❓ ప్రశ్న: ఎస్సీలుగా ఉండి క్రైస్తవులుగా మారిన వారికి రిజర్వేషన్లు వర్తించవని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఎలా చూడాలి? ఇది క్రైస్తవుల మీద కక్ష సాధింపు చర్యేనా? దీనిపై మీ స్పందన ఏంటి? (0:01:07)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (11m 26s)
- ⚖️ తర్క విరుద్ధమైన తీర్పు: ఇది కేవలము ఇల్లాజికల్ (Illogical), తర్క విరుద్ధము, హేతు విరుద్ధమైనటువంటి ఒక తీర్పు. క్రైస్తవులుగా మారిన వాళ్ళ మీద కక్ష సాధింపు చర్య. మీరు ఏసుప్రభువును నమ్ముకున్నారు గనుక ఏదో రకంగా మిమ్మల్ని బాధ పెడతాము, వేధిస్తాము అనే చర్య తప్ప ఇంకేం లేదు ఇందులో.
- 🧱 మత సిద్ధాంతాల మీద వ్యాఖ్యానం: ఎవరైనా సరే, క్రైస్తవ మతంలో కులాలు లేవు కదా, మీరు ఆ మతంలోకి వెళ్ళిన తర్వాత మీరు కులమును ఎందుకు మాట్లాడుతున్నారు అనే పాయింట్లు ఇస్తున్నారు. ఇక్కడ మతములో కులాలు ఉన్నాయా లేదా అని క్రైస్తవ మత సిద్ధాంతాల మీద వ్యాఖ్యానం చెప్పడం కోర్టు వారి పని కాదు, ప్రభుత్వం యొక్క పని కాదు.
- 🛡️ కోర్టు బాధ్యతపై ప్రశ్న: అది వాళ్ళ వ్యక్తిగత విషయం. బైబిల్ లో కులాలు లేకపోయినా వాళ్ళు కులాలను పాటిస్తుండొచ్చు, అప్పుడు వాళ్ళు సరైన క్రైస్తవులు కాకుండా పోతారు అంతే. కానీ “బైబిల్ లోనే కులాలు లేవు గనుక మీకు అది వర్తింప చేయదు” అంటే – బైబిల్ ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కోర్టు తీసుకున్నదా? ఇది 100% అగైన్స్ట్ ఆల్ లాజిక్ (Against all logic).
- 🔍 వివక్ష తొలగిపోలేదు: వాళ్ళు మతము మార్చుకున్నందుకు, క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించినందుకు సమాజంలో వాళ్లకు ఉన్నటువంటి వివక్ష పోయిందా? పోలేదు. ఇప్పుడు అసలు ఈ రిజర్వేషన్లు గాని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ద్వారా కలిగినటువంటి సంరక్షణ గాని వివక్షకు గురైతున్నందుకే ఇచ్చారు.
- ✨ నిర్హేతుకమైన ద్వేషం: మరి ఏసుప్రభువును నమ్మినందుకు వాళ్ళ ఊర్లో వాళ్ళను “ఇప్పటి నుంచి మీరు మాలలు కాదు, మాదిగలు కాదు” అని అంటున్నారా? వివక్ష ఉన్నందుకు రిజర్వేషన్లు ఇచ్చారా లేకపోతే హిందూ దేవుళ్ళని నమ్మినందుకు మెచ్చుకోలుగా ఇచ్చారా? వివక్ష కొనసాగుతున్నప్పుడు ఎందుకు తీసేస్తారు? ఇది కేవలం క్రీస్తు అంటే ఉన్న కరడు కట్టిన ద్వేషముతో చేస్తున్న పని.
Detailed English Translation:
❓ Question: How should we view the Supreme Court’s judgment stating that SC reservations do not apply to those converted to Christianity? Is this an act of vendetta against Christians?
- An Illogical Judgment: This is a purely illogical and irrational judgment. It is an act of vendetta against those who have converted to Christianity. It is a move to harass and trouble believers simply because they have accepted Jesus Christ; there is nothing more to it.
- Interpreting Religious Doctrine: Some argue that since there are no castes in Christianity, converts shouldn’t discuss caste. However, it is not the business of the court or the government to interpret Christian religious doctrines or define what should or shouldn’t exist within a faith.
- Questioning the Court’s Role: Faith is a personal matter. Even if the Bible doesn’t mention caste, people might still follow it, which simply makes them ‘imperfect’ Christians. But if the court says, “Since the Bible has no caste, reservations won’t apply,” is the court taking the responsibility to strictly implement the Bible? This is 100% against all logic.
- Discrimination Persists: Has the social discrimination they faced disappeared just because they accepted Christ as their Savior? No. Reservations and protection under the SC/ST Atrocity Act were provided specifically because these groups face discrimination.
- Hate Toward Christ: After believing in Jesus, are people in their villages saying, “From now on, you are no longer a Mala or Madiga”? Were reservations given due to discrimination or as a reward for believing in Hindu deities? If discrimination continues, why revoke the benefits? This is done solely out of deep-seated hatred toward Christ.
