❓ ప్రశ్న: మత్తయి 11:12 ప్రకారం బాప్తిస్మము ఇచ్చు యోహాను కాలము నుండి పరలోక రాజ్యము ‘బలాత్కారముగా పట్టబడుచున్నది’ అంటే అర్థం ఏమిటి? రక్షణ పొందడానికి పోరాడాలా? (1:12:58)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 44s)
- 🛡️ రక్షణ సులభం కాదు: బాప్తిసము ఇచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటివరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారని ఉంది. తల్లి! ఇది కూడా చాలా సార్లు చెప్పిన జవాబే తల్లి. అది ఏంటంటే – రక్షణ పొందడము సులభము కాదు.
- 🧱 లోకపు వ్యతిరేకత: రక్షణ పొందాలని మీరు ఎప్పుడైతే తీర్మానించుకుంటారో, అప్పుడు మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు చాలామంది తయారవుతారు. ఏదైనా చెడ్డ పని చేయాలి అనుకుంటే, తాగాలి తిరగాలి అంటే ఎవరు మిమ్మల్ని అడ్డుకోరు. కానీ బాప్తిస్మం పొందుతాను అంటే – కులం వాళ్ళు వస్తారు, ఇంట్లో అందరూ అడ్డం వస్తారు.
- ⚖️ ఇరుకు ద్వారమున పోరాడుడి: ఇది సైతాను ఏలుతున్న రాజ్యం గనుక దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అనగానే, వాడు మన బంధువులను స్నేహితులను అడ్డంగా నిలబెడతాడు. అందుకే లూకా సువార్త 13:24లో – “ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను” అని ఉంది.
- 🔥 నిశ్చయత మరియు ఘర్షణ: పోరాటం లేకుండా లోపలికి వెళ్ళలేం. రక్షణ ద్వారములోనికి నమ్మి బాప్తిస్మం పొంది ప్రవేశించాలంటే సాఫీగా వెళ్ళలేం. ఒక చిన్న పోరాటం చేయాలి, కొంతమందిని ఎదుర్కోవాలి, వాళ్ళ నోళ్ళు మూయించాలి. లేకపోతే – “నోరు మూసుకో నా లైఫ్ నా ఇష్టం నిన్ను ఎవడు అడిగాడు” అని చెప్పి తిరగబడాలి. కొంత ఘర్షణ లేకుండా మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేము, అందుకే బలాత్కారంగా లోపలికి వస్తున్నారు అని చెప్తున్నాడు.
Detailed English Translation:
❓ Question: According to Matthew 11:12, what does it mean that the Kingdom of Heaven ‘suffers violence’ and the ‘violent take it by force’? Do we have to fight for salvation?
- Salvation is a Struggle: From the days of John the Baptist until now, the Kingdom of Heaven has been forcefully advancing. This means that attaining salvation is not an easy or smooth journey.
- Opposition from the World: The moment you decide to be saved, many opponents will arise. If you want to do something sinful—like drinking or wandering aimlessly—no one will stop you. But the moment you say you want to take baptism, your community, caste, and even your own family will stand in your way.
- The Narrow Door: Since this world is currently under the influence of Satan, he uses relatives and friends as obstacles to keep you from entering God’s Kingdom. This is why Luke 13:24 says, “Strive to enter through the narrow door; for many, I tell you, will seek to enter and will not be able.”
- Conclusion: You cannot enter without a fight. To believe, take baptism, and enter the gate of salvation, you must face a spiritual struggle. You must confront those who oppose you and sometimes even tell them firmly, “Mind your own business; this is my life and my choice.” Without this firm resolve and spiritual ‘force,’ one cannot enter the Kingdom of God.
