(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: సందర్భము ఏమిటి అంటే ఒక విషయము, ఆ రెండిటిని గూర్చి చెప్పాలంటే నాకు కుటుంబ జీవితంలో చాలా గాయం తగిలింది అని అందరికి తెలుసు. అయితే చాలామంది అనుకునేది ఏంటంటే కుటుంబము కుప్పకూలి పోయినప్పుడు అయ్యగారు ఒంటరి అయిపోయినప్పుడు, కృంగిపోయి ఉండి తరువాత కోలుకొని ఆ పాట వ్రాసుంటాడు అని చాలా మంది అనుకుంటున్నారు. అది తప్పు. “మేలాయోను ప్రభు” అనే పాట వ్రాసినప్పుడు ఇంక నాకు అసలు పెళ్ళే కాలేదు, బ్రహ్మాచారిని నేను. మరి పెళ్ళేకాకముందు ఏంటి? శ్రమలోచ్చినాయి అంటే అప్పుడు కూడ శ్రమలొచ్చినాయి. శ్రమపడడానికి భార్య అక్కర్లేదు. దుష్టుని వశములో ఆధీనంలో పరిపాలనలో ఈ లోకం అంతా ఉన్నది. వాడి వశములోనికి కొన్ని సార్లు తాత్కలికంగా విశ్వాసులు కూడా వచ్చేస్తున్నారు, ప్రవేశిస్తున్నారు. కొంతమంది భక్తులు, ప్రసంగీకులు, దైవజనులు కూడా సౌలు లాగా దావీదు మీద విషపు చూపు నిలిపినట్టు నా మీద విషపు చూపు నిలిపారు. విమర్శలు, అనేకమైనటువంటి నిందారోపణలు, ఎన్నెన్నో ఇంక అవన్నీ ఇప్పుడు చెప్పాలంటే పెద్ద గ్రంథం వ్రాయాల్సివస్తుంది. గనుక ఒకసారి నేను దేవుడ్ని అడుగుతున్నా. నాకు పెళ్ళే కాలేదు అప్పుడు. నాకు పెళ్ళి అయింది 27 సంవత్సరాల వయస్సులో మొట్టమొదటిసారి Rock Church లోనే పెళ్ళి జరిగింది. ఈ పాట వ్రాసినప్పుడు 25 ఏండ్లే నాకు. పాట వ్రాసినాక 2 సంవత్సరాల తరువాత నేను పెళ్ళి చేసుకున్నాను. అయితే దేవుడ్ని అడుగుతున్నాను “నన్నెందుకు ఇన్ని బాధలు పెట్టావు? ఇంతమంది నన్ను అపార్థం చేసుకుంటున్నారని. ఇప్పుడే కాదు అప్పటి నుంచి, మొదటినుంచి కూడా నేను అపార్థం చేసుకోబడ్డ వ్యక్తినే. అంటే జనాల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, వాళ్ళకు తెలియంది క్రొత్త సంగతి ఎవడు చెప్పినాకూడా వాడు అబద్ధ ప్రవక్త. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు సర్వజ్ఞులు కాబట్టి. వాళ్ళకన్నీ తెలుసని వాళ్ళు అనుకుంటారు భ్రమలో. గనుక వాడికి తెలియంది ఏదైనా చెప్తే వాడు తప్పకుండా అబద్ధమై ఉంటుంది. సత్యమై ఉంటే నాకు ముందు తెలిసి ఉండాలి కదా! మరి నేను సర్వజ్ఞుడిని కదా! అనే Foolish, Stupid attitude ని బట్టి మొదటినుండి నేను ద్వేషించబడ్డాను, దూషించబడ్డాను, వ్యతిరేకించబడ్డాను. చాలా నన్ను వేదనలపాలు చేసారు. దేవుడ్ని అడిగాను ఎందుకిన్ని శ్రమలు పెట్టావు నన్ను అని. దేవుని చల్లని, మెల్లని స్వరం నాకు వినబడింది. హెబ్రోను సీయోను గీతాల పాటలు పుస్తకలలో “క్రీస్తుని స్వరమే విందుము ప్రభువే పలికినప్పుడు చల్లని స్వరమే అది మెల్లని స్వరమే అది” అని ఒక పాట ఉంటది. ఆ అనుభవం నాకున్నది. దేవుడు నాతో మాట్లాడాడు. మాట్లాడి ఏమన్నాడంటే “నా కుమారుడా, ఇన్ని శ్రమలు పెట్టాను అని నీవు నన్నడుగుతున్నావు, బాధపడుతున్నావు నేనేదో నీకు అన్యాయంగా బాధకలిగించానని నువ్వు బాధపడుతున్నావు గదా! నేనొక ప్రశ్న అడుగుతాను నీలోనికి నువ్వు చూస్కో ఈ శ్రమలన్ని రాకముందు నీలో ఉన్న పరిశుద్ధత ఎంత? ఈ శ్రమలు వచ్చి గడిచిపోయిన తరువాత ఈవేళ నీలో ఉన్న పరిశుద్ధత level ఎంత? ఆ మట్టం ఎంతుందో చూస్కో చూస్కోని మళ్ళీ సువ్వు నాతో మాట్లాడు” అని అన్నాడు. అట్లాగే మోకరించి నాలో నేను బాగా స్వపరీక్ష చేసుకున్నప్పుడు నాకర్ణమైంది. ఈ శ్రమలన్నీ రాకముందు కొన్ని విషయాలు తప్పు