❓ ప్రశ్న: లూసిఫర్ పరలోకంలో ఉన్నప్పుడే గర్వించి పడిపోయాడు కదా.. రేపు మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అలా పడిపోయే అవకాశం ఉందా? దేవుడు మన విషయంలో తీసుకున్న ముందు జాగ్రత్త ఏమిటి? (1:02:41)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 26s)
- 🛡️ దేవుని ముందు జాగ్రత్త: చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇలాంటిది జరగడానికి అవకాశము లేకుండా ఉండడానికి, మన క్షేమము కొరకు మనం కూడా లూసిఫర్ చేసిన తప్పు మనం చేయొద్దని దేవుడు ఒక జాగ్రత్త తీసుకున్నాడు.. ముందు జాగ్రత్త. లూసిఫర్ తన అందాన్ని, జ్ఞానాన్ని చూసి అతిశయించి పడిపోయాడు.
- 🧱 అతిశయానికి తావు లేదు: రోమా పత్రిక మూడవ అధ్యాయము 27వ వచనం – “కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను.” అతిశయించడానికి ఎవడికీ అవకాశం లేకుండా చేశాడు. ఎఫెసి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది, తొమ్మిది వచనాలు – “మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు.. ఇది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయ పడలేదు వీలు లేదు.”
- ⚖️ క్రియల ద్వారా రక్షణ ఎందుకు కాదు?: చూసారా.. అందుకే క్రియల ద్వారా రక్షణ దేవుడు ఇవ్వట్లేదు. ఇస్తే మనం మళ్ళా లూసిఫర్ అవుతాం. “నేను ఇంత చేసి రక్షణ పొందాను” అని నెక్స్ట్ మనమే లూసిఫర్ అయిపోతాం. అందుకే క్రియలు అనేది పక్కన పెట్టేసాడు. మన సొంత నీతి వల్ల పరలోకానికి వెళ్తే గర్వం వచ్చే అవకాశం ఉంటుంది, అందుకే దేవుడు తన కృపనే ఆధారంగా చేశాడు.
- ✨ రక్షణ సంకల్ప విశిష్టత: మొదటి కోరింతి పత్రిక ఒకటి 27 – “ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు.. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు.” ఈ వచనాలన్నీ మనకు ఏం చెప్తున్నాయి అంటే – మనం అతిశయించకుండా, గర్వించకుండా ఉండే ఏర్పాట్లు ముందు జాగ్రత్త ముందే దేవుడు తీసుకున్నాడు. ఈ రక్షణ సంకల్పం అందుకే విశిష్టమైంది. మళ్ళా మనం అక్కడ పోయినాక పడే అవకాశం లేదు.
Detailed English Translation:
❓ Question: Lucifer fell even while being in Heaven due to pride. Is there a possibility that we might also fall in the same way after reaching Heaven? What precautionary measures has God taken for our safety?
- God’s Precautionary Plan: This is an excellent question. To prevent such a fall and for our own well-being, God has taken a “pre-cautionary” measure so that we do not repeat Lucifer’s mistake. Lucifer fell because he boasted about his own beauty and wisdom.
- No Room for Boasting: Romans 3:27 asks, “Where then is boasting? It is excluded.” God has removed any opportunity for anyone to boast. Ephesians 2:8-9 states, “For by grace you have been saved through faith… not of works, lest anyone should boast.”
- Why Salvation is Not by Works: If salvation were through our own works, we would become like Lucifer. We would say, “I achieved this salvation through my efforts,” and pride would set in. To prevent this, God set aside “works” as the basis for salvation. If we entered Heaven based on our own merit, we might become prideful again.
- The Uniqueness of God’s Plan: 1 Corinthians 1:27 says, “But God has chosen the foolish things of the world to put to shame the wise… so that no flesh should glory in His presence.” All these scriptures show that God has already made arrangements to ensure we remain humble. This is why His plan of salvation is so unique. Once we reach Heaven through His grace, there is no possibility of falling again.
