(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: నిస్సందేహంగా, నిర్ద్వంద్వంగా, without any controversy, వేదములు బైబిల్ కంటే ముందు ఉన్నవి. అయితే వేదములు బైబిల్ కంటే ముందున్నది అనే సంగతికంటే, ఇంకా అక్యూరేట్ స్టేట్మెంట్ నేను చేస్తాను. ఏంటంటే, వేదముల రచన బైబిలు రచనకంటే ముందు మొదలై బైబిల్ రచన ప్రారంభం అయిన తర్వాత వేదాల రచన ముగించబడింది. ఇది ఫ్యాక్టు!
ఎలాగో నేను చెబుతా! ఇప్పుడు బైబిల్ రచన, అనేది మొట్టమొదటి, గ్రంథం. బైబిల్ లోని మొదటి అయిదు పుస్తకాలు, పంచకాండములు మోషే ప్రవక్త రాసాడు. మోషే క్రీ.పూ 1500 నాటి వాడు! మోషే కంటే ముందు 500 సంవత్సరాల సమయంలో అబ్రాహామును దేవుడు పిలిచాడు. BC 2000years అప్పుడు అబ్రాహామును పిలిచి, ఆయన ద్వారా ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు నిర్మించాడు. అయితే అబ్రాహామును దేవుడు పిలుస్తున్న ఆ సమయంలోనే క్రీ.పూ. 2000 సంవత్సరాల క్రితం, మద్యప్రాశ్చం నుండి ఆర్యులు ఉత్తర భారతదేశానికి వలస వచ్చారు. వాళ్ళు వలస వచ్చిన తర్వాత రాసినటువంటి మొట్టమొదటి గ్రంథం ఋగ్వేదం. వారు వలస వచ్చినకాలం, వాళ్ళు రాసిన కాలం BC 2000 years అది తొలివేద కాలము. అని డా॥ సర్వేపల్లి రాథాకృష్ణణ్ అన్నారు. రాధాకృష్ణణ్ గారి గ్రంథాలు చదవాలి. ఈ రోజుల్లో రాధాకృష్ణణ్ గారు బ్రాహ్మడు కదా? మీరు అంబేద్కరైటు! ఆయన పుస్తకాలు ఎలా చదువుతారు? అని కొంతమంది అర్థంలేని వివాదాన్ని లేవనెత్తుతున్నారు. మళ్ళీ ఇది ఇంకొరకం మనువాదమే. ఇన్నేల్లు మీరు మమ్మల్ని తొక్కేసారు. కాబట్టి ఇప్పుడు మేం మీమ్మల్ని తొక్కేస్తాం అన్నది కూడ ఇంకో మనువాదం. అసలు రియలిస్టిక్ వరల్డ్ వ్యూ అనేది మనం కలిగి ఉండాలి, That is Ophirism, the true world view. The right world view. ప్రపంచము మీద మనకుండే ప్రపంచ దృష్టి ప్రపంచమును ఏ వ్యూతో చూడాలి అనేది.
ఇప్పుడు అందులో మనకు బ్రాహ్మణుడు, బ్రాహ్మనేతరుడు అనే వివిక్ష మనకు లేదు. దొరికిన సాక్ష్యాధారాలను బట్టి సత్యం ఎవరు చెప్పినా మనం వింటాం, నమ్ముతాం. మరి రాధాకృష్ణన్ గారు పండితులు. మరి ఎన్నో ఆధారాలతో వారు చూపించిన విషయం ఏంటంటే BC 2000 years నాడు వేదం రాయబడింది. వేదముల రచనా కాలములు రెండు. తొలి వేదకాలము మలి వేద కాలం. తొలివేదం రాసిన తర్వాత మధ్యలో వెయ్యి సంవత్సరాల మౌనకాలం ఉన్నది. BC 1000 years నాడు, ఋగ్వేదం రాసిన 1000 years గ్యాప్ తర్వాత మళ్ళీ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం మూడు వేదాలు మలివేద కాలంలో వ్రాయబడ్డాయి. BC 1000 years అంటే అప్పుడు దావీదు మహారాజు కాలం దావీదు కీర్తనలలో ఉన్నట్వంటి కీర్తనలు, వ్రాస్తూ ఉన్నట్వంటి ఆ సమయంలో యోగి పుంగవులు, మహర్షులు మిగతా మూడు వేదాలు రాసారు. గనుక బైబిల్ కంటే ముందు వ్రాయబడిందా? అంటే బైబిల్ రచన కంటే ముందు వేదముల రచన ప్రారంభమైనది. బైబిల్ రాయడం మొదలు పెట్టిన తర్వాత 500 ఏండ్ల వరకు కొనసాగించబడింది. ఇదీ విషయం.