❓ ప్రశ్న: ఆదికాండము 6వ అధ్యాయంలో జరిగినట్లుగా, దేవదూతలు మళ్ళీ భూమి మీదకు వచ్చి వివాహాలు చేసుకునే అవకాశం ఉందా? సాతాను ప్లాన్ ఏమిటి? మనము దీని గురించి ఆందోళన చెందాలా? (1:16:42)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (05m 15s)
- 🛡️ నెఫీలుల చరిత్ర: నెఫీలులు అప్పుడు ఉండిరి, జలప్రళయానికి ముందు ఒక బ్యాచ్ దేవదూతలు వచ్చి అదే తప్పు చేశారు. రెండోసారి జలప్రళయం తర్వాత వచ్చినటువంటి దేవదూతల బ్యాచ్ తో రెండో బ్యాచ్ నెఫీలులు పుట్టారు. వాళ్ళు మోషే కాలం దాకా ఉన్నారు, వాళ్ళ సంతతి కొంతమంది దావీదు కాలంలో కూడా ఉన్నారు. వాళ్ళందరూ జైంట్స్ (Giants).
- 🧱 సాతాను మాస్టర్ ప్లాన్: దేవుడు ఆపేశాడు అంతే.. వాళ్ళని మళ్ళీ రాకుండా ఆపేశాడు. అసలు మానవజాతిని వేరు చేయడమే సాతాను ప్లాన్ (Plan). ఆదాము నుండి రాజదండము దొంగిలించి, లోకాధికారిగా మారి.. దేవుడు “నా కుమారుడు” అంటున్నాడుగా, నేను కూడా ఒక కొడుకును కనాలి అనుకున్నాడు సాతాను.
- ⚖️ వ్యవస్థను వశపరుచుకోవాలి: కానీ పరలోకంలో కొడుకులను కనే సిస్టం లేదు. అందుకే ఆ సిస్టం ఏ జాతిలో ఉందో ఆ జాతిని (మనుషులను) వశపరుచుకోవాలని వాడు మాస్టర్ ప్లాన్ వేశాడు. దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలని ముందు వేరే వాళ్ళతో ఆ తప్పు చేయించాడు. దేవుడు కోపగించుకొని ఆ నెఫీలులను నాశనం చేసి, దేవదూతలను చీకటి బిలాల్లో బంధించాడు.
- 🔍 నిమ్రోదు మరియు బాబెల్: ఆ సందర్భంగా దేవుడు – “మరొక్కసారి భూమిని జలప్రళయముతో నాశనము చేయను” అన్నాడు. అప్పుడు సాతానుకు ధైర్యం వచ్చి, వాడు కూషు భార్యతో సంపర్కం పెట్టుకొని నిమ్రోదుని కన్నాడు. వాడు సాతాను కొడుకు. అందుకే దేవుడు బాబెల్ గోపురం దగ్గర భాషలు తారుమారు చేసి విడగొట్టాడు.
- 🔥 ప్రస్తుత ప్రాధాన్యత: ఆ తర్వాత సాతానుకు కూడా ఇంట్రెస్ట్ (Interest) లేదు, వాని పర్పస్ నెరవేరింది కదా! వాడు ఆడించిన నాటకం అది. ఇప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అంటే – మనకు ఆ దిగులు ఎందుకు? యేసుప్రభు రాకడ బహు సమీపం. మనం రక్షణ సువార్త చెప్పడానికి కొంచెమే సమయం ఉంది.
- ✨ ముగింపు: ప్రాక్టికల్ గా ఉండాలి. కోట్లాది మంది రక్షణ పొందలేదు, అందరికీ సువార్త అవసరం. ఒకవేళ దేవుడు అనుమతించి, ఇంకో బ్యాచ్ దేవదూతలు వస్తే అప్పుడు చూద్దాము. మన కూతుర్లనైతే మనం ఇయ్యొద్దు. వాడు మర్యాదగానే వచ్చి అడుగుతాడు, కొన్ని ప్రలోభాలు పెట్టి ఒప్పిస్తాడు. అదే ‘నరుల అక్రమం’. కాబట్టి అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టకుండా, ఆత్మల సంపాదన మీద దృష్టి పెట్టడం మంచిది.
Detailed English Translation:
❓ Question: Is there a possibility that angels will come to earth and marry again as they did in Genesis 6? What is Satan’s plan, and should we be concerned?
- History of Nephilim: Nephilim existed then. A batch of angels committed this sin before the flood, and another batch did so after the flood, producing more Nephilim. They existed until the time of Moses and some remained until David’s time; they were all giants.
- Satan’s Master Plan: God stopped them from coming back. Satan’s plan was to corrupt the human race. After stealing the scepter from Adam and becoming the ruler of this world, Satan wanted to have a son, just as God has His Son.
- Usurping the System: Since the biological system of procreation doesn’t exist in heaven, Satan planned to take over the race (humans) that possesses this system. He initially had others commit this sin to see God’s reaction. God destroyed the Nephilim and imprisoned those angels in dark pits.
- Nimrod and Babel: After the flood, God promised never to destroy the earth by water again. Emboldened, Satan fathered Nimrod through Cush’s wife. Nimrod was Satan’s son, which led God to confuse languages at the Tower of Babel to scatter them.
- Current Focus: Satan has largely fulfilled his purpose through his past dramas. Regarding the possibility of this happening again—why worry? The coming of Christ is very near. We have very little time left for the Gospel.
- Conclusion: We must be practical. Billions are unsaved and need the Gospel. If God allows another batch of angels to come, we will see then, but we shouldn’t give our daughters to them. They approach with respect and temptations—that is the ‘wickedness of man.’ Focus on winning souls rather than unnecessary speculations.
