❓ ప్రశ్న: ఆదికాండము 6వ అధ్యాయంలో ఉన్న ‘దేవుని కుమారులు’ మనుష్యులకు సంబంధించిన వాళ్ళు (ఉదాహరణకు షేతు సంతానం) అని అనుకోవచ్చు కదా? వాళ్ళు మానవ మాత్రులు కారు అని చెప్పడానికి తార్కిక ఆధారం ఏంటి? (0:40:48)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (01m 52s)
- 📜 యుగాంతం గ్రంథం: దేవుని కుమారులు అని మనుషులకు సంబంధించిన వాళ్ళు అనుకోవచ్చు కదా అని అడుగుతున్నారు. వాళ్ళు మానవ మాత్రులు కారు అని ఎందుకు అనుకోవాలో తగిన లాజికల్ ప్రూఫ్ (Logical proof) నేను ‘యుగాంతం’ గ్రంథంలో చెప్పాను. దాని మీద మన రక్షణ ఆధారపడి లేదు, అది ఒక డౌట్ క్లియర్ చేయడానికి నాకు తెలిసిన విషయం చెప్పాను తప్ప రక్షణ కొరకు కాదు.
- 🧱 నెఫీలుల పుట్టుక – ఒక ప్రశ్న: దానికి లాజిక్ ఏమిటంటే – వాళ్ళు నరులు మాత్రమే అయి ఉంటే, దేవుని కుమారులు కూడా మానవ మాత్రులే అయితే, పెళ్లి చేసుకున్నది మానవ కన్యకలనే అయితే.. మనుషులే పుడతారు గానీ నెఫీలులు ఎట్లా పుట్టారో నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి (Explain)? ఆరు ఏడు ఫీట్లు కాదు, 70 అడుగులు ఉన్నారు వాళ్ళు.
- 🔍 వైజ్ఞానిక మరియు తార్కిక విశ్లేషణ: ఈ కలయిక ద్వారా పుట్టినటువంటి ప్రత్యేకమైన జాతి అది. ఒకవేళ మనుషులు మనుషులే పెళ్లి చేసుకుంటే 70 అడుగుల మనిషి పుట్టాడు అనేది నిజమైతే.. ఇప్పుడు కూడా రక్షణ పొందిన అమ్మాయిలు, రక్షణ పొందని అబ్బాయిలను చేసుకున్న సందర్భాలు ఉన్నాయి కదా! వాళ్ళకు 10-20 అడుగుల కొడుకులు పుడుతున్నారా? పుట్టడం లేదు. కాబట్టి ఈ లాజిక్ ని బట్టి నేను నమ్ముతున్నాను (దేవుని కుమారులు దేవదూతలే అని).
Detailed English Translation:
❓ Question: Can’t we assume that the ‘Sons of God’ in Genesis 6 were human beings (perhaps from the lineage of Seth)? What is the logical proof that they were not mere mortals?
- Reference to ‘Yugantham’: Many ask if the ‘Sons of God’ could be humans. I have provided the logical proof for why they are not humans in my book ‘Yugantham.’ This point does not affect our salvation; I am sharing this insight only to clear a theological doubt.
- The Mystery of the Nephilim: The logic is simple: If the ‘Sons of God’ were mere humans and they married human women, then their offspring should also be normal humans. How then do you explain the birth of the Nephilim? These were not 6 or 7-foot people; they were 70-foot giants.
- Scientific Logic: The Nephilim were a distinct, hybrid race born of this specific union. If normal humans marrying each other could produce 70-foot giants, then even today, when a believing girl marries an unbelieving man, we should see children growing 10 or 20 feet tall. But that doesn’t happen. Based on this logic, I believe the ‘Sons of God’ were celestial beings (fallen angels).
