❓ ప్రశ్న: వివాహ విషయంలో అబ్బాయి కంటే అమ్మాయి 10 సంవత్సరాలు చిన్నదైతే ఏదైనా అభ్యంతరం ఉంటుందా? క్రైస్తవ వివాహాల్లో వయస్సు వ్యత్యాసం (Age Gap) గురించి బైబిల్ పరంగా మరియు సామాజికంగా మీ సలహా ఏమిటి? (1:00:03)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 22s)
- 🛡️ నిశ్చయంగా చేసుకోవచ్చు: అసలు 10 సంవత్సరాలు చిన్నదాన్ని చేసుకుంటే మహా దివ్యంగా ఉంటుంది. ఎలాంటి అభ్యంతరం లేదు, ఎలాంటి ప్రమాదం లేదు, ఇబ్బంది ఉండదు. ఇంకా అది అడ్వాంటేజ్ (Advantage) కానీ ఇంకేం లేదు. 10 ఏళ్లు కాదు, 12 ఏళ్లు, 15 ఏళ్ల గ్యాప్ తో చేసుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు.
- 🧱 సుఖవంతమైన వైవాహిక జీవితం: హాయిగా కాపురాలు చేశారు, పిల్లల్ని కన్నారు, వాళ్లకు కూడా పెళ్లిళ్లు చేసి మనవలను కూడా ఎత్తుకున్నారు. ఏమీ అభ్యంతరం లేదు. ఇప్పుడు ఆ అబ్బాయి కంటే అమ్మాయి 10 ఏళ్లు చిన్నది కదా.. ఒక 20 ఏళ్లు కాపురం చేసిన తర్వాత ఆ అబ్బాయి కంటే ఈమె ముసలిదానిలాగా కనిపిస్తుంది.
- ⚖️ స్త్రీల బాధ్యతలు మరియు ఏజింగ్: ఎందుకంటే సృష్టికర్త కష్టాలన్నీ ఆడవాళ్ళకే పెట్టాడు. వాళ్లకు మంత్లీ ప్రాబ్లమ్స్, పిల్లల్ని మోయడం, కనడం, పెంచడం, గృహ పరిపాలన, భర్తను, అత్తింటి వారిని చూసుకోవడం.. వీటన్నిటితో స్త్రీలు నలిగిపోతారు. మగోడు ఆమె వండి పెడితే తింటాడు, బయట తిరుగుతాడు. ఫిజికల్ గా, మెంటల్ గా స్ట్రెయిన్ మొత్తం ఆడవాళ్ళకే.
- 🔍 వయస్సు సమతుల్యత: అందుకే వాళ్లకు తొందరగా ఏజింగ్ (Aging) అవుతుంది. ఒక 20 ఏళ్ల తర్వాత ఈ 10 ఏళ్ల చిన్నది కూడా భర్తతో సమానంగా కనిపిస్తుంది. మా అమ్మ నాన్న కంటే 12 ఏళ్లు చిన్నది. మేమందరం పుట్టిన తర్వాత వాళ్ళ ఫోటో చూస్తే కరెక్ట్ ఈడు జోడి లాగా ఉంటారు.
- ✨ ముగింపు: కాబట్టి ఎలాంటి అభ్యంతరం లేదు. ఇద్దరు మేజర్లు అయినప్పుడు, ప్రయోజకులు అయినప్పుడు 10 ఏళ్ల గ్యాప్ అనేది ఏమాత్రం అభ్యంతరం కాదు. అది మునుముందు వాళ్ళ జీవితానికి ఎంతో సుఖం, శాంతి, ఆనందం కలిగేటట్టుగా ఉంటుంది. దాన్ని నేను హైలీ రికమెండ్ (Highly Recommend) చేస్తాను.
Detailed English Translation:
❓ Question: Is there any objection if the bride is 10 years younger than the groom in a marriage? What is your advice regarding the age gap in Christian marriages from a biblical and practical perspective?
- Perfectly Acceptable: In fact, marrying someone 10 years younger is wonderful. There is no objection, no danger, and no problem at all. It is actually an advantage. I know people who have married with gaps of 12 or even 15 years.
- Happy Married Life: They have lived happy lives, raised children, married them off, and are now carrying their grandchildren. There is no issue. Though the girl might be 10 years younger now, after 20 years of marriage, she might appear older than her husband.
- Responsibilities and Aging in Women: This is because the Creator has placed many burdens on women—monthly cycles, bearing and raising children, managing the household, and taking care of the husband and in-laws. Women get worn out by these responsibilities. The man often just eats what she cooks and goes out. The physical and mental strain is mostly on women.
- Balance Over Time: Because of this strain, women tend to age faster. After 20 years, a wife who was 10 years younger will look the same age as her husband. My mother was 12 years younger than my father. By the time we were all born, they looked like a perfectly matched couple in photos.
- Conclusion: Therefore, there is no objection. When both are adults and settled, a 10-year gap is not an issue at all. It will lead to a life of comfort, peace, and happiness in the future. I highly recommend it.
