1066.Q: The Symbolism of 28 Lessons in Pramana Vakyam (KSM 224)

❓ ప్రశ్న: ‘ప్రమాణ వాక్యం’ గ్రంథంలో చెప్పబడిన 28 పాఠ్యాంశాలు దేనికి సాదృశ్యం? సృష్టి దినాలు, పండుగలు మన రక్షణకు ఎలా పోలికగా ఉన్నాయి? (1:23:21)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (10m 38s)

  • 📜 నాలుగు రక్షణ సాదృశ్యములు: మన రక్షణకు నాలుగు రకాల సాదృశ్యములు ఉన్నాయి. సృష్టి కథనములో ఉన్న ఏడు దినాలు మన రక్షణకు ఒక పోలిక.. అది ఒక సాదృశ్యం. ఏడు పండుగలు మన రక్షణకు పోలిక.. అదొక సాదృశ్యం. ఇశ్రాయేలీయుల అరణ్య యాత్రలో ఏడు ఘట్టాలు మన రక్షణలోని ఏడు ఘట్టాలకు పోలిక. అలాగే ప్రత్యక్ష గుడారములోని ఏడు ఉపకరణాలు మన రక్షణ జీవితంలోని ఏడు ఘట్టములకు పోలిక.
  • ⚖️ యేసునాధుని వ్యక్తిత్వము మరియు పరిచర్య: ఇవి మన రక్షణను గూర్చి మాత్రమే కాదు.. యేసునాధుని వ్యక్తిత్వము మరియు ఆయన పరిచర్యను కూడా ఈ ఏడు మెట్లు చూపిస్తున్నాయి. ఉదాహరణకు పస్కా పండుగ తీసుకుంటే, పండుగల్లో అది మొదటిది. సృష్టి దినాల్లో మొదటిది వెలుగును సృష్టించుట. ప్రత్యక్ష గుడార ఉపకరణాల్లో మొదటిది బలిపీఠం.
  • 🛡️ సంపూర్ణ సిద్ధి: ఇవి చూసినప్పుడు ఒక విశ్వాసిని దేవుడు రక్షించి సంపూర్ణ సిద్ధిలోకి తీసుకెళ్ళడం అనే కోణములో ఆ స్టడీ ఉంటుంది. సంఘ చరిత్రలో ఏడు ఘట్టాలు కూడా ఇందులో ఉన్నాయి. అపోస్తలులకు ఒక్కసారి అప్పగించబడ్డ బోధ ఇది మాత్రమే అని నిరూపించడానికి ఇది పనికొస్తుంది.
  • 🕊️ ఐదవ మెట్టు అనుభవం: సృష్టిలోని ఐదవ దినమున జలచరములను మరియు ఆకాశ పక్షులను దేవుడు సృష్టించాడు. మన రక్షణ అనుభవంలో ఐదవ మెట్టులో ఒక చేప యొక్క అనుభవం (జీవజలములలో ఈదులాడటం), ఒక పక్షిరాజు యొక్క అనుభవం (భూమి ఆకర్షణను జయించి ఎగరడం) రెండు పొందుతాము.
  • పరిశోధన మరియు క్రమము (Order): ఒక్క పండుగలే కాదు.. ఉపకరణాలు, యాత్రా ఘట్టాలు, సృష్టి దినాలు ఒక్కొక్కటి అనేక పాఠాలు నేర్పిస్తాయి. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆర్డర్ (ORDER) ముఖ్యం.. ఏది ముందు, ఏది తర్వాత అనేది ముఖ్యం. అందులో వేల కొద్దీ పాఠాలు ఉన్నాయి, అదొక బ్రతుకాలం సరిపోతుంది ఆ పరిశోధనకే.

Detailed English Translation:

❓ Question: What are the 28 lessons mentioned in the Pramana Vakyam a symbol of? How do the days of creation and the festivals compare to our salvation?

  • Four Symbols of Salvation: There are four major symbols of salvation: The seven days of creation, the seven festivals of Israel, the seven stages of the Israelites’ wilderness journey, and the seven furnishings of the Tabernacle. Each of these illustrates seven distinct phases in the life and salvation of a believer.
  • Personality and Ministry of Christ: These steps not only explain our salvation but also reveal the personality and ministry of the Lord Jesus. For example, the first festival is Passover, the first act of creation is Light, and the first furnishing in the Tabernacle is the Altar of Sacrifice.
  • The Experience of the Fifth Step: On the fifth day of creation, God made aquatic creatures and birds. In the fifth step of our spiritual experience, we gain the attributes of a fish (swimming in living waters) and an eagle (overcoming the earth’s gravity to fly high).
  • The Importance of Order: Whether it is the festivals, furnishings, or days of creation, the “ORDER” is crucial. This systematic study reveals thousands of lessons that could take a lifetime to research fully. This is the ultimate doctrine entrusted to the apostles.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram