❓ ప్రశ్న: సంస్కృత భాషకు సొంత లిపి లేదా అక్షరమాల లేదని వేద పండితులే ఒప్పుకుంటున్నారా? అత్యంత ప్రాచీనమైన వేదాలు ఏ లిపిలో రాయబడ్డాయి? హెబ్రీ భాష ప్రాచీనత మరియు బైబిల్ గ్రంథ రచన విశేషాలేమిటి? (1:11:02)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (05m 28s)
- 🛡️ లిపి లేని సంస్కృతం: సంస్కృత భాషలో వేదములు రాయబడినవి అని అంటారు. అత్యంత ప్రాచీనమైనవి వేదాలు అంటారు. మరి వేదము వ్రాయబడింది అని చెప్పిన సంస్కృత భాషకు ఈ రోజుకి కూడా లిపి లేదు. దేవనాగరి లిపినే వాళ్ళు వాడుకుంటున్నారు. క్రీస్తుకు పూర్వం (BC) సంస్కృతం రాయబడ్డ ఒక్క గ్రంథం లేదా ప్రతి అసలు లేదు. ఇది ఒక చారిత్రక వాస్తవం.
- 🧱 హెబ్రీ భాషా ప్రాచీనత: క్రీస్తుకు పూర్వం 1500 ఏళ్ల క్రిందట హెబ్రీ భాషలో దేవుడే తన చూపుడు వేలుతో రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాశాడు. అంటే బి.సి. 1500 నాటికే హెబ్రీ భాషకు అక్షరమాల (Alphabets) ఉన్నాయి. సంస్కృత భాష కంటూ సొంత అక్షరమాల ఈ రోజుకి కూడా లేదు.
- ⚖️ వేద పండితుల అంగీకారం: ఆర్య సమాజ పండితులు పాతూరి రాధాకృష్ణ గారు నాకు మంచి మిత్రులు. ఆయనను నేను వ్యక్తిగతంగా – “గురువుగారు, సంస్కృత భాషకు అక్షరమాలే లేదు కదా?” అని అడిగితే, ఆయన ఆ మాట నిజమేనని అంగీకరించారు. వేద మంత్రాలు ‘అనుశృతంగా’ (వినడం ద్వారా) వచ్చినవే తప్ప, రాసి ఉంచినవి కావు. గురువు చెప్పగా వినాలి, గుర్తుంచుకోవాలి, మళ్ళీ చెప్పాలి – అందుకే వాటిని ‘శ్రుతులు’ అన్నారు.
- ✨ బైబిల్ గ్రంథ విశిష్టత: ఫిజికల్ గా రాయటానికి ఒక అక్షరమాల సంస్కృతానికి లేదనే సంగతి వేద పండితులే ఒప్పుకుంటున్నారు. కానీ హెబ్రీ భాషకు క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ల నాడే అక్షరమాల ఉన్నది. అందుకే బైబిల్ పాత నిబంధన అంత ప్రాచీన కాలంలోనే రాయబడింది. భవిష్య పురాణం వంటి గ్రంథాలను పరిశీలిస్తే అందులో ఆదాము, నోవహు వంటి బైబిల్ పాత్రలు కనిపిస్తాయి, ఇదంతా బైబిల్ నుండి సేకరించిన సమాచారమే.
Detailed English Translation:
❓ Question: Is it true that Vedic scholars themselves admit Sanskrit lacks its own script or alphabet? In what script were the ancient Vedas written? What are the facts regarding the antiquity of the Hebrew language and the writing of the Bible?
- Sanskrit’s Lack of Script: It is claimed that the Vedas were written in Sanskrit and are the most ancient texts. However, the Sanskrit language lacks its own script even today; it utilizes the Devanagari script. There is not a single manuscript or copy of a Sanskrit text dating back to before Christ (BC). This is a historical fact.
- The Antiquity of Hebrew: Around 1500 BC, God Himself wrote the Ten Commandments on stone tablets in the Hebrew language. This proves that Hebrew had a functional alphabet and writing system as early as 1500 BC. In contrast, Sanskrit still does not possess its own unique alphabet.
- Admission by Vedic Scholars: My good friend and Arya Samaj scholar, Pathuri Radhakrishna, personally admitted to me that Sanskrit lacks an alphabet. He agreed that Vedic mantras were passed down through an oral tradition—heard from a teacher, memorized, and recited—which is why they are called ‘Shrutis’ (that which is heard).
- The Uniqueness of the Bible: While Vedic scholars concede that Sanskrit lacked a physical writing system, Hebrew possessed an alphabet over 2000 years before Christ. This enabled the Old Testament of the Bible to be recorded in such an ancient era. Furthermore, texts like the Bhavishya Purana contain mentions of biblical figures like Adam and Noah, indicating they were influenced by or copied from biblical records.
