1156.Q: The Unseen Spiritual Realm and the Blessedness of Faith (KSM 220) 👁️

❓ ప్రశ్న: మానవులు బ్రతికి ఉన్నప్పుడు ఆత్మల ప్రపంచాన్ని ఎందుకు చూడలేకపోతున్నారు? పరలోకం, నరకం కళ్ళకు కనబడితే అందరూ నమ్ముతారు కదా, మరి దేవుడు వాటిని ఎందుకు దాచి ఉంచాడు? “చూడక నమ్మిన వారు ధన్యులు” అంటే ఏంటి? (1:35:04)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 02s)

  • 🛡️ విశ్వాసపు విధానం (Policy of Faith): ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మనము బ్రతికుండగానే చూడగలిగితే – “విశ్వాసము ద్వారా కృప చేతనే మీకు రక్షణ ఇస్తాను” అనే పాలసీ (Policy) ఇంప్లిమెంట్ కాదు. ఇప్పుడు మనలో విశ్వాసము, విధేయత ఉండాలి. దేవుని మాట నమ్మడం, దేవుని మాటకు లోబడి చెప్పింది చేయడం.. ఈ రెండు లక్షణాలు ఆదాము హవ్వలు చూపలేకపోయారు. ఇప్పుడు మనం వాటిని నిరూపించాలి.
  • 🧱 కనిపించని దానిని నమ్మడం: ఆత్మల ప్రపంచం అంతా మనకి ఇప్పుడు కనపడిపోతుంది అనుకోండి.. ఒకవైపు దేవుడు, దేవదూతలు, పరలోకం.. మరోవైపు అగ్నిగుండము, నరకము కనపడుతుంటే – ఇక నమ్మకుండా ఎవడు ఉంటాడు? అందరూ భయపడి నమ్ముతారు! కానీ దేవుని మాటను నమ్మే ‘విశ్వాసము’ పని చేయాలంటే – కనబడని దానిని మనం నమ్మాలి.
  • ⚖️ ధన్యులు ఎవరు?: “చూడక నమ్మిన వారు ధన్యులు” అన్నాడు. నాస్తికులు, హేతువాదులు అంటారు – ఆత్మల ప్రపంచం మనకి ఇప్పుడు కనబడచ్చు కదా అని. ఒకవేళ ఆ అగ్నిగుండం కళ్లారా కనబడుతుంటే, మారుమనసు లేనివాడు, పాపాన్ని ద్వేషించని వాడు కూడా భయంతో అర్జెంట్ గా బాప్తిస్మాలు పొందుతారు. అప్పుడు మనిషి హృదయంలోని యథార్థత బయటపడదు.
  • విశ్వాస పరీక్ష: అబద్ధము, కల్పిత కథలు ప్రచారానికి అవకాశం ఉండదు. ప్రతి మనిషి యొక్క విశ్వాసాన్ని, విధేయతను దేవుడు పరీక్షించే అవకాశం ఉండదు. అందుకే ఆ ప్రపంచం స్పష్టంగా కళ్ల ముందు ఉండకూడదు. దేవుని మాట మీద గౌరవంతో, ఆయన చెప్పిన దానిని నమ్మే వారే ఆయనకు కావాలి.

Detailed English Translation:

❓ Question: Why are humans unable to see the spiritual realm while they are alive? If Heaven and Hell were visible to the eyes, everyone would believe, wouldn’t they? So why has God hidden them? What does it mean that “Blessed are those who have not seen and yet have believed”?

  • The Policy of Faith: If we could see the spiritual world while alive, the policy of “Salvation by grace through faith” could not be implemented. Currently, faith and obedience are required. Adam and Eve failed to show trust in God’s word and obedience to His command. Now, we are expected to demonstrate those qualities.
  • Believing the Unseen: Suppose the entire spiritual world was visible to us right now—God, angels, and Heaven on one side, and the lake of fire and Hell on the other. Who wouldn’t believe then? Everyone would believe out of sheer sight! However, for ‘Faith’ to function, one must believe in what is not seen.
  • Who are the Blessed?: Jesus said, “Blessed are those who have not seen and yet have believed.” Atheists and rationalists ask why the spiritual world isn’t visible now. If the lake of fire were visible, even those without true repentance or a hatred for sin would rush to get baptized out of fear. In such a scenario, the true sincerity of a person’s heart would never be revealed.
  • The Test of Obedience: If everything were visible, there would be no room for false stories or deception, and more importantly, God would not have the opportunity to test the faith and obedience of each individual. Therefore, that world must remain unseen to the physical eye. God desires those who honor His Word and believe Him simply because He said so.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram