1080.Q: Beloved of the Lord – The Blessing of Benjamin (KSM 222) 🛡️

❓ ప్రశ్న: ద్వితీయోపదేశకాండము 33:12లో బెన్యామీనును గూర్చి – “యెహోవాకు ప్రియుడైనవాడు ఆయనయొద్ద సురక్షితముగా నివసించును” అని ఉంది. బెన్యామీనులో ఉన్న ప్రత్యేకత ఏంటి? మనం దేవునికి ప్రియులముగా ఎలా మారగలము? (0:48:18)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 05s)

  • 📖 లేఖనాల పరిశోధన: యెహోవా వాక్యము ఒకే చోట రాదు, కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చును. బెన్యామీను యెహోవాకు ప్రియుడు అని ఒక చోట, బెన్యామీను చీల్చునట్టి తోడేలు అని ఇంకో చోట.. ఇట్లాంటివి చాలా విషయాలు ఆయన గూర్చి పితరులు చెప్పారు. అయితే మనం అటు నుంచి నరుక్కు రావాలి.
  • 🔍 దేవునికి ఇష్టులుగా మారుట: దేవునికి ఇష్టుడిగా మనము ఎలా కాగలమని లేఖనాలు మిగతా భాగాల్లో చెబుతున్నాయి. బెన్యామీను ఏమేమి చేసి దేవునికి ఇష్టుడైనాడు అనేది సవ్య దిశలో పరిశోధన చేయాలి. ఒకవేళ దేవునికి ఇష్టులైన వాళ్ళందరూ బెన్యామీను వలె ఇతరులను (శత్రువులను) చీల్చే శక్తి కలిగి ఉంటారు అనేది ఒక కోణం.
  • 🛡️ ఆత్మీయ అన్వయం: బైబిలు చదివినప్పుడు “What makes you beloved to God?” అనేది ఇతర లేఖనాల్లో మీకు చాలా విషయాలు ఉన్నాయి. ఆ ఇతర విషయాలన్నీ మనం పాటించినప్పుడు బెన్యామీనుకు ఇవ్వబడ్డ ఆశీర్వాదాలు మనవి అవుతాయి.
  • ముగింపు: మనం మిగతా వచనాలను పాటించి దేవునికి ఇష్టులుగా మారినప్పుడు, బెన్యామీను అంత శక్తివంతులం మనం కాగలుగుతాం. అప్పుడు మనల్ని గూర్చి కూడా దేవుడు అదే మాట పలుకుతాడు. అంటే దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు ఆయనకు ప్రియులమై, ఆయన రక్షణలో సురక్షితంగా ఉంటాము.

Detailed English Translation:

❓ Question: Deuteronomy 33:12 says of Benjamin, ‘The beloved of the Lord dwells in safety by him.’ What was special about Benjamin? How can we also become beloved to the Lord?

  • Connecting the Scriptures: The Word of the Lord does not appear in just one place; it is ‘here a little, there a little.’ Regarding Benjamin, it is said he is the ‘beloved of the Lord,’ but also a ‘ravenous wolf.’ We must analyze these different descriptions together to get the full picture.
  • Becoming Pleasing to God: Other parts of the Bible explain how one becomes pleasing to God. Researching what Benjamin did to gain God’s favor is the right approach. One perspective is that those who are beloved by God possess the strength to overcome their enemies, just as Benjamin had the power to ‘tear’ his foes.
  • Spiritual Application: When you read the Bible, look for what makes a person beloved to God in other scriptures. When we follow those principles, the blessings given to Benjamin become ours. By obeying God’s commands and becoming pleasing to Him, we gain the same strength that Benjamin had.
  • Conclusion: When we live according to God’s will and become His favorites, He will say the same about us. By walking in His Word, we become His beloved and dwell safely under His protection.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram