(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఖచ్ఛితంగా ఉంటాడు. కృపాకాలమైతే పరిశుద్ధాత్ముడు ఉండకపోవడం ఏంటి? ఆయన నిత్యుడగు ఆత్మ అని ఉంది బైబిల్ లో! ఆయన ఉండని కాలమెప్పుడు ఉండదు. ఆ లెక్కనా ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, సృష్టి ఆరంభంలో తండ్రియైన దేవుడు సృష్టి చేస్తున్నాడు, తన కుమారుణ్ణి వాక్యరూపంలో ఆయన వాడుకుంటూ సమస్తము వాక్యమైయున్న కుమారుని ద్వారా తండ్రియైన దేవుడి నోటి పలుకులద్వారా సృష్టింపబడింది. అప్పుడే దేవుని ఆత్మ అగాధ జలములమీద అల్లాడుతూ ఉన్నాడు. రక్షణ కార్యంగాని సృష్టి కార్యంగాని మనలను సంరక్షించే కార్యంగాని, సృష్టి స్థితి లయములు ఈ ముగ్గురు వ్యక్తులు కలిసే చేస్తారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిసే సృష్టించారు. కలిసే మనకు విమోచన ప్రణాళిక సిద్ధము చేసారు. వారు ముగ్గురు కలిసే ఏక వ్యక్తి. గనుక వారు ముగ్గురు కలిసే ఏదైనా చేస్తారు. ఏ యుగమైన, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కలిసిన యుగమే గాని తండ్రి యుగం వేరు, కుమారునియుగం వేరు, పరిశుద్దాత్ముని యుగం వేరు కాదు అలాగుండదు నాయనా!