❓ ప్రశ్న: హృదయం గురించి బైబిల్‌లో రెండు రకాలుగా ఉంది—ఒకటి ‘ఘోరమైన వ్యాధి గలది’ (యిర్మీయా 17:9) అని, రెండోది ‘జీవధారలు బయలుదేరును’ (సామెతలు 4:23) అని. ఈ రెండు వేరు వేరు వాక్యాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? (0:33:03)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (02m 02s)
- 🌊 జీవధారలు అంటే ఏమిటి?: అసలు జీవధారలు బయలుదేరును అంటే అర్థం ఏంటంటే – అది నిత్య జీవధారలు కాదు. మన జీవితాన్ని, మన జీవిత విలువలను, జీవిత దిశ దశను, జీవిత గమనాన్ని నిర్దేశించేటటువంటి పాలసీస్ (Policies) అక్కడ బయలుదేరుతాయి.
- ⚖️ నిర్ణయాధికారం: హృదయంలో మనం తీర్మానాలు చేస్తాం. అక్కడి నుంచి మనం ఏ విలువల కొరకు బ్రతుకుతాము, ఏ ఆశయం కొరకు బ్రతుకుతాము అనేటటువంటి నిర్ణయాలు జరుగుతాయి.
- 🦠 వ్యాధిగ్రస్తమైన హృదయం: ఒకవేళ హృదయం ఘోరమైన వ్యాధి గలది గనుక, వ్యాధి గల తీర్మానాలే చేస్తాము, దుర్గంధ పూరితమైన పాలసీలే చేస్తాము. అది విషయం. అంటే హృదయం ఏ స్థితిలో ఉంటే, అక్కడి నుండి వచ్చే నిర్ణయాలు కూడా అదే రీతిలో ఉండి మన జీవిత గమనాన్ని మారుస్తాయి.
Detailed English Translation:
❓ Question: The Bible describes the heart in two ways—one as ‘desperately wicked’ (Jeremiah 17:9) and the other as the ‘wellspring of life’ (Proverbs 4:23). How do we reconcile these two different statements?
- Meaning of the Wellspring of Life: The phrase ‘wellspring of life’ does not refer to eternal life in this context. Instead, it refers to the ‘policies’ that direct our life—our values, our direction, our stages, and our ultimate destination. These are formulated within the heart.
- The Seat of Decision-Making: We make resolutions in our hearts. From there, we decide which values we will live for and what goals we will pursue. The heart is the control center for our life choices.
- The Consequence of a Wicked Heart: However, if the heart is ‘desperately wicked’ as described by Jeremiah, then the resolutions it makes will also be diseased. We will formulate foul or sinful policies. Essentially, the condition of the heart determines the quality and nature of the decisions that direct our lives.
