❓ ప్రశ్న: అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యములు 26:22-23 లో “ప్రవక్తలును మోషేయు ముందుగా చెప్పినవి తప్ప నేను ఏమీ చెప్పలేదు” అని, మళ్ళీ గలతీ 1:11-12 లో “ఈ సువార్త ఏ మనుషుని వలన పొందలేదు, క్రీస్తు బయలుపరచడం వలనే లభించింది” అని అంటాడు. ఈ పరస్పర విరుద్ధంగా అనిపించే మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? మీ పరిచర్యలో కూడా ఇదే జరుగుతోందా? (0:15:34)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 30s)
- 🛡️ పౌలు చెప్పిన రెండు సాక్ష్యాలు: పౌలు చెప్పిన రెండు సాక్ష్యాలు కూడా రైటే. ఒక కాంటెక్స్ట్ (Context) లో ఆయన “ప్రవక్తలు చెప్పినవి తప్ప నేను ఏమీ చెప్పలేదు” అన్నాడు. అంటే – క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేస్తాడు, ఆయన వల్ల విమోచనం కలుగుతుంది అనే సంగతులు పాత నిబంధన లేఖనాల్లో ఉన్నవే. అవి లక్షల మందికి అందుబాటులో ఉన్నాయి, శాస్త్రులు, పరిసయ్యులు కూడా అవే చదువుతున్నారు.
- 🧱 మిస్ అయిన పాయింట్: లేఖనాలు అందరికీ అందుబాటులో ఉన్నా – “మనం సిలువ వేసి చంపిన నజరేయుడైన యేసును గూర్చినవే ఈ ప్రవచనాలు” అనే పాయింట్ అందరూ మిస్ అయిపోయారు. ఇవి మన కళ్ళ ముందు నెరవేరాయి అనే సంగతిని వారు గుర్తించలేకపోయారు. అది కేవలం పౌలుకే దేవుడు బయలుపరిచాడు.
- ⚖️ అరేబియాలో ప్రత్యక్షత: ప్రభువు కనపడ్డ తర్వాత పౌలు అరేబియా దేశంలోని సీనాయి కొండకు వెళ్ళాడు (గలతీ 1:17). మోషేకు ఏ కొండ మీదైతే ప్రత్యక్షత కలిగిందో, అక్కడికే వెళ్లి మోకరిస్తే.. ఏ క్రీస్తునైతే తాను ద్వేషిస్తూ వచ్చాడో, ఆయనే ధర్మశాస్త్రం నిండా ఉన్న మెస్సియా అనే సంగతి పౌలుకు ఒక ప్రత్యక్షత (Vertical Revelation) గా కలిగింది. అందుకే ఆయన “మనుషుల నుండి పొందలేదు, క్రీస్తు బయలుపరిచాడు” అని చెప్పగలిగాడు.
- ✨ నా విషయంలో కూడా ఇదే: ప్రవక్తలు చెప్పినవి కాకుండా నేను కొత్తగా ఏమీ చెప్పడం లేదు. కానీ ఒక కొత్త కోణంలో చెప్పాను, దాని ఫైనల్ ఎఫెక్ట్ (Final effect) మరియు కంక్లూజన్ (Conclusion) కొత్తగా ఇచ్చాను. లేఖనాలు అందరి దగ్గర ఉన్నాయి, కానీ వాటికి దేవుడు ఇచ్చిన నిశ్చయమైన ముగింపు నేను నేరుగా పైనుండి పొందుకున్నాను. ఆ వర్టికల్ రెవల్యూషన్ నాకే కలిగింది. పౌలుకు కలిగింది కూడా అదే.
Detailed English Translation:
❓ Question: Apostle Paul says in Acts 26:22-23 that he said nothing except what the prophets and Moses foretold. Yet, in Galatians 1:11-12, he claims his Gospel was not received from man but by direct revelation from Christ. How can we reconcile these two statements? Is the same happening in your ministry?
- Two Valid Testimonies: Both of Paul’s statements are correct. In one context, he says he is only repeating what the prophets said—that Christ would suffer and rise from the dead. These scriptures were available to millions, including the Scribes and Pharisees.
- The Missing Link: Although the scriptures were there, everyone missed the vital point: “These prophecies refer to Jesus of Nazareth, whom we crucified.” They failed to see the fulfillment in their own time. This was revealed specifically to Paul.
- Revelation in Arabia: After the Damascus encounter, Paul went to Mount Sinai in Arabia (Galatians 1:17). On the same mountain where Moses received the law, Paul knelt and received a vertical revelation that the very Christ he was persecuting was the Messiah throughout the law. This is why he could say it was revealed directly by Christ.
- The Same Applies to Me: I am not saying anything outside of what the prophets have said. However, I have presented it from a new angle, with a final effect and conclusion that is entirely new. Everyone has the same scriptures, but I received the absolute clarity and definitive landing point directly from above. That vertical revelation belongs to me, just as it did to Paul.
