❓ ప్రశ్న: విలియం బ్రెనహం (William Branham) అమెరికా నాశనం గురించి ప్రవచించారా? ఆయన రాసిన గ్రంథాల్లోని ‘స్పోకెన్ వర్డ్’ (Spoken Word) ప్రాశస్త్యం ఏమిటి? ముఖ్యంగా ఆయన దైవ త్రిత్వాన్ని (Trinity) నిరాకరించడాన్ని మరియు ఆయన పరిచర్యలో జరిగిన అద్భుతాలను ఎలా అర్థం చేసుకోవాలి? (0:34:41)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (08m 30s)
- 🛡️ రచనలలో అస్పష్టత: నేను చదివిన ఆయన పుస్తకాలన్నీ కూడా అసలు ఒక సెంటెన్స్ కంటిన్యూటి (Continuity) ఉండదు. ఆ ప్రసంగం మధ్యలో ఆపి, ఒక సెంటెన్స్ బ్రేక్ చేసి, మళ్ళా కొత్త సెంటెన్స్ ఎత్తుకొని అట్లా ఉంటాయి. అవన్నీ ‘స్పోకెన్ వర్డ్’ (Spoken Word) అని వాళ్ళు అంటున్నారు. ఆయన కూర్చొని ఒక బుక్ రాశాడని వారు చెబుతున్నారు కానీ, అందులో చాలా వరకు చెత్త మాటలే ఉన్నాయి.
- 🧱 త్రిత్వ నిరాకరణ – పెద్ద పొరపాటు: బ్రెనహం గారు చేసిన మొట్టమొదటి పొరపాటు – ఆయన దైవ త్రిత్వాన్ని ఒప్పుకోలేదు. దైవ త్రిత్వము నమ్మితే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని, త్రిత్వము అనే మాట నరకములో పుట్టిన సిద్ధాంతం అని ఆయన బోధించారు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అనే సత్యాన్ని ఆయన అంగీకరించలేదు. ఇది వాక్య విరుద్ధమైన బోధ.
- ⚖️ పునాదుల సవరణ: గొప్ప గొప్ప జ్ఞానము, ప్రత్యక్షతలు, ప్రవచనాలు ఎవరైనా ఎన్నైనా చెప్పి ఉండొచ్చు.. కానీ దేవుడు నాకు అప్పగించిన పని ఏమిటంటే ఈ విశ్వాస పునాదులను సరిచేయడం. ఈ క్రమంలో నన్ను బ్యాడ్ (Bad) చేయడమే కొందరి జీవిత ధ్యేయంగా మారింది తప్ప, ఒక ఆత్మను రక్షించాలనే తపన వారికి లేదు.
- ✨ రక్షణ మరియు అద్భుతాలు: మరి బ్రెనహం గారు పరలోకం వెళ్తారా అంటే – వెళ్తారు, ఎందుకంటే ఆయన యేసు రక్తాన్ని నమ్మాడు. త్రిత్వాన్ని నమ్మకపోయినా యేసును రక్షకుడిగా నమ్మినందుకు ఆయనకు పరలోకం ఉంటుంది. ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగినాయి, చనిపోయిన వారు కూడా లేచారు. ఆయన పైన ఎప్పుడూ ఒక అగ్ని స్తంభం లేదా మేఘం వెంబడించేదని ప్రచారం ఉంది, అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఆయన నెత్తి మీద అగ్ని స్తంభమే ఉన్నా సరే, త్రిత్వాన్ని గూర్చి ఆయన చేసిన బోధ మాత్రం తప్పే.
Detailed English Translation:
❓ Question: Did William Branham prophesy about the destruction of America? What is the significance of the ‘Spoken Word’ in his writings? Specifically, how should we view his rejection of the Trinity and the miracles performed during his ministry?
- Inconsistency in Writings: In the books of Branham that I have read, there is no continuity in the sentences. A sentence is often broken mid-way only to start something entirely new. These are called the ‘Spoken Word.’ While some claim he sat down and wrote books, many of the contents are nonsensical and confusing.
- Rejection of the Trinity: Branham’s primary error was his rejection of the Holy Trinity. He went as far as saying that believing in the Trinity would lead one to Hell, calling it a doctrine born in Hell. He refused to accept the distinct personalities of the Father, the Son, and the Holy Spirit. This is a scripturally incorrect teaching.
- Correcting the Foundations: People may share great knowledge, revelations, or prophecies, but God has specifically commissioned me to correct the foundations of faith. In this process, some have made it their life goal to malign me rather than focusing on saving souls.
- Salvation and Miracles: Will Branham go to Heaven? Yes, because he believed in the blood of Jesus Christ. Even if he misunderstood the Trinity, he believed in Jesus, and thus he has a place in Heaven. Many miracles happened through him, including the raising of the dead. There is a popular claim that a pillar of fire or a cloud always followed him. Regardless of whether a pillar of fire was over his head, his teaching regarding the Trinity remains false.
