❓ ప్రశ్న: మనిషి పుట్టుకతోనే ‘అహం’ (Ego) కేంద్రం కలిగి ఉంటాడా? ఆదాము హవ్వలు పండు తినకముందు వారి మనస్తత్వం ఎలా ఉండేది? చిన్న పిల్లల్లో కనిపించే అసూయ, స్వార్థం వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణం ఏమిటి? (1:16:30)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (05m 10s)
- 🛡️ పుట్టుకతోనే అహం: అహం అనేది పుట్టినప్పుడు ఉండదా అంటే – 100% ఉంటది. చిన్న పిల్లలకు మాటలే రావు, ఏమీ రావు.. కానీ మనం వారి బొమ్మ లాక్కుంటే “నాది” అని తీసేసుకుంటారు. రాని మాటలతో, శబ్దాలతో, ఎక్స్ప్రెషన్స్తో “నాది నాది” అని ఆ అహాన్ని చాటుకుంటారు.
- 🧱 అహం వికృత రూపం: నేను అంటూ ఒక ప్రత్యేక వ్యక్తిని, నాకంటూ ఒకటి ఉండాలి, ఇది నా సొంతము అనే స్పృహ ఊహ తెలియక ముందు నుండి ఉంటుంది. అది మనం పెరిగే కొద్దీ ఇంకా డెవలప్ అవుతూ, పరిపక్వ దశలోకి వస్తుంది. అది బాగా వికృత రూపం దాల్చి, అహాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి అవసరమైతే ఒక మనిషిని చంపేయాలనే ద్వేషం పుట్టేటంతగా ఉంటుంది.
- ⚖️ పిల్లలలో అసూయ – ఉదాహరణ: ఒక బాబు పుట్టిన మూడు ఏళ్ళకు ఇంకో చెల్లి పుట్టిందనుకోండి, అందరి దృష్టి ఆ పాప మీద ఉంటే ఈ బాబు నెగ్లెక్టెడ్ (Neglected) గా ఫీల్ అవుతాడు. “మొన్నటి దాకా నన్నే ఎత్తుకున్నారు, ఇప్పుడు ఈమెను ముద్దు పెట్టుకుంటున్నారు” అని లోపల రగిలిపోయి, ఎవరూ లేని టైమ్ చూసి పాపను మంచం మీద నుండి తోసేస్తాడు. తన స్థానాన్ని కోల్పోతున్నాననే ఈ ద్వేషం కూడిన ఆదాము మనస్తత్వం, కయ్యీను మనస్తత్వం ప్రతి మనిషిలో ఉంటుంది.
- ✨ పతనానికి ముందు స్థితి: ఆదాము హవ్వలు పండు తినక ముందు స్వచ్ఛమైన, పరిశుద్ధమైన హృదయాలు వాళ్ళవి. స్వార్థము, అహం అనేది ఏ మాత్రము లేదు. దేవుని వంటి మనస్తత్వం వాళ్ళకి అప్పుడు ఉండేది.. అంటే అవతలి వాళ్ళ ఇంపార్టెన్స్ (Importance) ఏ ముఖ్యం. పండు తిన్న తర్వాత అది పోయి అంతా రివర్స్ అయిపోయింది. దేవుని కేంద్రంగా ఉన్న బ్రతుకు స్వయం (Self) కేంద్రంగా మారిపోయింది.
Detailed English Translation:
❓ Question: Is the center of ‘Ego’ present in a human from birth? What was the mindset of Adam and Eve before they ate the forbidden fruit? What is the spiritual reason behind the envy and selfishness observed in young children?
- Ego from Birth: Does ego exist at birth? It is 100% present. Young children who cannot yet speak will instinctively grab a toy back and claim it as “mine.” Even without words, they express this through sounds and gestures, asserting their ownership.
- The Evolution of Ego: The awareness of being a distinct individual with personal possessions exists even before a child attains understanding. As we grow, this ego develops and matures. In its distorted form, it can escalate to such hatred that a person might even commit murder just to satisfy their ego.
- Envy in Children – An Example: Consider a three-year-old boy who gets a new baby sister. If everyone focuses on the baby, the boy feels neglected. Thinking, “They used to carry me, but now they are kissing her,” he might feel resentful and push the baby off the bed when no one is looking. This innate hatred and jealousy, rooted in the nature of fallen Adam and Cain, exists within every human being.
- State Before the Fall: Before eating the fruit, Adam and Eve possessed pure and holy hearts. There was absolutely no selfishness or ego. They had a God-like mindset where the importance of others came first. After the fall, this was completely reversed. Life, which was once God-centered, became self-centered.