చెయొచ్చులే, పరవాలేదులే, యిదేమి పెద్ద తప్పుకాదులే అని అనిపించే కొన్ని కార్యాలుగాని, తలంపులు గాని ఈ శ్రమలొచ్చిపోయినాక అయ్య బాబోయి ఇంత ఘోరమైన తప్పుని ఎలా చెయ్యాలి? అనే భయమనేది నాలో పుట్టింది. అవే పనులు ఒకప్పుడు ఆ పరవాలేదులే అనిపించి. ఇప్పుడు ఇంత ఘోరమైనా దుష్కార్యమా నేనెలా చేయాలి అనిపిస్తుంది. అప్పుడు దేవుడిని అడిగాను దేవునికి నేను సమాధానం చెప్పాను. అవును ప్రభువా ఈ శ్రమలు రాకముందు పాపమంటే నాకు పరవాలేదులే అని ఉండేది. ఇప్పుడు పాపమంటే భయమేస్తుంది. “ప్రతిగాయము పరిశుద్దత పెంచెను” అని ఆ పాట వ్రాసానన్నమాట అందులో. అదే గదా నేను వ్రాసింది. మరి.., “నా వేదనలో నిను రుచియించితి. ప్రతి గాయము పరిశుద్ధత పెంచెను. అలాగ అప్పుడు నిజంగా దేవుని స్తుతించాను. తరువాత “నీ వాక్యమే శ్రమకొలిమిలో” అనే విషయం వేరు అప్పటికే నాకు పెళ్లైంది. నా భార్య నాకు దూరమైపోయింది. ఒంటరి జీవితం జీవిస్తున్నాను అప్పుడు మళ్లీ నాకొక భయంకరమైన పెను
శోధన వచ్చింది. ఆ శోధనలో నేనేమనుకున్నానంటే “ఇంక నేను దేవుని సేవకు పనికి రానేమో”, ఇలాంటి పరిస్థితి. ఒకవైపేమో కుటుంబం కూలిపోయింది. ఏం సాక్ష్యం ఉన్నది కుటుంబాన్ని కాపాడుకోలేదు భార్యను మార్చుకోలేనోడు దేశానికేం బోధ చేస్తాడని కొంతమంది అనడం. పిల్లలు దూరమయ్యారు. అదొక మనో వేదన. దానికితోడు మళ్ళీకొంతమందికి నేను మొదటినుండి. I was centre of attraction for many people. చాలామంది నా వెంట పడతా ఉన్నారు. They liked me. They say – they loved me. They wanted me. ఈ ప్రరిస్థితులన్ని చూసినప్పుడు ఇక నేను దేవుని సేవకు పనికిరానేమో అని నేను దేవుడి సేవకు Resign చేసేది. ఒకప్పుడు ECIL లో ఉద్యోగానికి Resign చేసా. ఇప్పుడు సేవకు Resign చేసి నేను Normal విశ్వాసిగా బ్రతుకుతాను. నేను పనికిరానయ్య అని చెప్పి అప్పుడు ఇల్లందుకెళ్తున్నాను. ఇల్లందుకు వెళ్తూ బస్లో ఎంత వేదన పడ్డానంటే ఈ బస్ నుండి దిగేది నేను కాదు నా శవమే అనుకున్నానన్నమాట. నా శవమే దిగుతుంది. నేను బ్రతకను ఇంక చచ్చిపోతాను తీసుకో ప్రభువా అని అప్పగించేసుకున్నా నేను. ఆ తరువాత దిగాను, బ్రతికే ఉన్నాను, ఇళ్ళందు కెళ్ళాను. అక్కడ CSI సంఘ సభ్యులు, నాయకులు, అభిషిక్తులు Solomon Uncle గారు అని ఉన్నారు. వారి కుమార్తె Shakeelama అల్లుడు Sampath బాబు ఇంకా నా అనుచరులే, నా శిష్యులే. వాళ్ళ ఇంట్లో నేను మోకరించి ప్రార్థనచేసి కన్నీటి ప్రార్థనతో ఆ పాట వ్రాసాను. “నీ వాక్యమే శ్రమ కొలిమిలో “. అంత భయంకరమైన శోధనలో నన్ను బ్రతికించింది ఏంటంటే దేవుని వాక్యము. దేవుని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటంటే “నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప కృప నాకాదరణ కలిగించెను. నేను పడిపోతిని అనుకొంటిని గాని నేను పడిపోలేదు”. అనే భక్తుని యొక్క మాటలన్నీ చూసినప్పుడు ఓహో మనుషులు ఏదో అనుకుంటారు తప్ప దేవుడు మనలను నీతిమంతులని ఎంచినంత వరకు దేవుడు తన నీతిని మనమీద కప్పినంతవరకు ఈ లోకం యొక్క Certificate మనకు అక్కరలేదు అనే సంగతి దేవుడు అప్పుడు నేర్పించి. ఈ శ్రమల కొలిమిలో చచ్చిపోవాల్సినోడ్ని, శవమే దిగుతుంది బస్ నుండి నేను కాదు అనుకున్నప్పుడు “నన్ను బ్రతికించింది నీ వాక్యమే” అని అంటూ మళ్ళీ ఆ పాట వ్రాసా. ప్రతి పాట వెనుక చిన్న గ్రంథము వ్రాయల్సినంత చరిత్ర.