1175.Q: Memory of God after Death – Psalm 6:5 Explained (KSM 219) ⚰️

❓ ప్రశ్న: కీర్తన 6:5 ప్రకారం “మరణమైనవారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు.. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు?” అని ఉంది. పాతాళంలో ఉన్న ధనవంతుడికి తన ఐదుగురు సహోదరుల జ్ఞాపకం ఉంది కదా, మరి దేవుని జ్ఞాపకం ఉండదని ఎందుకు చెప్పబడింది? మరణం తర్వాత మనుషుల స్పృహ ఎలా ఉంటుంది? (1:01:00)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (02m 40s)

  • 🛡️ స్పృహ లేకపోవడం కాదు: “మరణము అయిన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు.. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుదురు?” అని భక్తుడు అన్నాడు. అక్కడ విషయం ఏంటంటే – అసలు పాతాళానికి పోయినటువంటి మృతులకు అసలు స్పృహే (Consciousness) లేదని అక్కడ చెప్పడం లేదు. వాళ్ళకి స్పృహే లేదని కాదు.. వారికి ‘దేవుని గూర్చిన జ్ఞాపకం’ లేదు.
  • 🧱 భూమి మీది సంబంధం: దేవుని గూర్చిన జ్ఞాపకం ఎప్పుడు ఉంటది? ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవునితో నడిస్తే ఆ జ్ఞాపకాలు ఉంటాయి. భూమి మీద ఉన్నప్పుడు దేవునితో నడిచిన వాడు పాతాళ అగ్గిలోకి పోడు, పరదేశిలోకి (Paradise) వెళ్తాడు. దేవునితో సంబంధం లేకుండా బ్రతికిన వాడు మాత్రమే పాతాళ అగ్గిలోకి పోతాడు.

[Image showing a conceptual division between ‘Sheol/Hades’ (place of darkness and distance from God) and ‘Paradise’ (place of light and fellowship with God), illustrating that spiritual memory of God depends on the relationship formed during earthly life]

  • ⚖️ దేవునితో నడవని వారి స్థితి: అక్కడ దేవుని గూర్చిన జ్ఞాపకం లేదు అంటున్నాడు అంటే – వాడు భూమి మీద దేవునితో సంబంధం లేకుండా బ్రతికాడు గనుక పాతాళ అగ్గిలోకి పోయినాడు. వాడు దేవుని ఎరుగడు గనుక వాడికి దేవుని జ్ఞాపకం ఉండదు. కానీ వాడికి తన కుటుంబం, తన పాపాలు, తన పాత జీవితం అంతా గుర్తొస్తాయి (ధనవంతుడికి తన తమ్ముళ్లు గుర్తొచ్చినట్లు).
  • మధురమైన అనుభవాలు: దేవునితో సంబంధం కలిగి బ్రతికితే.. మరణం తర్వాత దేవుని గూర్చిన జ్ఞాపకాలు ఖచ్చితంగా ఉంటాయి. భూమి మీద దేవునితో నడిచిన మధురమైన అనుభవాలు జ్ఞాపకం ఉంటాయి, ప్లస్ దేవుణ్ణి కూడా ప్రత్యక్షంగా వారు చూస్తారు. కనుక ఈ వాక్యం పాతాళ అగ్గిలోకి పోయే అవిశ్వాసుల స్థితిని గూర్చి చెబుతోంది.

Detailed English Translation:

❓ Question: Psalm 6:5 states, “For in death there is no remembrance of You; in the grave who will give You thanks?” If the rich man in Hades remembered his five brothers, why does it say there is no memory of God? What is the state of human consciousness after death?

  • Not a Loss of Consciousness: The scripture says, “In death there is no remembrance of You.” This does not mean that those who die and go to Hades lose all consciousness. It specifically says they have no ‘remembrance of God.’
  • The Earthly Connection: When do we have memories of God? We have them if we walk with God while on this earth. A person who walks with God on earth does not go to the fires of Hades; they go to Paradise. Only those who live without a relationship with God end up in the fires of Hades.
  • State of those in Hades: The reason it says they have no memory of God is that they lived their entire lives without Him. Since they never knew God, they have no memories of Him to carry into the afterlife. However, they do remember their family, their sins, and their past life (just as the rich man remembered his brothers).
  • Sweet Memories of Fellowship: For those who live in fellowship with God, there will certainly be memories of Him after death. They will remember the sweet experiences of walking with God on earth and will also see Him face to face. Therefore, this verse refers to the spiritual state of unbelievers in Hades who have no connection with the Creator.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram