❓ ప్రశ్న: అపోస్తలుల కార్యములు 18:18లో పౌలు తన తల వెంట్రుకలు గొరిగించుకున్నాడని వ్రాయబడి ఉంది. అసలు పౌలు పాటించిన ఈ ‘నాజీరు మ్రొక్కుబడి’ (Nazirite Vow) ఏంటి? ధర్మశాస్త్రం దీని గురించి ఏం చెబుతోంది? క్రైస్తవ పరిచర్యలో దీని ప్రాధాన్యత ఏమిటి? (1:07:05)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 27s)
- 🛡️ ధర్మశాస్త్రం – పౌలు నిష్ఠ: అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలీయుడు కదా.. యూదుల ధర్మశాస్త్రానుసారమైన నీతి విషయంలో అనింద్యుడను అని చెప్పుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని చాలా కఠోర దీక్షతో పాటించిన వాడు పౌలు భక్తుడు. ఆయన రక్షింపబడిన తర్వాత కూడా కొన్ని యూదుల ఆచారాలను సందర్భాన్ని బట్టి పాటించేవాడు.
- 🧱 నాజీరు మ్రొక్కుబడి నియమాలు: ధర్మశాస్త్రంలో సంఖ్యాకాండము ఆరవ అధ్యాయంలో నాజీరగుటకు ఎవరైనా మ్రొక్కుకొని తనను తాను ప్రత్యేకించుకున్న యెడల.. అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తనను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు తన తల వెంట్రుకలను ఎదుగనియ్యవలెను.
- ⚖️ ప్రతిష్ఠించుకున్న దినాలు: ఒక మూడు వారాల, నాలుగు వారాల లేకపోతే నెల రెండు నెలల.. అతను అనుకున్నటువంటి ప్రతిష్టించుకున్న దినాలు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. మ్రొక్కుబడి తీరిన తర్వాత అప్పుడు ఏం చేయాలి అంటే అతడు తన తల వెంట్రుకలు గొరిగించుకోవాలి. ఆ వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు తీసుకొని అగ్నిలో వేయాలి.
- ✨ పౌలు అనుసరణ: ఈ వ్రతంలో ఉన్నాడు పౌలు. ఏం లేదు బ్రదర్, మనం ప్రార్థన కొరకు ఇప్పుడు కూడా మనం ప్రతిష్టించుకుంటాం కదా 40 రోజులు ఉపవాసం అని.. ఆ రోజుల్లో ఆయన యూదుడు గనుక మంగళ కత్తి తన తల మీద వేయకూడదు అనే ఒక నియమం ఉంది, దాన్ని పాటించాడు. ప్రార్థనకు ప్రతిష్టించుకున్న టైం గడిచిపోయినాక హెడ్ షేవ్ (Head shave) చేసుకున్నాడు. ఇది ఆయన దైవభక్తికి మరియు సమర్పణకు నిదర్శనం.
Detailed English Translation:
❓ Question: It is written in Acts 18:18 that Paul shaved his head. What is this ‘Nazirite Vow’ that Paul observed? What does the Law say about it, and what is its significance in Christian ministry?
- Paul’s Commitment to the Law: Apostle Paul was an Israelite and claimed to be blameless regarding the righteousness found in the Jewish Law. He followed the Law with great discipline. Even after his conversion, he occasionally observed certain Jewish customs depending on the context.
- Rules of the Nazirite Vow: In the book of Numbers, Chapter 6, it is stated that if anyone makes a special vow to separate themselves as a Nazirite to the Lord, no razor shall touch their head during the days of their vow. They must let their hair grow until the period of their dedication is complete.
- The Period of Dedication: Whether it was for three weeks, four weeks, or a couple of months, the individual could not cut their hair during the days they had consecrated themselves. Once the vow was fulfilled, they were required to shave their head and place the hair from the vow into the fire of the sacrifice.
- Paul’s Observance: Paul followed this specific vow. Just as we might consecrate ourselves today for 40 days of fasting and prayer, Paul, being a Jew, followed the rule that no razor should touch his head during his period of consecration. Once his time of prayer and dedication ended, he shaved his head as per the custom. This act was a sign of his deep devotion and commitment to God.
