1179.Q: Original Revelations vs. References to Past Saints (KSM 218) 📖

❓ ప్రశ్న: “నా గ్రంథాలలో ఉన్న సమాచారము ఇతర ఏ భాషలో గాని, ఏ దైవజనుడు గాని ఈ తరంలో చెప్పలేదు, ఇవి నాకు దేవుడే నేరుగా అందించాడు” అని మీరు తరచుగా చెబుతుంటారు. కానీ, ఆ గ్రంథాలలోనే ఇతర భక్తులు చెప్పిన రిఫరెన్సులు (References) మరియు వారి పేర్లు కూడా ఉన్నాయి కదా? మరి ఏ భక్తుడూ చెప్పని కొత్త విషయము మీ గ్రంథాలలో ఏముంది? (0:11:34)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 00s)

  • 🛡️ రెండు కోణాల విశ్లేషణ: ఈ ప్రశ్నను రెండు విధాలుగా నేను సమాధానం చెప్తాను. నా స్టాండ్ (Stand) రెండు యాంగిల్స్ లో సమర్ధనీయము. మొదటి యాంగిల్ ఏంటంటే – నా పుస్తకాలలో ఇదివరకు ఏ భక్తుడు చెప్పని క్రొత్త విషయాలు చాలా ఉన్నాయి, అందులో నిస్సందేహం లేదు.
  • 🧱 మహిమ ప్రపంచం – సరికొత్త ప్రత్యక్షత: ఉదాహరణకు ‘మహిమ ప్రపంచం’ (Glory World) గ్రంథంలో – సంఘమును ఒక స్త్రీతో ఎందుకు పోల్చాడు? పరమగీతంలో అంగాంగ వర్ణన ఎందుకు ఉంది? స్త్రీ శరీరంలోని వివిధ భాగాలు సంఘంలోని ఏ వర్గాలకు ప్రతిబింబం? నిత్యత్వంలో వాళ్ళ డ్యూటీస్ (Duties) ఏమిటి? కడపటి హవ్వ కడపటి ఆదామును పెళ్లి చేసుకున్నాక వారు కలిసి ప్రపంచాలను కంటారు అని నేను చెప్పిన ప్రత్యక్షత ఏ బోధకుడూ ఇంతకుముందు చెప్పలేదు. ఇది టోటల్ గా న్యూ రెవల్యూషన్ (New Revelation).
  • ⚖️ యాకోబు దేవుడు – లాజికల్ ఆన్సర్: అలాగే ‘యాకోబు దేవుడు’ అనే చిన్న పుస్తకంలో – పిల్లలు ఇంకా పుట్టకముందే, ఏ క్రియలూ చేయకముందే దేవుడు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించడం వెనుక ఉన్న న్యాయము (Justice) ఏమిటి? అనే లాజికల్ ఆన్సర్ (Logical answer) పౌలు కూడా చెప్పలేదు. దాన్ని నేను వివరించాను.
  • భక్తుల కంటే గొప్పవాడిని కాదు: ఆ భక్తుల కంటే నేను పరిశుద్ధుడిని అని కాదు. భక్త సింగ్ గారి కంటే, పి.ఎం. సామ్యూల్ గారి కంటే, దేవదాస్ అయ్య గారి కంటే నేను గొప్పోడిని కాదు. కానీ ఒక కొండను 10 మైళ్ళ దూరం నుండి చూసిన వాడి కంటే, అర మైలు దూరం నుండి చూసిన వాడికి దృశ్యం స్పష్టంగా కనపడుతుంది. వారు అంత్యకాల సంభవాలకు 10 మైళ్ళ దూరంలో ఉన్నారు, నేను అర మైలు దూరంలో ఉన్నాను. అందుకే దేవుడు నాకు స్పష్టంగా చూపించాడు. నేను వారిని వాడుకొని పేరు చెప్పలేదనడం అబద్ధం, నా ప్రసంగాల్లో ఎప్పుడూ వారి పేర్లు చెబుతూనే ఉంటాను.

Detailed English Translation:

❓ Question: You often claim that the information in your books has never been spoken by any other man of God in any language and was given directly by God. However, your books contain references and names of past saints. What is truly ‘new’ in your writings that no one else has ever shared?

  • Two Perspectives: My stand is justifiable from two angles. First, there are undoubtedly many new revelations in my books that no past saint has ever mentioned.
  • Glory World – A New Revelation: For instance, in ‘The Glory World’—why is the Church compared to a woman? Why is there a detailed anatomical description in the Song of Solomon? Which groups of believers do these body parts represent? What are their eternal duties? My teaching that the ‘Last Eve’ and ‘Last Adam’ will unite to procreate new worlds is a revelation no preacher has shared before.
  • The God of Jacob – Logical Clarity: Even in the small book ‘The God of Jacob’—I provided a logical answer to the justice behind God loving one and hating the other before they were even born or had done anything. Even Paul did not elaborate on this specific logic.
  • Not Greater in Holiness: I am not claiming to be holier than past saints like Bakht Singh, P.M. Samuel, or Devadas Ayya. However, someone looking at a mountain from half a mile away sees it much clearer than someone looking from ten miles away. They were ten miles away from the end-time events, while I am only half a mile away. God has granted me greater clarity due to the proximity of the time. I have never used their information without credit; I always mention their names in my sermons.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram