❓ ప్రశ్న: మత్తయి 10:34-35 ప్రకారం యేసుప్రభువు “నేను భూమి మీదకు సమాధానమును కాదు ఖడ్గమునే పంపవచ్చితిని” అని ఎందుకు అన్నారు? ఆయన పుట్టినప్పుడు సమాధానకర్త అని చెప్పారు కదా, మరి కుటుంబాల్లో విరోధము పెట్టడం ఏమిటి? (1:11:03)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (01m 55s)
- 📜 లేఖన పాఠము: మత్తయి సువార్త 10వ అధ్యాయం 34, 35 వచనాల్లో – “నేను భూమి మీదకు సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని విరోధము పెట్టవచ్చితిని” అని ఉంది. ఇదేమిటి అని అడుగుతున్నారు.
- 🧱 సందర్భోచిత అవగాహన: ఆయన జన్మించినప్పుడు భూమి మీద సమాధానం కలుగుతుందని ఉంది కదా.. అది సర్వ ప్రజలకు అనుకుంటున్నారు. తల్లి! ఒకసారి లూకా సువార్త 2:14 మళ్ళీ చదవండి. సర్వ ప్రజలకు సమాధానం అని లేదమ్మా.
- ⚖️ ఆయనకు ఇష్టులైన వారికే: “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక.” చూసారా? ఆయనకు ఇష్టులైన వాళ్ళకి మాత్రమే సమాధానం కలుగుతుందని ఇక్కడ ఉందండి. దేవునికి ఇష్టం లేనోళ్లకు సమాధానం ఉండదు.
- 🛡️ సువార్త తెచ్చే విభజన: అంటే రక్షణ సువార్త వినకుండా, నమ్మకుండా, దేవుణ్ణి అంగీకరించకుండా ఉంటే వాళ్ళకి సమాధానం ఎలా ఉంటదమ్మా? దేవుని వైపు తిరిగినప్పుడు లోకం మనకు విరోధమవుతుంది, అదే ఇక్కడ ఖడ్గము అని చెప్పబడింది. అంటే సత్యాన్ని నమ్మిన వారికి, నమ్మని వారికి మధ్య సహజంగానే ఒక విభజన (Division) వస్తుంది.
Detailed English Translation:
❓ Question: Why did Jesus say in Matthew 10:34-35, “I did not come to bring peace but a sword”? If He is the Prince of Peace, why did He speak about setting family members against each other?
- Clarifying the Scripture: In Matthew 10:34-35, Jesus says, “Do not suppose that I have come to bring peace to the earth. I did not come to bring peace, but a sword. For I have come to turn a man against his father, a daughter against her mother…” Many people find this confusing.
- Context of the Birth Announcement: People often think that when Jesus was born, peace was promised to all people on earth. But look closely at Luke 2:14. It does not say peace to “all people.”
- Peace for Those Who Please Him: Luke 2:14 says, “Glory to God in the highest heaven, and on earth peace to those on whom his favor rests” (or those who please Him). Peace is promised only to those who please God. There is no divine peace for those who do not please Him.
- The ‘Sword’ of the Gospel: If someone does not hear the gospel, believe, or accept God, how can they have peace? When we turn toward God, the world inherently becomes opposed to us—this opposition is the ‘sword’ He mentioned. It represents the inevitable division that occurs between those who accept the Truth and those who reject it, even within families.
