118. ప్రశ్న : క్షీరసాగర మధనం అంటే దీని యొక్క అర్థం ఏమిటి? దీన్ని కొంచెం విపులీకరించండి.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:     మన భారతీయ పురాణ కథలలో ఒక గాథ, కథ ఉన్నది.  ఏంటంటే సృష్టి ఆరంభంలో దేవదూతలు, రాక్షసులు పుట్టినటువంటి ఈ రాక్షసులు కూడ బ్రహ్మదేవుని సంతానమే. ఆ రోజుల్లో నవ బ్రహ్మాణులు ఉన్నారు. కశ్యపప్రజాపతి ఉన్నాడు. దితియ, అదితి అని ఆయనకు ఇద్దరు భార్యలు.  ‘దితి’ పిల్లలు దైత్యులు. ‘అదితి’కి పుట్టినవాడు ఆదిత్యుడు, శూర్యుడు.  తరువాత కిందున్నటువంటి తరాలు అదంతా పెద్ద కథ అనుకోండి!

            నవ బ్రహ్మలున్నారు.  అసలు బ్రాహ్మదేవుడున్నాడు.  ఈ దేవతలందరు పుట్టిన తర్వాత ఒక ఫైనాలిటీ, ఒక స్పష్టత అనేదింకా రాకముందు, ఎవరి స్థానం ఏంటి? ఎవరి నివాసం ఎక్కడ? అధికారాలు, మహిమలు ఏమిటి? ఈ విషయాలన్నీ నిర్ణయం కాకముందు, అక్కడ ఒక పాల సముద్రమున్నది.  పాల సముద్రమును మజ్జిగ చిలికినట్లుగా చిలకాలి.  చిలికితే దానిలోనుండి కొన్ని విలువైన వస్తువులు బయటికి వస్తాయని వాళ్ళకు చెప్పడం జరిగింది. అప్పుడు దేవతలు అంత పెద్ద పాల సముద్రం చిలకాలంటే చిన్న కవ్వం సరిపోదు. మంధర పర్వతం, తీసుకొచ్చి, దాంట్లో ఎత్తేసి, పర్వతాన్ని అటు- ఇటు కవ్వం లాగా చిలకాలి. దానికి తాడు కావాలి.  దానికొక మహా సర్పాన్ని చుట్టారు. ఆ మహా సర్పం అంటే తలవైపు రాక్షసులను తోక వైపు దేవతలు పట్టుకున్నారు ఈ లాగుతున్న బాధకు విషజ్వాలలు, పడగ విప్పి ఆ మహా సర్పం విషాన్ని వెదజల్లుతా ఉంటే రాక్షసులు ఇబ్బంది పడ్డారు. అక్కడేమో తొక పట్టుకున్న దేవతలు సేఫ్ సైడ్.

            ఇలా ఇదంతా పురాణ కథ ఇది ఇలాగే జరిగిందా? పాల సముద్రం ఎక్కడ ఉన్నది అంటే ఈ వాస్తవ చారిత్రీక కథ అనేది క్రైస్తవుడిగా నేను నమ్మకపోవచ్చు.  అందులో ఏదో ఒక యోగికార్థమున్నది.  దాంట్లో మనము ఏదైనా మంచి నేర్చుకోగలిగింది ఉంటే నేర్చుకుందాం తప్పులేదు! అనే అవగాహన, కాన్స్పెట్ నాది!

            ఇప్పుడు ఆ పాలసముద్రములో నుండి లక్ష్మీదేవి వచ్చింది. ఐరావతం వచ్చింది.  హాలాహలం అనే భయంకరమైన విషం వచ్చింది.  అమృత బాన వచ్చింది. ఆ అమృతం కొరకే వీళ్ళిదంతా చిలకడం. అమృతం కొరకు దాన్ని చిలుకుతా ఉంటే, అమృతమే కాకుండా మిగతా కొన్ని వస్తువులు కూడ వచ్చాయి. మరి ఆ హాలాహలం అనేది వచ్చినప్పుడు దాన్ని వదిలేస్తే అది ముల్లోకాన్నే దహించివేస్తుంది.  అంత భయంకరమైన కాలకుట విషం. దాన్ని పరమశివుడు మింగాడు.  కంఠంలో పెట్టుకున్నాడు.  కంఠం నల్లబడింది నీలకంఠుడు అని అతనికి పేరు వచ్చిందని ఒక కథ ఉంది.

            ఇప్పుడు ఈ ‘క్షీరసాగర మథనం’ అంటే పాలసముద్రమును చిలుకుట! అనేది మనమెందుకు పెట్టుకున్నాం అంటే ఇప్పుడు సముద్రం అంత పాలు అనేవి ఎక్కడైనా ఉన్నయా? అంటే విశ్వంలో ఎక్కడైనా ఉన్నయో లేదో! మనకు తెలియదు.  కాని క్రైస్తవుడిగా మనకంటు నమ్మటానికి ఆధారం లేదు.  గాని బైబిల్ గ్రంథంలోని దేవుని వాక్యమును పాలసముద్రంతో ప్రవక్తలు పోల్చారు.  వాక్యమను పాలవలన మీరు రక్షణ విషయంలో ఎదగాలని 1పేతురు 2లో చెప్పాడు. వాక్యమే పాలు. ఈ వాక్యమే పాలు అయితే కీర్తనలు 119:96 ప్రకారం, నీ ధర్మోపదేశం అపరిమితమైనది అని దావీదు అంటాడు.

            గనుక ధర్మోపదేశం – పాలు

            అపరిమిత ధర్మోపదేశం అంటే సముద్రమంత పాలు.  గనుక దీన్ని మధించినప్పుడు దాంట్లో నుంచి అమృతం వస్తుంది.  అంటే అమృతమంటే సత్యము.  ఆ సత్యము అనే అమృతము మనము తాగితే మనకు నిత్యజీవం కలుగుతుంది.  అనే ఒక సుందరమైన పోలిక.  పాలసముద్రం ఏమో నాకు తెలీదు.  బైబిలే నాకు సంబంధించి పాలసముద్రం. ఇంకా ఏదైనా సనాతన గ్రంధంలో రక్షకుని గూర్చి సాక్ష్యం ఉంటే, వాటిని కూడ కలుపుకుని మధనం చేసి దాన్ని సాగరమధనం లాగా దాంట్లో ఉన్న అమృతాన్ని మనం సేకరించాలి, స్వీకరించాలి.  శాశ్వతజీవాన్ని పొందాలనే భావనతో, అవగాహనతో ఈ కార్యక్రమానికి ఈ పేరు పెట్టుకోవడం జరిగింది.