109. ప్రశ్న : అయితే ఇప్పుడు జగన్ గారు క్రిస్టియన్ కమ్యూనిటీ నుండి వచ్చినట్వంటి వాడుగా కమ్యునిటికీ మేలు చేయాలనే ఉద్దేశంతోనే చేశాడు.  ఆయన ఒక మతానికే సపోర్టు చేస్తున్నాడంటూ కొంతమంది కామెంట్స్ కూడ చేస్తున్నారు. మరి దాన్నేలా తీసుకోవాలి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు: నేను క్రైస్తవుడనైయుండి జగనుగారు, వారి కుటుంబం అంతా మొదటినుండి గూడ వారి గూర్చి తెలుసు. కొన్ని సందర్భాలో వాళ్ళతో పెద్ద అక్వెంటెన్స్ క్లోస్ ఫ్రెండ్స్ కాకపోయినా, కొన్ని సందర్భాల్లో వాళ్ళను కలిసాను. చాలా దైవభక్తి కలిగిన కుటుంబం. వాళ్ళ మీద నాకు అభిమానం ఉంది. పర్సనల్ గా నాకు జగన్గారి మీద విజయలక్ష్మి మేడమ్, జయమ్మగారు, వై.యస్.ఆర్ గారి మీద నాకు చాలా అభిమానం ఉంది. గనుక వారు క్రైస్తవ విశ్వాసంలో ఉంటే చాలా సంతోషము. ఇతరులు విమర్శించే అవకాశం ఉందనే పాయింట్ ముందు నేనే లెవనెత్తాను కదా?

            మీరు సెక్యులర్ వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి సెక్యులర్ రాజ్యాంగము క్రింద మీరు ప్రభుత్వం నడిపిస్తూ ఒక మతానికి ప్రోత్సాహకం ఎలాగ ప్రకటిస్తారు? అసలు ఇలా వచ్చింది గనుకనే ఇంతకముందు, ఇప్పుడు హజ్ యాత్రికులకు గవర్నమెంట్ నిధులివ్వడము, తర్వాత వై.యస్.ఆర్ గారి టైంలో యెరుషలేము యాత్రకు సహాయం చేయటం దీన్నంతటిని కూడ ఆర్.యస్.యస్ ఖండించింది.  ఇప్పుడు ఆర్.యస్.యస్.కు సిద్ధాంత రీత్యా మనం వ్యతిరేకం, నేను వ్యతిరేకం! కాని ఆర్.ఎస్.ఎస్. అయినా ఎవరు చెప్పినా సరే! న్యాయము న్యాయమే ! న్యాయంగా ఒప్పుకోవాలి కదా? మతములకు సంబంధించిన కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు ఉపయోగపడకూడదు. అది ప్రజాసంక్షేమానికి, త్రాగడానికి నీరు, సాగునీరు, మంచి విద్య, అందరికి అందుబాటులో మంచి వైద్యం, మంచి రోడ్లు, రహదారులు ఇలాంటి సౌకర్యాలు ఇవ్వడానికి ప్రజాధనం ఉపయోగించాలి.  గాని మతప్రచారం చేయడానికి ఉపయోగపడకూడదు. ఏ మతానికి కూడ ఇవ్వడం తప్పే! ఇది సెక్యులర్ ప్రభుత్వం ఆ మతంలో నమ్మకం ఉన్నవాళ్ళు, దానికి వారు ప్రత్యేక నిధులు సమకూర్చుకుని, వాళ్ళు ప్రచారం చేసుకోవాలి.