1187.Q: Collapse of America and Ezekiel 38 (KSM 217) 🌍

❓ ప్రశ్న: అమెరికా కోలుకోలేని ఆర్థిక సంక్షోభం మరియు ప్రకృతి విలయాల ద్వారా బలహీనపడి నాశనం అవుతుందని మీరు 40 ఏళ్ల క్రితమే చెప్పారు. నేడు జరుగుతున్న అగ్నిప్రమాదాలు, విలయాలను చూస్తుంటే అది నెరవేరుతున్నట్లు అనిపిస్తోంది. దీనికి సంబంధించి బైబిల్ లో ఉన్న ఎహెజ్కేలు 38వ అధ్యాయం ఆధారాలను వివరించండి? (0:12:34)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (10m 10s)

  • 🛡️ 40 ఏళ్ల నాటి ప్రవచనం: అమెరికాకు కోలుకోలేనంత ఆర్థిక సంక్షోభం (Financial crisis) వస్తుంది, ఆ తర్వాత అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి అని నేను ‘యుగాంతం’ బుక్ లో 40 ఏళ్ల కిందటే రాశాను. వీటన్నిటి ద్వారా అమెరికా నిర్వీర్యం అయిపోయిన సమయంలో రష్యా ఇజ్రాయెల్ మీదకు దండెత్తి వస్తుంది. అప్పుడు అమెరికా కేవలం ఖండించగలదు తప్ప సైనిక పరంగా సహాయం చేయలేదు.
  • 🧱 వాక్యాధారం – తర్శీషు కొదమ సింహములు: ఎహెజ్కేలు 38:13 లో “శబా వారును దదాను వారును తర్శీషు వర్తకులును కొదమ సింహముల వంటి వారైన దాని వారందరును నిన్ను చూచి.. దోచుకొనుటకు వచ్చితివా అని అడుగుదురు” అని ఉంది. ఇక్కడ తర్శీషు అంటే ‘గ్రేట్ బ్రిటన్’ అని నా వివరణ. వారి అధికార ఛత్రం నుండి పుట్టిన ‘యంగ్ లయన్స్’ (Young Lions) లేదా కొదమ సింహాలలో అమెరికా ప్రధానమైనది. రష్యా దండెత్తినప్పుడు అమెరికా, బ్రిటన్, ఇండియా వంటి దేశాలు కేవలం “దోచుకోవడానికి వచ్చారా?” అని అడుగుతారే తప్ప ఎదురు నిలబడరు.
  • ⚖️ అగ్రరాజ్యాల పతనం: ఒక చిన్న దేశం ప్రపంచ నియంతగా (అబద్ధ క్రీస్తు) మారాలంటే, ప్రస్తుతం ఉన్న అగ్రరాజ్యాలు నాశనం కావాలి. రష్యా పతనం వైపు వెళ్తుంది, అమెరికా కూడా ఉండి లేనట్టు అయిపోతుంది. ఇండియా కూడా రానున్న దినాల్లో బలహీనమైపోతుంది. చైనాలో కూడా కొత్త వైరస్లు, తెగుళ్లు, వరదలు వస్తున్నాయి. అగ్రరాజ్యాలన్నీ ప్రకృతి విలయాలతో కృంగిపోతాయి.
  • ఇజ్రాయెల్ యొక్క ఉన్నత స్థితి: అన్ని రాజ్యాలు బలహీనపడినప్పుడు – రాజ్యములకు శిరస్సుగా (The Head of all Nations) ఇజ్రాయెల్ ఒక్కటే నిలుస్తుంది. ఇర్మియా 31:7 లో “రాజ్యములకు శిరస్సగు జనము” అని ఇజ్రాయెల్ గురించి వ్రాయబడింది. వారు ఎంత నిర్భయంగా ఉంటారంటే, అసలు రక్షణ కోసం తలుపులు కూడా వేసుకోరు. అప్పుడే శత్రు దేశాలన్నీ కలిసి దండెత్తి వస్తాయి, కానీ దేవుడే దిగి వచ్చి యుద్ధం చేస్తాడు.

Detailed English Translation:

❓ Question: Forty years ago, you predicted that America would collapse due to financial crises and natural disasters. Looking at current events, how do you explain this using Ezekiel 38? What is the scriptural basis for America’s inability to help Israel?

  • A 40-Year Prophecy: I wrote in ‘The End of the Present Age’ that America would suffer an irreversible financial crisis followed by fire, floods, and earthquakes. Weakened by these calamities, America will be unable to assist Israel militarily when Russia invades; they will only be able to protest verbally.
  • Tarshish and the Young Lions: Ezekiel 38:13 mentions the “merchants of Tarshish and all her young lions.” In my interpretation, Tarshish refers to Great Britain, and its ‘Young Lions’ are countries that emerged from its empire, primarily the USA. When Russia and its allies invade Israel, these nations will only question the invaders’ motives without physically intervening.
  • Fall of Superpowers: For a global dictator (the Antichrist) to rise from a small nation, existing superpowers must fall. Russia will be destroyed in the Gog-Magog war, and America will already be crippled by internal disasters. Even India and China will face severe weaknesses due to natural calamities and diseases.
  • The Rise of Israel: Amidst global collapse, Israel will emerge as “The Head of all Nations” (Jeremiah 31:7). They will live in such security and confidence (Ezekiel 38:11) that they won’t even have walls or gates. This perceived vulnerability will invite the Russian-led invasion, where God Himself will intervene.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram