1173.Q: The Eternal Existence of God – No Beginning (KSM 219) 👶

❓ ప్రశ్న: తాతయ్య (రంజిత్ ఓఫీర్) గారూ.. దేవుడు మనందరినీ సృష్టించాడు కదా, మరి దేవుడు ఎప్పటి నుండి ఉన్నాడు? మనందరికీ ఉన్నట్లుగా దేవుడికి కూడా పుట్టినరోజు (Birthday) లేదా? (0:49:40)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (02m 40s)

  • 🛡️ కాలమునకు అతీతుడు: దేవుడు లేని కాలమే లేదు బేటా.. దేవుడు లేని టైమే (Time) లేదు. దేవుడు ఎప్పుడూ ఉన్నాడు.. ఆయన ఉండడానికి మొదలే లేదు. మనం పుట్టకముందు కాలం ఉంది, కానీ దేవుడు పుట్టకముందు అంటూ ఏమీ లేదు, ఎందుకంటే ఆయనకు పుట్టుక లేదు.
  • 🧱 పుట్టినరోజు లేని వ్యక్తి: మనకందరికీ ఒక మొదలు ఉంటది, బర్త్ డే (Birthday) ఉంటది.. నీకో బర్త్ డే, నాకో బర్త్ డే ఉంది. బర్త్ డే కంటే ముందు మనం లేము. అసలు బర్త్ డే నే లేని ఒకే ఒక వ్యక్తి దేవుడు. అందుకే ఆయన దేవుడు.. మనము సృష్టించబడిన వారము.. అదే మనకు, దేవునికి ఉన్న డిఫరెన్స్ (Difference) అన్నమాట.
  • ⚖️ బిగినింగ్ లేని దేవుడు: ఎవరికైనా ఒక బిగినింగ్ (Beginning) ఉంటది. కానీ దేవుని కంటూ బిగినింగ్ లేదు. లేదు కాబట్టే ఆయన దేవుడు.. ఒక బిగినింగ్ ఉన్నోడిని ఎవరిని మనం దేవుడు అని పిలవం. ఎవరైనా ఒక సమయంలో పుట్టారు అంటే వారు దేవుడు కాలేరు.
  • అనాది దేవుడు: దేవుడు అనాది కాలము నుండి ఉన్నవాడు, ఆయనకు పుట్టుక అనేది లేదు. ఆయన స్వయంభూవుడు, అంటే తనంతట తానుగా ఎప్పుడూ ఉన్నవాడు. మనల్ని సృష్టించిన వాడు గనుక మనకు ఆయన తండ్రి, కానీ ఆయనను ఎవరూ సృష్టించలేదు.

Detailed English Translation:

❓ Question: Grandpa (Ranjith Ophir)… God created all of us, but since when has God existed? Does He not have a birthday like all of us do?

  • Beyond Time: There is no time when God did not exist, my child. There is no such thing as a ‘time’ without God. He has always been there; there is no beginning to His existence.
  • The One Without a Birthday: Everyone has a beginning, a birthday. You have a birthday, and I have a birthday. Before our birthdays, we did not exist. But God is the only person who has no birthday at all. That is the fundamental difference between God and us.
  • No Beginning Means He is God: Everyone and everything else has a beginning (Beginning). But God has no beginning. Because He has no beginning, He is God. We cannot call anyone who has a starting point in time ‘God.’
  • The Eternal One: God has existed from eternity past; He has no birth. He is self-existent, meaning He has always been there by Himself. Since He created us, He is our Father, but no one created Him.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram