❓ ప్రశ్న: చిలుకూరు రంగరాజన్ గారిపై దాడి జరిగినప్పుడు వచ్చిన స్పందన, దళిత ప్రొఫెసర్ చంగయ్య గారిపై దాడి జరిగినప్పుడు ఎందుకు రాలేదు? సమాజంలో మనువాద ప్రభావం ఎంతవరకు ఉంది? మతపరమైన దాడులను నిరోధించడంలో పాలక వర్గాల వైఖరి ఏమిటి? (0:07:40)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (05m 50s)
- 🛡️ సమంజసమైన ప్రశ్న: తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో చంగయ్య గారి మీద.. ప్రొఫెసర్ మీద కూడా.. ఆయన దళితుడు. ఆయన మీద పోయి కొందరు ఈ మతోన్మాదులు దాడి చేసినారు. మరి అప్పుడు ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, పోలీసు వారందరూ ఎందుకు స్పందించలేదు అని కూడా మీడియాలో ఒక ప్రశ్న వినబడుతుంది. అది చాలా సమంజసమైన ప్రశ్న.
- 🧱 జీర్ణించుకుపోయిన మనువాదం: ఈయన బ్రాహ్మణుడు కాబట్టి ఒక బ్రాహ్మణుడిని కొట్టడం దారుణమైన విషయం అనే మనువాదం నరనరాన జీర్ణించుకుపోయింది గనుక.. “అంత దారుణం అండి బ్రాహ్మణుడిని కొడతారా” అనేది ఉంది. అంటే బ్రాహ్మణుడిని కొడితేనేమో దారుణం, దళితుడైనటువంటి ప్రొఫెసర్ చంగయ్య గారిని కొడితేనేమో అంత దారుణం కాదులే అంటే.. సమాజం నిండా మనువాదమే జీర్ణించుకుపోయింది.
- ⚖️ వివక్షా పూరిత స్పందన: ఇదే స్పందన అప్పుడు కూడా వచ్చి ఉండాలి. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక దళిత స్కూల్ మాస్టర్ ని.. అయ్యప్ప డ్రెస్ వేసుకొని వచ్చారు అని ఆ టీచర్ అబ్జెక్షన్ చేస్తే, మళ్ళా టీచర్ తోనే పిల్లల కాళ్ళు మొక్కించి క్షమాపణ చెప్పించి ఇట్లా చేశారు. కాబట్టి అసలు దైవ భక్తి గాని, పెద్దలంటే భయము భక్తి గాని లేనటువంటి ఒక తరం తయారైపోయింది.
- ✨ భ్రష్టు పట్టిన తరం: ఈ తరం అయితే మొత్తం భ్రష్టు పట్టిపోయింది.. పెద్దంతరం చిన్నంతరం ఏమీ లేదు, పెద్ద చిన్న మర్యాద లేదు. మూర్ఖతరం తయారైపోయింది. దీనికి పరాకాష్ట చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి మీద దాడి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను క్రైస్తవుడిని, క్రైస్తవ ధర్మ ప్రచారకుడిని.. అయితే నేను ఒక మనిషిని, ఆయన గారు ఒక మనిషి కదా. అసలు ఈ దాడి అనేది ఎవరు ఎవరి మీద చేసినా తప్పే.
Detailed English Translation:
❓ Question: Why was the response to the attack on Chilkur Rangarajan so different from the response when Dalit Professor Changayya was attacked? To what extent does ‘Manuvada’ influence society? What is the stance of the ruling class in preventing religious attacks?
- A Valid Question: In Tirupati Venkateswara University, an attack was carried out by fanatics on Professor Changayya, who is a Dalit. A valid question is being raised in the media: why didn’t Chief Ministers, public representatives, and the police respond then as they do now?
- Deeply Rooted Manuvada: Because Rangarajan is a Brahmin, the mindset that “hitting a Brahmin is a heinous crime” is deeply ingrained due to Manuvada. People exclaim, “How terrible! How can someone hit a Brahmin?” If hitting a Brahmin is considered terrible while hitting a Dalit Professor like Changayya is seen as ‘not so serious,’ it proves that Manuvada has saturated society.
- Discriminatory Response: The same level of outrage should have been there for Professor Changayya too. In Telangana, when a Dalit school teacher objected to students wearing Ayyappa attire to school, he was forced to bow at the students’ feet and apologize. This shows a generation is rising with no respect for elders or true devotion to God.
- A Degenerated Generation: This current generation has become completely corrupted; there is no sense of hierarchy or basic respect for elders. A foolish generation has emerged. The attack on the Chilkur Balaji Temple priest is the height of this ignorance. I strongly condemn this. I am a Christian and a preacher of the Christian faith, but first, I am a human being, and he is a human being. Any attack, regardless of who carries it out or who the victim is, is inherently wrong.
