25. ప్రశ్న : క్రైస్తవ సమాజంలో “ISMS” ఏంటి? ఇంతకుముందు ఈ “ISMS” ఉన్నాయా? రంజిత్ ఓఫీర్ గారు ఓఫీరిజమ్ అని చెప్పేసి పిలిపించుకుంటున్నారు. అని కొందరు అడుగుతూ ఉన్నారు. దీనికి మీరు యిచ్చే జవాబు ఏంటి సార్?

-అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు
జవాబు: “ISMS” అనేది అది Theology లో మాత్రమే కాకుండా Theology అనే మాటకంటే విశాలమైనది. Philosophy మాట కంటే విశాలమైనది. Ideology అనే మాట. Theology అంటే దేవుని గూర్చిన శాస్త్రం అని అర్థం. దేవుని గూర్చిన విజ్ఞానం అని అర్థం. Theo అంటే దేవుడు. Philosophy అంటే మన భావజాల పరంపర. ఆయా సామాజిక విషయాల పట్ల మనకున్న అభిప్రాయాలు, దాన్ని మనం చూసే విధానం, మన దృక్కోణం. Philosophy అంటే కష్టసుఖాలను, ఈ ప్రపపంచంలోని స్థితిగతులన్నిటినీ ఏ దృక్కోణంలో చూస్తాము అన్నది. Everyone has got his own philosophy. అయితే వీటన్నిటిని మింగేటటువంటి యింకో మాట “IDEOLOGY” దేవుని గూర్చిన ఆలోచన గాని ప్రపంచంలోని స్థితిగతులను గూర్చి ఆలోచన Philosophyగాని, ఇదంతా మెదడుకు సంబంధించింది. IDEALOGY. ఇది Ideology term అది. Ideology ని గూర్చిన term అది ఇంతకుముందు క్రైస్తవ సిద్ధాంత కర్తలలో “CALVIN” అనే ఒక అతను ఉండేవాడు. He is a christian Theologian. CALVIN ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటి అంటే – Unconditional Eternal Security of a christian Believer.
Unconditional Eternal Security అంటే బేషరత్తుగా ఒకసారి నీవు నమ్మి బాప్తిస్మము పొంది, నూతనంగా తిరిగి జన్మించితే ఆ తరువాత ఎట్టి పరిస్థితులలోను నీ రక్షణ నువ్వు కోలోపోవడం అన్నది ఉండదు. అనేది CALVIN గారు చెప్పారు. మరీ…. అంటే తరువాత ఇక నువ్వు వ్యభిచారం చేయొచ్చు, నరహత్య చేయొచ్చు ఏమన్నా చేయొచ్చా? అంటే ఏమైతే అది చేస్తే చేస్తావు గాక! అప్పటి పరిస్థితులను బట్టి మీ ద్వారా అవసరాన్ని బట్టి పరిస్థితుల వత్తిడిని బట్టి నువ్వు ఏమైనా చేయొచ్చు, అయితే నీ చర్యలనుబట్టి నీ రక్షణ మాత్రం పోదు. నీ బహుమానం పోతుంది. తీర్పు దినాన గద్దింపు ఎదుర్కొంటావు తప్ప నరకానికి వెళ్ళేది మాత్రం అసంభవము. i. e., Unconditional Eternal Security.
దీనిని CALVIN గారు బలంగా వినిపించారు. ఈ వాదనను ఆరోజుల్లో “CALVINISM” అని కూడా అన్నారు. So, Christian Theology లో CALVINISM అనేది కూడా ఒక దశలో వచ్చింది. ఇప్పుడవన్నీ Internet access ఉన్నవాళ్లు CALVINISM అని కొడితే చాలు దాని గురించి Page Open అవుతుంది. CALVIN యొక్క teaching ఏంటి అనేది తెలుస్తుంది. అందుచేత యిప్పుడు Scientific Ideology లో, Science గురించిన Ideology వస్తే ఒక specific ఆలోచన విధానాన్ని, ఒక specific దృక్కోణాన్ని, ప్రత్యేకంగా దృక్కోణాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి DARWIN అనుకుంటే అది అతనికే Peculiar. అతనిలాగా అంతకంటే ముందు ఎవరుగాని అంత Systematic గా చెప్పలేదని దాన్ని DARWINISM అన్నారు. అలాగే Political Ideology వస్తే రాజకీయాలను సామాజిక అంశాలను అట్ల విశ్లేషించి అంత పకడ్బందిగా Well-Arranged గా చెప్పగలిగినవాడు యింతకుముందు ఎవడు లేడు అందుచేత దానిని MARXISM అన్నారు KARL MARXISM అలాగే Christians లోకి వస్తే CALVINISM ఉంది. So, Whether it is christianity or political affairs, political Ideology or general philosophy ఏదైనా సరే ఒక భావజాలాన్ని నిర్దిష్టంగా, నిర్వచించి అతిస్పష్టంగా ఇక ఎవరు కాదనడానికి వీళ్ళేకుండా చెప్పగలిగితే ఇటువంటిది ఈ ప్రపంచానికే క్రొత్తది అనుకుంటే గనుక దానికి ఆ మనిషి ప్రక్కన “ISM” పెడతారు. So, దాంట్లో యిదేమి Anti-christian Word ఏమి కాదు.