3 ప్రశ్న : “హైందవ క్రైస్తవం” అనే గ్రంథం వెనక అట్టమీద నేరుగా సత్యలోకం నుండే ఈ ప్రత్యక్షత కలిగింది అని, నా కంటే ముందు కొందరు భక్తులు వేదాలలో క్రీస్తు, “యజ్ఞము” అనే పత్రిక ఇలాంటి కొని విషయాలను తీసుకొని నా కంటే ముందు చెప్పారు అని అన్నారు. నాకు కూడా సత్యలోకం నుండి వచ్చింది అన్నారు. Already వాళ్లు చెప్పిన తర్వాత మళ్లీ మీకు సత్యలోకం నుండి రావడం ఏమిటి?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:    మొట్టమొదట “యజ్ఞము” అనేది ఒక పుస్తకంగా వ్రాసినవారు “అద్దంకి దావీదు” గారు. ఆయన మా తాతగారు.  “మండపాక కేశవరాయ శర్మ” అనే ఒక బ్రహ్మణుడు వేదములు చదివి, రక్షణపొంది భక్తసింగ్ గారి చేతనే బాప్తిస్మం పొందారు.  ఆయన కూడా “యజ్ఞము” అనే కరపత్రిక విడుదల చేసారు.  ఆ తర్వాత “పండిత్ ఫ్రాన్సిస్” గారు ఎన్నో పుస్తకాలు వ్రాసారు.   దానికి సంబంధించి 40-50 titles వ్రాసారు.  ఆయన మాకు గురుతుల్యులు, పితృ సమానులు.  వాళ్లు నాకో దారి చూపించారు.  అయితే నేను “హైందవ క్రైస్తవం”లో ఎత్తిచూపినంత విపులంగా వీరెవరూ కూడా వ్రాయలేదు.   నేను వ్రాసిన సమాచారం ఇంతకముందు భక్తులకు మక్కికి మక్కి ఎక్కడా కూడా అనుకరణ కాదు.  ఎక్కడైతే నేను వేరే వాళ్ల దగ్గరనుండి తీసుకున్నానో వాళ్ల పేర్లు అక్కడ నేను వ్రాసాను.   అక్కడున్న Matter నేను Present చేసిన విధానం మాత్రం అపూర్వం.  అందుకే Francis గారి గురించి అంత గొడవ కాలేదు, నన్ను గూర్చే అవుతుంది.   వాళ్లు చెప్పినప్పుడు అవతల వారిని ఒప్పించే ప్రయత్నం చేయలేదు.   తమకు తోచింది వ్రాసారంతే.    కానీ నేను అవతలి వారిని ఒప్పించేటంతా strong logic వాడాను.  మా తాతగారు “కె.వి. జేకబ్” గారు “నాకలోకములను సృజించిన నాదుడేసుని గొలువరే మోకరించుచు ఆయన పాదములను కొలుపుమ’ని పాట వ్రాసారు.    అందులో “సంధియము మీకెల కలిగెను, సామవేదము చదువరే అందునుండు ప్రజాపతెవ్వరు? అరయ యేసుని కానరే”అని వ్రాసారు.  మాసిలామణి గారు కూడా ఒక పాటలో వ్రాసారు “యేసే ప్రజాపతీ పరమేశం” అని.  ప్రజాపతి అంటే అది వేదంలోని మాట.  ఇలా అందరూ అనడం ఇలా అంతమంది నాకు అటు దారి చూపించారు.  అందుచేత, నాకంటూ పరిశోధన ఉండాలని 70 సార్లు చదివాను.  చదివినప్పుడు ఈ పెద్దలు చెప్పిన దానికంటే ఇంకా విశేషమైన సమాచారం అందులో కనిపించింది.  అందుచేత, పెద్దలు దారి చూపారు.  పైనుండి దేవుడు కూడా బయలు పరిచాడు.  ఈ సత్యము చెప్పిన మొదటి వాణ్ణి నేను కాదు, అని చెప్తున్నాను.  పెద్దలను దేవుడు వాడుకొని నాకో దారి చూపించాడు.  ఆ దారిలో నేను పరిశోదించినప్పుడు ఇంత సంపూర్ణమైన అవగాహన నాకు వచ్చింది.   ఇంత సంపూర్ణమైన అవగాహను ముందు ఉన్నవారికెవరికీ రాలేదు, ఉన్నా పుస్తకాలలో వ్రాయలేదు.  వాళ్లు వ్రాసింది కొంత (5%) నేను మిగతా (95%) అందులో సంపాదించాను.  అందుచేత, దేవుడు నాకు తప్పకుండా బయలు పరిచాడు, దారి చూపటానికి ఆ భక్తులను వాడుకున్నాడు.   గమ్యంచేరడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసాడు.