(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఒక మనుష్యునిలో పరిశుద్దాత్మ ఉన్నాడా, లేడా? అనేది ఇప్పుడు మనకెందుకు సమస్య అయ్యిందనేది ప్రశ్న? నా యెదురుగుండ ఒక మనిషి ఉన్నాడు. అతనిలో పరిశుద్దాత్మ ఉన్నాడా? వెళ్ళిపోయాడ అని నేను తెలుసుకుని చేసేదేముంది? అంటే అతనియొక్క నడిపింపు కిందికి నేను పోవాలి అనుకున్నప్పుడు ఈ ఫ్యాక్టర్ అవసరం అవుతుంది.
ఇప్పుడు మీరే ఉన్నారు, మీలో పరిశుద్ధాత్మ ఉన్నాడా? లేడా? అని నేను తెలుసుకోకపోతే, ఒక వేళ మీరు నన్ను గైడ్ చేస్తున్న లీడర్ అయ్యుంటే గనుక మీ యొక్క నాయకత్వం, మీ యొక్క సలహా సూచన మేరకు నేను నడుస్తూ ఉంటే, ఒకవేళ పరిశుద్ధాత్మ వెళ్ళిపోతే మీలోపలికి వేరే ఆత్మ వచ్చి ఉండొచ్చు. లేకపోతే మానవ జ్ఞానంతో మీరు నన్ను నడిపిస్తూ ఉండొచ్చు. ఎలాగైనా డేంజర్! అలాంటి కారణాల్లో, అలాంటి ప్రత్యేక సందర్భాల్లో, పరిశుద్ధాత్మ ఉన్నాడా? వెళ్ళిపోయాడా అన్న ప్రశ్న అవసరం అవుతుంది…….
పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడేవారు, పరిచర్య చేసేవాడు, నడిపింపు, నాయకత్వాన్ని జరిగించేవాడు ఎప్పుడూ కూడ లేఖనాలకు పెద్ద పీట వేస్తాడు. యేసును గొప్ప చేయడానికి ఆయన ప్రప్రథమంగా ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, ఆయన నన్ను ఘనపరచును, నన్ను మహిమపరచును. అని యేసయ్య చెప్పాడు.
నజరేయుడైన యేసు, మరియ కుమారుడైన యేసును ఘనపరిచే పరిచర్య ఎప్పటికీ కూడ సైతాను చెయ్యడు. యేసును కించపరచి, ఆయన అసలు దేవుడే కాదనో, ఆరాధనకు యోగ్యుడు కాదనో, చెప్పే మర్మాలన్నీ బైబిలోనే ఉన్నాయని అలా చెప్పే ప్రతి ఒక్కడు కూడ ఆత్మాభిషేకం కాకుండా సొంత జ్ఞానముతోనైనా లేకపోతే దురాత్మల ద్వారైనా మాట్లాడుతున్నాడు. మనం బైబిల్ మీద గురి పెట్టుకోవాలి. బైబిల్ పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడింది. బైబిల్ లోని వ్యాఖ్యానాలకు, వాక్యాలకు, వచనాలకు అడ్డంగా ఎదురు వచ్చి మాట్లాడే భోదకులు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నారని నమ్మటానికి వీలు లేదు. ఎందుకంటే బైబిల్లో ఒక్కమాట రాసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడే ఇంకొక మనిషి మీదికి వచ్చి ఆ మాటకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతాడు? ఔనని చెప్పి కాదనువాడు కాదు కదా?
ఎవరినైతే వెంబడించాలి, నాయకులుగా గౌరవించి, వాళ్ళ వెనక నడవాలని విశ్వాసులు అనుకుంటున్నారో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ సేవా విధానము, వాళ్ళ భోదన బైబిల్ ప్రకారంగా ఉన్నయా? మాకు తెలిసి బైబిల్ డైరెక్ట్గా చెప్పిన మాటలకు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? యేసు నామాన్ని గొప్ప చేస్తున్నారా? తగ్గిస్తున్నారా? ఈ రెండు చూసుకుంటే అక్కడుంది పరిశుద్ధాత్మో, కాదో తెలిసిపోతుంది.
చిన్న ఎక్సాంపుల్, ఏదో పెద్ద భోదకుడిగా, చెలామణి అవుతున్న ఒకాయన ఉన్నాడు. ఆయన్ని మేము నిక్క్ నేమ్ ‘భయశాలి’ అని పిలుస్తాం. ఆయన ఎవరో అందరికి అర్థం అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అతడు, ప్రార్థన చెయ్యొద్దనే సిద్ధాంతం, తన శిష్యులకు నేర్పించారు మరి బైబిల్ నిండా, ఏలియా, అబ్రాహాము,ఇస్సాకు, యాకోబు, దానియేలు ప్రార్థనచేశారు. మన రక్షకుడైన యేసు ప్రభువు కూడ ప్రార్ధన చేసాడు. వీరు ప్రార్థన చేసారు, చెయ్యండని నేర్పించారు. మీరు విసుగక నిత్యం ప్రార్ధన చేయండి, ఎడతెగకుండా ప్రార్థన చేయమన్నాడు. అని యేసు ప్రభువు చెప్పాడు. మీరెప్పుడు ప్రార్ధన చేయండి. అని పౌలు కూడ చెప్పాడు. మరియు పౌలు రచనల నిండా ప్రతి స్థలమందును ప్రార్ధన చేయువారే సంఘం అంటాడు. బైబిల్ నిండా ప్రార్థన చెయ్యండి, చెయ్యండి, చెయ్యండి! అని దేవుడు చెప్పి, రక్షకుడు చెప్పి, ప్రవక్తలు చెప్పినాక; ఇవాళ ఈయన వచ్చి నాకు చాలా గొప్ప మర్మం తెలిసింది, ప్రార్థనే చేయొద్దు అన్నాడంటే, డెఫినెట్గా అది పరిశుద్ధాత్మ స్వరం కాదు. అది దురాత్మ స్వరం.
అయితే ఆయనతో దురాత్మ ఉన్నదని కూడ నేననుకోవడం లేదు. మానవాత్మే మాట్లాడుతుంది. పరిశు ద్ధాత్మ లేదు, దురాత్మ లేదు! బాగా అహంభావం, నాకు బాగాతెలుసు అని విర్రవీగిన మనస్తత్వం. అట్లాగే ఇప్పుడు యేసు ప్రభువు దేవుడు కాదంటాడాయన. పౌలు భక్తుడు యేసు సర్వాధికారియైన దేవుడైయుండి, నిరంతరం స్తోత్రార్హుడన్నాడు. పౌలు భక్తుడు తీతు పత్రికలో ఆయన మహా దేవుడు మన రక్షకుడన్నాడు. మరి బైబిల్ నిండా యేసుప్రభువు వారు దేవుడు, దేవుడని ఉంటే ఆయన ఉండి యేసు దేవుని కుమారుడే గాని దేవుడు కాదంటాడు. Definitely that is not the voice of the Holy Spirit.