❓ ప్రశ్న: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించకపోయినా, భారత రాజ్యాంగం కల్పించే ప్రాథమిక హక్కులు క్రైస్తవులను రక్షిస్తాయా? దళితులు క్రైస్తవులుగా మారినప్పుడు వారికి చట్టపరమైన రక్షణ ఉంటుందా? (0:27:16)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 48s)
- 🛡️ ఆందోళన అవసరం లేదు: నేను చెప్తున్నాను.. ఎక్కువ పానిక్ అయ్యే అవసరం కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక దళితుడిని అనుకోండి. నన్ను ఎవరైనా కొట్టినా, చంపడానికి ప్రయత్నం చేసినా, నా ఇంటి మీదనో లేదా మా చర్చి మీదనో దాడి చేస్తే.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నాకు వర్తించదు అనుకుందాం.
- 🧱 భారత పౌరసత్వం: ఆ స్టేటస్ నాకు పోయింది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నాకు వర్తించదు. అది వీడు (ప్రభుత్వం) తీసేసినా.. నేను భారత దేశ పౌరుడినే కదా? నన్ను కొట్టినా, చంపినా ఏం కేసులు ఉండవా? ఎందుకు ఉండవు, ఖచ్చితంగా ఉంటాయి. సాధారణంగా రాజ్యాంగం అయితే నన్ను రక్షిస్తుంది కదా!
- ⚖️ ప్రాథమిక హక్కులు: భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించి మనకు ఇచ్చినటువంటి ఆ మహోన్నతమైన రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక మానవ హక్కులు అయితే నాకు వర్తిస్తాయి కదా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది నిన్న కాక మొన్న వచ్చింది. అది వర్తించనంత మాత్రాన ఇక నన్ను కొట్టినా కేసు ఉండదు, చంపినా కేసు ఉండదు అనేది ఉందా?
- ✨ రాజ్యాంగ పరిరక్షణ: లేదు! రాజ్యాంగం చచ్చిపోలేదు. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారమైనా సరే, మనం వ్యక్తులుగా, భారతదేశ పౌరులుగా మనల్ని సంరక్షించాల్సిన బాధ్యత తప్పకుండా రాజ్యాంగానికి, రాజ్యాంగ పరిరక్షకులకు ఉన్నది. చట్టం తన పని తాను చేస్తుంది, ఆ చట్టం కింద కాకపోతే మామూలు చట్టం కింద కాపాడి తీరాలి.
Detailed English Translation:
❓ Question: Even if the SC/ST Atrocity Act does not apply, do the fundamental rights provided by the Indian Constitution protect Christians? Will Dalit converts have legal protection?
- No Need to Panic: I am telling you—there is no need to panic excessively. For example, suppose I am a Dalit. If someone hits me, tries to kill me, or attacks my home or church, let’s assume the SC/ST Atrocity Act no longer applies to me.
- Citizenship of India: Even if that specific status is gone and the Act doesn’t apply because the government removed it, am I not still a citizen of India? If I am attacked or murdered, will there be no legal case? Of course there will be! Generally, the Constitution protects me.
- Fundamental Rights: The fundamental human rights within the magnificent Constitution, authored and given to us by Babasaheb Ambedkar, still apply to me. The SC/ST Atrocity Act is a very recent addition. Does its absence mean there’s no case if I’m beaten or killed?
- Constitutional Protection: No! The Constitution is not dead. According to the rights granted by the Constitution, the responsibility to protect us as individuals and as citizens of India lies with the Constitution and its guardians. The law will do its job. If not under a special act, we must be protected under ordinary law.
