శరీరాన్ని ప్రదర్శించింది ఆమె అందాలను ప్రదర్శించి మగ వాళ్ళను రెచ్చగొట్టింది కాబట్టి వాడు రెచ్చిపోయాడు. రేపులు జరగడానికి కూడా ఆడవాళ్ల వస్త్రధారణ కూడా కారణం అని చెప్పే ఒక వాదన కూడా ఉన్నది. మరి ఆ పసిపాప ఏమి అంగాంగ ప్రదర్శన చేసింది? అసలు ప్రదర్శించడానికి అక్కడ స్త్రీ దేహమే లేదు. అది ఒక పరిపూర్ణంగా స్త్రీత్వం రాలేదు. అసలు ప్రాణం ఉన్న బొమ్మలాంటిది అంతే. ఆ పాప మీద కామం ఎలా వచ్చింది? వాడు ఎలాగా చేయగలిగాడు? వాడి దేహమైన ఎలాగ తయారైయింది? ఆ పని కొరకు ఎలాగు సహకరించింది? ఇది Total గా ఉన్మాద చర్య. దీనికి అసలు క్షమాపణ లేనే లేదు. నేను ప్రజాబంధు పార్టీ పెట్టినప్పుడు మా పార్టీ మ్యానిఫెస్టోలోనే ప్రకటించాను. మానభంగ నేరస్థులకు మర్మాంగాలు ఖండించే శిక్షను, మేము అధికారంలోకి వస్తే ముందు మేము పాస్ చేసే బిల్లు అదే. మర్మాంగ ఖండనే ఈ మానభంగ నేరస్థులకు శిక్ష అని మేము ప్రకటించాము. సౌదీ అరేబియాలో మరి కొన్ని దేశాల్లో ఇటువంటి కఠినమైన శిక్షలు అమలులో ఉన్నాయి. ఎవడికైన అసలు ఆ తలంపు వస్తేనే వాడు వణికి చస్తాడు. దొంగతనం చేస్తే చెయ్యి నరికి వేయడము, మానభంగాలు చేస్తే మర్మాంగాలు ఖండించడం, మళ్లీ వాడికి లైఫ్ ఉండదు. ఒకడికి అలాంటి శిక్ష అమలు జరిగినప్పుడు ఇంకొకడు చేద్దాం అని అనుకోడు, చేయాలని తలంపు వచ్చినా వణుకు పుడుతుంది వాడికి. ఆ విధంగా ఇంకొక నేరస్థుడు తయారుకాకుండ భయపడేట్టుగా శిక్షలు ఉండాలి. బైబిల్లో లో కూడా ఒక వాక్యం ఉంది. ప్రసంగి గ్రంథం 8:11వ వచనం ఈ మాట అంటుంది ఏంటంటే దుష్ప్రక్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగక పోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయ పూర్వకముగా దుష్క్రియలు చేయుదురు అని జ్ఞానియైన సొలొమోను ప్రసంగిలో వ్రాసాడు.
