1161.Q: Reforms of Chilkur Rangarajan and the Recent Attack (KSM 219) 🏛️

❓ ప్రశ్న: చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై జరిగిన దాడిని ఎలా చూడాలి? ఒక అర్చకుడిగా ఆయన సమాజంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు ఏమిటి? ఈ దాడి పట్ల మీ స్పందన ఏంటి? (0:00:30)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (13m 10s)

  • 🛡️ ఆదర్శమూర్తి: రంగరాజన్ గారు ప్రధాన అర్చకులు.. క్రైస్తవుడు కాడు. అంతేగాని క్రైస్తవులు కూడా పాటించవలసిన మానవతా విలువలు పాటించినటువంటి ఒక ఆదర్శ మూర్తి ఆయన. ప్రతి మతంలోని పూజారులు, పాస్టర్లు, అర్చకులు, ధర్మ ప్రచారకులందరికీ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు రోల్ మోడల్ (Role Model).
  • 🧱 మానవతా దృక్పథం: నా గుండెల నిండా వారి పట్ల అభిమానం ఉంది. చాలా యదార్ధంగానే మాట్లాడితే ఏదైనా సరే.. వారి అభిమానిని నేను. వారికి కులపిచ్చి లేదు. ఆ మధ్య కూడా ఒక దళిత స్వామీజీ.. ఆదిత్య పరాశ్రీ అని ఆయన.. అతన్ని భుజాల మీద ఎత్తుకొని మోసుకొని పోయినాడు. వాళ్ళ ధర్మంలోనైనా ఒక బ్రాహ్మణుడు ఒక దళితున్ని అలా ముట్టుకోడు కదా. అంతవరకైనా ఆయన ఒక ముందంజ వేసినట్టే. అది చాలా గొప్ప విషయం.
  • ⚖️ విప్లవాత్మక మార్పులు: ఆయన కల్మషం లేని పసిబిడ్డ లాంటి హృదయం కలిగిన వాడు. ఆయనకు స్వార్థం లేదు, డబ్బాశ లేదు. అక్కడ హుండీలు తీసేసాడు. ఈ హుండీలు ఉన్నటువంటివన్నీ కూడా గవర్నమెంట్ దేవాదాయ శాఖ కిందకి వస్తాయి.. అప్పుడు మళ్ళీ ప్రజలకు స్వేచ్ఛ ఉండదు. ఎందుకు అసలు మాకు ఆ హుండి వద్దు ఏది వద్దు అని చెప్పి తీసి తీసేసాడు. ఏ మతస్తుడైనా ఏ కులస్తుడైనా రావచ్చు.. మీకు విశ్వాసం ఉంటే ఇక్కడ ఆరాధన చేసుకొని పోవచ్చు అనే అంత ఒక విప్లవాత్మకమైన మార్పాన్ని తీసుకొచ్చారు.
  • దాడిపై తీవ్ర ఖండన: నా హృదయం నిజంగా నా సొంత అన్నయ్యనో తమ్ముడినో తండ్రినో ఎవడో వచ్చి కొట్టాడు అన్నంత గాయపడింది. ఈ వీర రాఘవ రెడ్డి ఆయనను చాలా గదమాయించి, అవమానించి మాట్లాడుతున్నారు. ఏదైనా చెబుదామని ఆయన ప్రయత్నిస్తుంటే నువ్వు మాట్లాడొద్దు అని చెప్పనివ్వట్లేదు. పిచ్చి పట్టినట్టు పిచ్చి కుక్కల్లాగా ప్రవర్తించారు. ఇది చాలా నీచమైనటువంటి కృత్యం. దీన్ని ఇండియా ప్రజాబంధు పార్టీ అధినేతగా, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అధినేతగా, ఒక సామాన్య భారత పౌరుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి చేసిన వాళ్ళను క్షమించడానికి వీలు లేదు.

Detailed English Translation:

❓ Question: How should we view the attack on Rangarajan, the chief priest of Chilkur Balaji Temple? What are the revolutionary reforms he introduced as a priest? What is your response to this incident?

  • A Role Model: Rangarajan Gaaru is a chief priest; he is not a Christian. However, he is an exemplary figure who practices the human values that even Christians should follow. For priests, pastors, and religious preachers of every faith, he stands as a true role model.
  • Humanitarian Perspective: I have immense respect and affection for him in my heart. To speak truthfully, I am a fan of his. He has no caste prejudice. Some time ago, he even carried a Dalit devotee, Aditya Parashri, on his shoulders. In their tradition, a Brahmin wouldn’t typically even touch a Dalit, yet he went this far. It is a great and progressive step.
  • Revolutionary Reforms: He possesses a heart as pure as an innocent child. He has no selfishness or greed for money. He removed the ‘Hundi’ (offering boxes) from the temple. Usually, temples with Hundis fall under the government’s Endowment Department, which limits people’s freedom. He decided they didn’t need a Hundi at all. He brought about a revolutionary change where anyone of any religion or caste could visit and worship if they had faith.
  • Strong Condemnation of the Attack: My heart is deeply pained, as if someone had come and attacked my own brother or father. Veera Raghava Reddy treated him with extreme disrespect and humiliation. When the priest tried to say something, he was silenced and barked at like a mad dog. This is a very heinous act. As the leader of the India Prajabandhu Party, the head of the Rashtriya Kraistava Parishad, and as an ordinary Indian citizen, I strongly condemn this. Those who commit such acts should not be forgiven.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram