❓ ప్రశ్న: రిజర్వేషన్లు పోతాయనే భయంతో క్రైస్తవులు తమ విశ్వాసాన్ని వదులుకోవాలా? మోషే భక్తుని వలె ఐగుప్తు ధనం కంటే క్రీస్తు నిందను గొప్ప భాగ్యంగా ఎంచుకోవడం అంటే ఏంటి? (0:12:46)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (05m 14s)
- 🌱 విశ్వాసపు పునాది: రిజర్వేషన్లు ఉన్నందుకు క్రైస్తవ్యం వ్యాపించలేదు. అసలు మొదటి నుంచి ఇది నిన్న కాక మొన్న వచ్చింది. మరి అంతకుముందు నుంచి ఎందుకు నమ్మారు మరి? దేవుడని తెలుసుకొని, సత్యము గ్రహించి, లాజికల్ గా ఉంది అని నమ్మారు తప్ప.
- 🛡️ నిజమైన క్రైస్తవుని స్థితి: నిజంగా ప్రభువును నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ బాధపడడం లేదు, ఆ పరిస్థితి లేదు. యేసుప్రభువును నమ్ముకున్న తర్వాత మాకు అది లేదు, ఇది లేదు అని క్రైస్తవులు ఎప్పుడు బాధపడరు. మోషే భక్తుని లాగా – ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమయే మేలు.
- 📖 మోషే మాదిరి: హెబ్రీ పత్రిక 11:24 – “మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని… దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి… ఒప్పుకొనలేదు.” ఆ మైండ్ క్రైస్తవులందరికీ రావాలి.
- ✨ యేసయ్యే సర్వస్వం: మాకేమీ వద్దు బాబు, మీరు ఇచ్చే రాయితీలు వద్దు, ఏమీ వద్దు. మాకు యేసయ్య ఉంటే చాలు అని విశ్వాసముతో ఉండాలి. ఆయనే మాకున్న ధనము, బలము, బలగము, హోదా అన్నీ. యేసయ్య ఉంటే మా జీవన సర్వస్వం ఆయనే అనుకొని మీరు అదంతా తృణీకరించాలి.
- 🏆 విశ్వాస ప్రకటన: మా రిజర్వేషన్లు వద్దు పోవయ్యా అని ప్రకటించేసేయాలి. దేవుని చిత్తానికి లోబడిన వాడికి అపజయమే ఉండదు. ఎంత శ్రమలు ఎక్కువైతే అంతగా క్రీస్తు మార్గం ఇంకా విస్తరిస్తుంది. యేసుప్రభువు ఒక్కడే నిజమైన దేవుడు.
Detailed English Translation:
❓ Question: Should Christians give up their faith out of fear of losing reservations? What does it mean to choose the reproach of Christ over the treasures of Egypt, like Moses?
- The Foundation of Faith: Christianity did not spread because of reservations. These benefits are a recent development. Why did people believe before that? They believed because they recognized God, grasped the truth, and found it logical.
- The Stance of a True Believer: Those who truly believe in the Lord are not grieving. After accepting Jesus, Christians do not complain about what they lack. Like Moses, they realize that suffering with God’s people is better than the treasures of Egypt.
- The Example of Moses: Hebrews 11:24-26 – “By faith Moses, when he had grown up, refused to be known as the son of Pharaoh’s daughter. He chose to be mistreated along with the people of God rather than to enjoy the fleeting pleasures of sin.” Every Christian must develop this mindset.
- Jesus is Everything: We must have the faith to say, “We don’t need your concessions or benefits; having Jesus is enough.” He is our wealth, our strength, our status, and our everything. When we have Jesus, He is our entire life, and we should be able to disregard everything else.
- Declaration of Faith: We should be bold enough to say we don’t need these reservations. There is no defeat for those who submit to God’s will. The more the hardships increase, the more the way of Christ will expand. Jesus Christ alone is the true God.
