(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ప్రపంచ వ్యాప్తమైన క్రైస్తవ సంఘము పట్ల నాకున్న భారము, కార్యక్రమము ఏమిటంటే, యేసే నా రక్షకుడు అని నమ్మిన వాళ్లు, బైబిల్ నాకు ప్రామాణికం అని నమ్మిన వారందరూ మొదటి శతాబ్దంలో పౌలు ఏది ఆచరించాడో అదే ఆచరించాలి. ఆదిమ అపోస్తలుల బోధలోకి అందరినీ నడిపించడం, సకల డినామినేషన్ వారు పౌలు ఏ బాప్తిస్మం ఇచ్చాడో అదే బాప్తిస్మం ఇవ్వాలి. పౌలు ఏలాగు సువార్త చెప్పాడో అలాగే చెప్పాలి. పౌలు పరిశుద్ధాత్మను గూర్చి, యుగాంతం గూర్చి ఏమి చెప్పాడో అదే చెప్పాలి. ఆ విధంగా అందరినీ educate చేసి ఇదే పౌలు బోధ, సత్యబోధ అని అందరినీ convince చేసి ఏక విశ్వాసం లోనికి నడిపించడం. అంటే యూదా పత్రిక 3వ వచనం నెరవేర్చటం నా యొక్క Global vision.