1106.Q: International Women’s Day – Safety and Status (KSM 221) 👩

❓ ప్రశ్న: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేటి సమాజంలో స్త్రీల రక్షణ మరియు భద్రతపై మీ సందేశం ఏమిటి? స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాయాలపై మీ స్పందన ఏమిటి? (0:01:00)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (09m 00s)

  • 🌹 నిరంతర గౌరవం: ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనే ఒక దినం ఏదో నిర్ణయించారు గాని, నా దృష్టికి అసలు ప్రతిరోజు ఉమెన్స్ డేనే. వాళ్ళు లేకపోతే లోకమే ముందుకు నడవదు. ఒక కుటుంబము, ఒక సమాజము, ఒక సంఘము ఏదైనా సరే.. ఆ సమాజంలో వారు సగభాగం. సృష్టిలో సగభాగం.
  • 🧱 దేవుని రూపం: మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ అనే మాట చాలా సత్యము. ఆడది అంటే అమ్మ అనేది నా భావన. స్త్రీ అంటే ఒక మాతృమూర్తి. దేవునిలోని సగభాగమే స్త్రీ రూపం. ఆదికాండంలో దేవుడు నరులను సృజించినప్పుడు.. స్త్రీలుగాను పురుషునిగాను సృజించెను. అంటే స్త్రీని, పురుషుని ఈ ఇద్దరిని కలిపితేనే దేవుని రూపం.
  • ⚖️ క్షీణిస్తున్న సంస్కారం: స్త్రీని గౌరవించాలి, స్త్రీని పూజించాలి అని మన దేశ సంస్కృతి చెప్పింది. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ సర్వ దేవతలు వచ్చి ఉంటారని మన శాస్త్రాలు చెప్పినాయి. కానీ ఇప్పుడు పూజించడం మానేసి రేపులు, మానభంగాలు, అత్యాచారాలు, హింసలు, హత్యలు చేస్తున్నారు. ఆ సంస్కారం రాను రాను క్షీణిస్తా ఉంది.
  • 🛡️ కఠిన శిక్షలు – రాజకీయ ప్రాతినిధ్యం: పార్లమెంటులో సగభాగమైన స్త్రీ మెంబర్స్ ఉండాలి. సమాజంలో సగం గనుక పార్లమెంట్ లో కూడా సగం వాళ్ళు ఉండాలి. స్త్రీ మీద అత్యాచారం చేసిన వాడి మర్మాంగాలు ఖండించి అవతల పారేయాలి. అతి తీవ్రమైన శిక్ష విధించాలి, క్షమించడానికి వీలు లేదు అని మనం పోరాడుతున్నాం.
  • దేశం సిగ్గుపడాల్సిన పరిస్థితి: సింగపూర్ లో 24 అవర్స్ ఆన్ డ్యూటీ ఉంటుంది, అక్కడ రేపులు ఉండవు. సౌదీ అరేబియా లాంటి అరబ్ కంట్రీస్ లో రేప్ అనే మాట వినబడదు. కానీ ఇక్కడ మనకి 20 నిమిషాలకు ఒక రేపు జరుగుతుంది. ఇలాంటి దేశంలో కూర్చొని నేను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పడం ఒక విధంగా వాళ్ళని అవమానించడమే. ముందు ఈ పరిస్థితి చక్కపరచాలి, ఆమెకు భద్రత కల్పించాలి.

Detailed English Translation:

❓ Question: On the occasion of International Women’s Day, what is your message regarding the safety and security of women in today’s society? What is your reaction to the injustices against women?

  • Everlasting Respect: Although a specific day has been designated as International Women’s Day, in my view, every day is Women’s Day. Without them, the world cannot move forward. Whether it is a family, a society, or a church—they are half of that society. They are half of creation.
  • The Image of God: It is very true that womanhood has given life to the survival of the human race. To me, a woman represents a mother. A woman is a maternal figure. The female form is half of the divine. In Genesis, when God created mankind, He created them male and female. This means the image of God is fulfilled only when both male and female are united.
  • Declining Culture: Our national culture says women should be respected and honored. Our scriptures state that where women are honored, all deities reside. But now, instead of honoring them, there are rapes, molestations, atrocities, violence, and murders. That culture is gradually declining.
  • Severe Punishment and Representation: Half of the members in Parliament should be women. Since they are half of society, they must be half of the Parliament too. The genitals of those who commit rape should be severed and discarded. We are fighting for the imposition of the severest punishment, with no room for forgiveness.
  • A Shaming Reality: In Singapore, there is 24-hour security, and rapes do not occur. In Arab countries like Saudi Arabia, the word ‘rape’ is rarely heard. But here, a rape occurs every 20 minutes. In such a country, saying “Happy Women’s Day” is in a way an insult to them. First, this situation must be rectified, and security must be provided for her.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram