❓ ప్రశ్న: మీకా 4:3 ప్రకారం ‘ఖడ్గములను నాగటి నక్కులుగా సాగగొట్టడం’ అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వెయ్యేళ్ల పరిపాలనలో యుద్ధాలు లేని ఆ సుందర ప్రపంచం ఎలా సాధ్యం? మనుషులతో పాటు జంతువుల స్వభావం కూడా మారుతుందా? (0:41:40)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (05m 00s)
- 🛡️ యుద్ధం లేని లోకం: ఆ రోజుల్లో ఎలా ఉంటది అంటే – జనము యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేతురు. యుద్ధాలు నేర్చుకోవడం, ఆ యుద్ధ కల, కత్తులు, కటార్లు ఇంకా అవసరం లేదని వాటిని చెడగొట్టి కంసాలి, కమ్మరి వాళ్ళకి ఇచ్చేసి నాగళ్ళుగా పొలం దున్నడానికి పనికొచ్చే పనిముట్లుగా తయారు చేస్తారు.
- 🧱 శాంతియుత సమాజం: మీకా 4:3 – “ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును… వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదకి జనము ఖడ్గము ఎత్తక యుండును, యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు.” అట్లాంటి శాంతి సమాధాన భరితమైన ప్రపంచం అది.
- ⚖️ జీవన దృక్పథం: అసలు యుద్ధం ఏంటి? ఎందుకు ఒకరినొకడు కొట్టుకోవాలి? చంపుకోవాలి? ఇచ్చిన జీవిత కాలం హ్యాపీగా బ్రతకాలి అనే మైండ్ వచ్చేస్తుంది. మనుషులకే కాదు, జంతువులు కూడా అనవసరంగా హాని చేయవు. నాగుపాము పుట్ట దగ్గర పిల్లలు ఆడుకుంటారు, దాంట్లో చెయ్యి పెడతారు, అది ఏమనదు.
- ✨ మారిన ప్రకృతి స్వభావం: సింహము, ఎలుగుబంటి, గొర్రెపిల్ల కలిసి ఆడుకుంటాయట. కనుక అలాంటి సమాధాన ప్రపంచాన్ని వెయ్యి సంవత్సరాలు ఏసుప్రభు వారు పరిపాలిస్తారు. అప్పుడు ప్రజలను ఇంకా శోధించడానికి, మోసం చేయడానికి సైతాన్ అనేవాడికి అవకాశం లేదు, వాడు బంధించబడతాడు.
Detailed English Translation:
❓ Question: What is the meaning of “beating swords into plowshares” according to Micah 4:3? How is a world without war possible during the Millennial Reign of Christ? Will the nature of animals change along with humans?
- An End to Warfare: In those days, people will no longer learn the art of war. Weapons like swords and daggers will become obsolete. They will be broken down and handed to blacksmiths to be reforged into plowshares and agricultural tools for farming.
- A Harmonious Society: Micah 4:3 says, “He will judge between many peoples… they will beat their swords into plowshares and their spears into pruning hooks. Nation will not take up sword against nation, nor will they train for war anymore.” Such will be the world—filled with peace and reconciliation.
- A New Perspective on Life: People will begin to question the need for war and violence. The collective mindset will shift toward living a happy life during the time given to them. This change isn’t limited to humans; even animals will cease to be harmful. Children will play near a cobra’s den and reach into it without any harm.
- Transformation of Nature: Scripture says the lion, the bear, and the lamb will play together. Lord Jesus will rule such a world of reconciliation for a thousand years. During this time, Satan will be bound, leaving him no opportunity to tempt or deceive humanity.
