1.Q: A GOOD HUMAN BEING (KSM 01)

⭐ ప్రశ్న: రంజిత్ ఓఫీర్ గారి గురించి ప్రజల అంచనా ఏమిటి? ఆయన మట్టుకు ఆయన అంచనా ఏమిటి?
(0:04:12)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03:09)

  • 👤 ప్రజల అంచనా: నా మట్టుకు నేను యదార్థంగా నమ్మేది ఏంటంటే.. నన్ను గూర్చిన అంచనా, నేను ఒక పాస్టర్ అని కొంతమంది, సామాజిక సంస్కర్తనని, రచయితనని, కవినని, గాయకుడని.. ఇలా రాజకీయ నాయకుడు కూడా ఈ మధ్య నేను అలాగ పరిణామం చెందడాన్ని, అనాధలకు దిక్కునని వారికి సహాయం చేస్తూ సేవ చేస్తున్నానని.. ఇలా నన్ను రకరకాలుగా మనుషులు రకరకాల కోణాలలో చూస్తున్నారు.
  • ❤️ సొంత అంచనా: కానీ నా మట్టుకు నన్ను గూర్చిన అంచనా ఏంటంటే.. నేను ఒక మంచి మనిషిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే. ఐ వాంట్ టు బి ఏ గుడ్ పర్సన్ (I want to be a good person).
  • 🇮🇳 బాధ్యతాయుతమైన పౌరుడు: సమాజంలో భారతదేశ పౌరుడిని అయితే ఒక బాధ్యత గల పౌరుడ్ని కావాలి. ఒక క్రైస్తవుడిని అయితే, ఒక క్రైస్తవుని నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు, రక్షకుడైన యేసు ఏం ఆశిస్తున్నాడు.. ఆ ప్రకారంగా నేను ఉండాలి. ఐ వాంట్ టు సాటిస్ఫై క్రైస్ట్ అండ్ డూ మై డ్యూటీ టు ద సొసైటీ (I want to satisfy Christ and do my duty to the society). నా మనస్సాక్షిని బట్టి నేను ఏం చేసినా నేను చేశాను.
  • ⚖️ సందర్భోచిత స్పందన: కాబట్టి, యాస్ ద నీడ్ అరైజెస్ రైజింగ్ టు ది అకేషన్ (As the need arises, rising to the occasion) అంటారు. అంటే పరిస్థితులను బట్టి సిచుయేషనల్ గా ఒక మనిషిగా మానవత్వాన్ని ప్రదర్శించడానికి ఏది అవసరమో అది నేను చేశాను. అందుచేత ఆ క్రమంలో భాగంగానే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ (RKP) వచ్చింది. ఎందుకంటే క్రైస్తవుల మీద అన్యాయంగా దాడులు జరుగుతున్నాయి, చర్చిలు కూల్చివేస్తున్నారు, పాస్టర్లను చంపుతున్నారు, క్రైస్తవ సన్యాసినులను మానభంగాలు చేస్తున్నారు.. ఎక్కడ కూడా శిక్ష అనేది జరగడం లేదు. అందుచేత హక్కుల కొరకు పోరాడాలి అనే ఒక సందేశంతో, ప్రయత్నంతో ఆర్కేపి అనేది పెట్టాము.
  • 📢 రాజకీయ రంగ ప్రవేశం: అలాగే రాజకీయ రంగం.. రాజకీయ రంగంలో ఒక గ్యాప్, ఒక శూన్యం అనేది ఏర్పడింది. ముస్లిం అయినా, హిందువునైనా ముందేదో భారతీయ పౌరుడిని. దేశం పట్ల కూడా నాకు బాధ్యత ఉన్నది. మరి అధికార యంత్రాంగం ప్రవర్తిస్తున్న విధానాన్ని ప్రశ్నించాలంటే, ఒక రాజకీయ పార్టీగా ఉండి ప్రశ్నిస్తే ఆ వాయిస్ అనేది గుర్తించబడుతుంది. అందుచేత పార్టీ పెట్టాము. సో పార్టీ పెట్టడం అనేది అదేదో ఇల్లీగల్ యాక్టివిటీ కాదు.. రాజ్యాంగబద్ధంగా మనకు ఉన్నటువంటి హక్కుల్లో అది ఒకటి. ప్రతి పౌరుడు పార్టీ పెట్టుకోవచ్చు.
  • 🕊️ మనస్సాక్షి సాక్షిగా: అంచేత నేను పార్టీ పెట్టినా, ఆర్కేపి పెట్టినా, అనాధ శరణాలయం పెట్టినా.. ఏ కార్యక్రమాలు చేసినా నేను ఒక మనిషిని, నా మనస్సాక్షి నాకు ఉన్నది. అయ్యో ఇక్కడ తప్పు జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, మనవంతు కృషి ఏదో చేద్దాం, ఆ సిచుయేషన్ లో మనం ఒక మంచిని నిలబెడదాం అనే ఉద్దేశంతో చేశాను. ప్రతి ప్రయత్నం చేసినప్పుడు నాకు కొంతమంది విరోధులు, శత్రువులు, విమర్శకులు తయారయ్యారు.. పర్వాలేదు. అందరూ నన్ను మంచోడు అనాలి అనే ఉద్దేశంతో నేను పనులు చేయడం లేదు, నా మనస్సాక్షి అయినా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాను.

Detailed English Translation:

⭐ Question: What is the people’s estimation of Ranjith Ophir? What is his own estimation of himself?

  • Public Perception: People view me in various ways—as a pastor, social reformer, writer, poet, singer, and recently as a politician, or as a helper to orphans.
  • Personal Goal: My own assessment is simply that I am trying to be a good human being. I want to be a responsible citizen of India and a Christian who satisfies what Christ expects.
  • Humanitarian Response: Rising to the occasion, I do what is necessary to show humanity based on the situation. This led to the formation of the Rashtriya Kraistava Parishad (RKP) to fight for rights when Christians and churches were being attacked without justice.
  • Political Responsibility: I entered politics to fill a void and question the administration with a recognized voice. Establishing a party is a constitutional right. My goal isn’t to please everyone but to act according to my conscience and stand for what is right.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram