-అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు
జవాబు: అది మనం ఊహించగలం కానీ ఖచ్చితంగా చెప్పలేము. గర్భిణీస్త్రీకి ప్రసవ వేదన వచ్చు విధముగా, ఆ రీతిగానే ఈ శ్రమలకాలం వస్తుంది. యేసు ప్రభువు రాకడ దినం వస్తుందని 1థెస్సలోనికి 5వ అధ్యాయంలో పౌలు చెప్పాడు. ఇప్పుడు గర్భిణీస్త్రీకి ప్రసవవేదన అంటే ఎప్పుడు వస్తుంది? 9 మాసాలు నిండాలి. నిండిన తర్వాత ఇప్పుడో, అప్పుడో అని ఉజ్జాయింపుగా start అవుతుంది. అప్పటికైనా మనం అనుకున్న date లోనే నొప్పులు రావు. వారం ముందైనా, వారం late అయినా అమ్మాయి ప్రసవిస్తుంది. అలాగే యేసు రాకడకు ముందు జరగవల్సిన సూచనలన్నీ జరగాలి. జరిగిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా బైబిల్లో ఉన్న ఆధారం ప్రకారం సిరియా లేక ఇరాక్ రాజు ఇశ్రాయేలు దేశములో ప్రవేశించి “నేనే దేవున్ని అని యెరూషలేము దేవాలయములో నన్నే మ్రొక్కండి” అని demand చేసిన తర్వాత any movement లోనైనా యేసుప్రభువు వస్తాడు. సంఘం ఎత్తబడుతుంది. అంతకన్నా 42 నెలలకు ముందే అతడు one world government ఏర్పాటు చేస్తాడు. అంటే ప్రపంచ ఏకాధిపత్యము వచ్చిన తర్వాత 42 మాసాలు దాటినాక any moment యేసుప్రభు వస్తాడు. ఇప్పటినుండి ఎంత టైం అని నన్ను అడిగితే. ఇప్పటినుండి one world రావటానికి ఎంత టైం కావాలో మీరు చెప్పండి. యేసు ఎప్పుడు వస్తాడో నేను చెబుతాను.