(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: చదవకపోనివ్వండి! దానికి వాళ్ళమీద కేసు పెట్టలేం కదా! అది వాళ్ళ మతస్వాతంత్య్రానికి సంబంధించిన విషయము. ఒకడు ఏమతమునైనా నమ్మవచ్చు అన్న క్లాస్ (clause) కింద ఒక మతములో ఉన్నట్వంటి ఏ సిద్ధాంతానైనా నమ్మొచ్చు. దేన్నైనా వినకుండా చెవులు మూసుకోవచ్చు. అది వారి వ్యక్తిగత స్వాత్రంత్య్రం. కాని నేను నమ్మేదేంటంటే ఇప్పుడు జరుగుతాయని నేను చెప్పిన పరిణామాలు, ప్రపంచ రాజకీయ సంభవాలు, వాటిని వాళ్ళు ముందు చదవకపోయినా, వాటిలోని మొదటి, రెండు సంగతులు మొదలు పెట్టగానే అప్పుడు చచ్చినట్లు అందరూ వెత్తుక్కొని చదువుతారు. అప్పుడు బ్లాక్ లో అమ్ముడుపోతుంది నా పుస్తకం! అదైతే జరుగుతుంది!