మీరు చేస్తున్నట్వంటి అపొస్తలుల బోధలోకూడ అనేక విమర్శలు అజ్ఞానంతో చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ లక్షలమంది వేలాదిమంది ఉన్నవారు శిష్యరికం మీద ఎందుకు వీరు విభజించడం లేదు? ఒకవేళ పెత్తందారి విధానం వెళ్ళిపోతదనా? నాయకత్వం ఇతరులకు బదిలిగా ఉంటుందనా? వీళ్ళ భయం ఏమిటి?
మోషే ఇచ్చిన ఐడియాలజీని వీళ్ళెందుకు విభేదిస్తున్నారు? విభేదించటానికి కారణం ఎమిటి?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ముందు మీరడిగిన ప్రశ్నకి ఇప్పుడడిగిన ప్రశ్నకి రెండింటికి సమాధానం ఒకటే. ఏంటంటే ఇగో-EGO ప్రాబ్లమ్. మీరింతకముందు పెత్తందారి వ్యవస్థ కూలిపోతుంది, అధికారాలు వేరేవాళ్ళకు బదిలీ అయిపోతాయి అనే ఉద్దేశ్యంతో, ఇప్పటి క్రైస్తవ నాయకులు ఉద్యమంలోకి రావాట్లేదనే మాట మీరు వాడారు. అది అక్షరాల సత్యం! ప్రతివాళ్ళకి ఏంటంటే, వాళ్ళ వాళ్ళ సామ్రాజ్యంలో, వాళ్ళకు నవాబులుగా, చక్రవర్తులుగా ఎష్టాబ్లిష్ (Establish) అయిపోయి ఉన్నారు. ఓఫీరుగారి ఐడియాలజీ అందరికి ఎక్కిందనుకోండి. ఈ పెత్తందారులు ఒక్కరుకూడా ఉండరు. అందరూ సత్యంలోకి వచ్చేసినప్పుడు మానవ కల్పిత అధికారాలు కూలిపోతాయి. గనుక వాళ్ళు Ego – ఇగో ప్రాబ్లమ్తో మనల్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది క్రైస్తవ నాయకుల ఇగో.
అలాగే మోషేయొక్క రాజ్యాంగ పద్దతిని అంగీకరించకపోవడం క్రైస్తవేతరుల నాయకులయొక్క ఇగో. అహం ప్రాబ్లమే! అదైనా, ఇదైనా ఒక మంచి చెబితే వినకపోవడం ఏంటి అనంటే నా గొప్పతనం పోతందనే అభద్రతాభావం (Insecurity). మీరన్న మాట వాస్తవం ఏంటంటే, ఒక విశిష్టమైనట్వంటి దర్శనంతో, దార్శనికతలో మన ఉద్యమాన్ని టేక్-ఆఫ్ (Take up) చేసాము. ఏటికి ఎదురీదుతున్నాము. ఇది కష్టమైన పోరాటం. కాని ఆఖరికి జయం మనదే! ఎప్పటికైనా సత్యం, న్యాయం జయిస్తుంది. కొంచెం టైం పట్టొచ్చు. మీలాంటివారందరూ సమాజంలో అక్కడక్కడ ఉన్నారు. ఆశీర్వదిస్తున్నారు, సహకరిస్తున్నారు. తప్పకుండా దేవుడు మనకు జయం అనుగ్రహిస్తాడు.