అంటే Lack of proper punishment, In time punishment రావడము అనేది జరగనప్పుడు ఇంకా నేరం ఎక్కువైపోతుంది. అంటే హృదయంలో భయమనేది పోతుంది. దానికి అర్థం ఏమిటంటే దానికి Reverse లో మనం మాట్లాడుకుంటే దుష్క్రియలు చేయడానికి మనిషికి భయం పుట్టాలి. అంటే శిక్షలు శీఘ్రంగా, తీవ్రంగా ఉండాలి. అయితే మన దేశంలో ఉన్నటువంటి Penal code spirit ఏంటంటే మన శిక్ష స్పూర్తి spirit ఏంటంటే వంద మంది నేరస్థులు తప్పించుకున్న పర్వాలేదు కాని ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదు. అనే సెంటిమెంట్ మన penal code లో ఉంది. అందుకని వాడు ఆ తప్పు చేశాడా? చేయలేదా? అనేది doubtful గా ఉన్నా కూడా Benefit of doubt మీద అతనిని నిర్దోషిగా వదిలేస్తారు. కాబట్టి నేనంటున్నాను దాని ఆ సెంటిమెంట్ని Reverse చేయాలి. ఏంటంటే వందమంది నిరపరాధులకు శిక్షింప పడ్డా పర్వాలేదు కాని, ఒక్క దోషి కూడా శిక్షను తప్పించుకోకూడదు అనే Reverse of the sentiment ని అమలు చెయ్యాలి. అప్పుడు ఏమి జరుగుతదంటే ఇప్పుడు నిరాపరాధి మీదనే నింద మోపి చేయని రేప్ కూడా వాడు చేసినట్టు create చేసేది. అది అంత ఊహ జనితమైనటువంటి situation అంత easy గా జరుగదు. ఒక అబ్బాయి అసలు ఆ situation లో లేడు. ఎక్కడో వేరే ఊరిలో ఉన్నాడు. మానభంగం ఇతడు చేసాడు అంటే వైద్య పరీక్షలు ఉండాలి. ఇతని రక్తపరీక్ష ఆమె యొక్క రక్త పరీక్ష చేస్తారు. కనుక Act of intercourse జరిగిందా? forceful గా జరిగిందా? ఆ యొక్క సమస్య దర్యాప్తులోనికి వెళ్లినప్పుడు అన్యాయంగా రేప్ చేయక పోయినా సరే అతని మీద శిక్ష విధించడం అనేది Remote possible. మరి అట్లా చేయాలంటే కూడా చాలా పెద్ద నెట్వర్క్, చాలా పెద్ద ప్లానింగ్ అనేది ఉండాలి. గనుక నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రేప్ జరిగింది. అది జరిగిన అమ్మాయి శరీరాన్ని పరీక్ష చేస్తారు. ఇతన్ని పరీక్ష చేస్తారు. అది అప్పటికప్పుడు సాక్ష్యాలు పుట్టించడానికి అవకాశం లేకుండా లేనటువంటి కేసు. అందుచేత ఇక్కడ కఠినంగా శిక్ష అమలు చేయాలి. ఏంటంటే ఎంత మంది అమాయకులు శిక్షకు గురియైన పర్వాలేదు ఒక దోషి కూడా తప్పించుకోవటానికి వీలులేదు. అటువంటి కఠినమైన వైఖరి అనేది మనం అవలంబించగలిగితే ఇక మీదట ఒక్కడు, ఇద్దరు అలాగా అన్యాయంగా బలైపోతే పోవచ్చు. కాని దోషులు మాత్రం తయారు కాకుండా ఉంటారు. గనుక నా వ్యక్తిగత ఆలోచన విధానం ప్రజాబంధు పార్టీ అనే మా రాజకీయ పార్టీ యొక్క పాలసీ ప్రకటిత పాలసీ అదే, మాకు అధికారమిస్తే మేము చేయబోయే కార్యక్రమము అదే.
ప్రశ్న : ఈనాడు దళితులకు సమాజంలో ఎలాంటి విలువ లేనటువంటి సమస్య కనబడుతుంది పైగా వాళ్ళని ఎక్కడంటే, అక్కడ స్త్రీలు అని కూడా చూడకుండా అవమానించడం, కొట్టడం వాళ్ళు అధికారంలో ఉన్న సరే. మరి కాళ్ళతో తన్నడం ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. దీనికి ఎలాంటి పరిష్కారం రావాలి? సమాజంలో దీనిని ఏవిధంగా తీసుకోవాలి? ఏ విధంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది?
జవాబు: రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ మొత్తం బూడిద అయిపోయింది Because of the Automic Bomb Attack by America. మనకందరికి, చిన్న పిల్లలకు కూడా తెలుసు, నాగసాకి అనే పట్టణం మీద, ఒక టెస్ట్ Nuclear weapon ఉపయోగించారు అమెరికా. అయితే జపాన్ మళ్లి కోలుకునే అవకాశం లేదు, కాని కోలుకున్నారు. ఇప్పుడు అమెరికానే భయపెట్టేంత అగ్రరాజ్యంగా జపాన్ మారింది. దానికి కారణం ఒకటి, ఏంటి అంటే జపాన్లో