1105.Q: Resurrection in Vedas and Biblical Significance (KSM 268) 🕊️

❓ ప్రశ్న: ఈస్టర్ పండుగ విశిష్టత ఏంటి? యేసుప్రభువు పునరుద్ధానం గురించి ఋగ్వేదంలో మరియు భారతీయ వేదాలలో ఏమని వ్రాయబడింది? క్రైస్తవ విశ్వాసానికి పునరుద్ధానమే పునాది అని ఎలా చెప్పగలము? (1:14:28)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 48s)

  • 📜 వేదాలలో పునరుద్ధానం: ఏసుప్రభువు వారు మరణమును గెలిచి పునరుద్ధానుడై యూదా ప్రవక్తల ప్రవచనాలు, భారతీయ వేదముల ప్రవచనాలు కూడా నెరవేర్చినటువంటి దినము ఈస్టర్. పునరుద్ధానమును గూర్చి ఋగ్వేదములో కూడా రాయబడింది – “కాలాత్మకుడగు ఇంద్రుని మహాత్మమును చూడండి.. అతడు నిన్న మరణించి ఉన్నాడు, ఇవాళ సజీవుడై ఉన్నాడు”. ‘హైందవ క్రైస్తవం’ అనే బుక్ లో నేను ఆ అధ్యాయము, ఆ మంత్రము నంబరు అంతా కూడా తేటగా రాశాను.
  • 🧱 లేఖన ప్రవచనాలు: బైబిల్ లో కూడా ప్రవచనాలు ఉన్నాయి – “నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు” (కీర్తన 16:10). మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఏసుప్రభువు యొక్క పునరుద్ధానం ప్రపంచ ఆధ్యాత్మిక రంగంలోనే ఒక విప్లవాత్మకమైన సంఘటన.
  • ⚖️ విప్లవాత్మక సిద్ధాంతం: అంతకుముందు ఈజిప్షియన్స్ గాని, భారతీయులు గాని.. చనిపోయిన తర్వాత ఈ వ్యక్తి వెళ్లి ఇంకొక శరీరం ధరించుకుంటాడు అని నమ్మారు. కానీ బైబిల్ లో ఉన్న విప్లవాత్మకమైన సిద్ధాంతం ఏమిటంటే – ఇదే శరీరం మళ్ళీ లైఫ్ లోకి వస్తుంది. క్షయమైన ఈ శరీరాన్ని అక్షయమైనదిగా మార్చుకొని ఇదే బాడీని మళ్ళీ తొడుక్కుంటాడు.
  • పాపరాహిత్య నిరూపణ: క్రీస్తు పునరుద్ధానము ద్వారా ఒక సంగతి నిరూపించబడింది – యేసులో జన్మ పాపము లేదు, స్వభావ పాపము లేదు, క్రియా పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు గనుక మన పాపములను క్షమించడానికి సమర్థుడు. మన విశ్వాసానికి గట్టి పునాది ఈ పునరుద్ధానమే.
  • 🏆 విశ్వాసికి ధైర్యం: మరణమును గెలవడం అనేది అంతకుముందు ఎవడూ చేయలేదు. అలాంటి బలమైన శత్రువుని అవలీలగా గెలిచిన యేసు.. మనకు ఏ సమస్య వచ్చినా, అప్పులు గాని, జబ్బులు గాని, సామాజిక వ్యతిరేకత గాని ఏవైనా సరే ఆయనకు ఒక సమస్యే కాదు. మరణమే ఆయన ముందు నిలబడలేనప్పుడు ఈ సమస్యలు ఏపాటివి? అది క్రైస్తవునికి గొప్ప ధైర్యం.

Detailed English Translation:

❓ Question: What is the significance of Easter? What is written in the Rig Veda and Indian Vedas about the resurrection of Jesus? Why is the resurrection considered the foundation of the Christian faith?

  • Resurrection in the Vedas: Easter is the day Lord Jesus conquered death and rose again, fulfilling the prophecies of both Jewish prophets and Indian Vedas. The Rig Veda mentions the resurrection: “Behold the greatness of Indra, the soul of time… He was dead yesterday, and today He is alive.” I have clearly detailed these chapters and mantra numbers in my book ‘Haindava Kraistavam’.
  • Scriptural Prophecies: The Bible also contains prophecies like Psalm 16:10: “You will not let your Holy One see decay.” It was impossible for death to keep its hold on Him. The resurrection of Jesus is a revolutionary event in the world’s spiritual history.
  • A Revolutionary Doctrine: Previously, Egyptians or Indians believed that after death, a person takes on a completely different body (reincarnation). But the revolutionary doctrine of the Bible is that this very body returns to life. This perishable body is transformed into an imperishable one and is reclaimed.
  • Proof of Sinlessness: Through the resurrection, one thing is proven—there is no original sin, no inherent sin, and no committed sin in Jesus. Because He is holy, He is capable of forgiving our sins. This resurrection is the firm foundation of our faith.
  • Strength for the Believer: Conquering death is something no one had done before. For Jesus, who easily defeated such a powerful enemy, any problem we face—whether debts, illnesses, or social opposition—is nothing. When death itself couldn’t stand before Him, what are these problems? This gives great courage to a Christian.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram