22. ప్రశ్న : నాకు పెళ్లి అయ్యింది గాని మాకు పిల్లలు లేరు. నాకేమో పిల్లలు కావాలి ఇప్పుడు నేనేం చెయ్యాలి.

-అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు
జవాబు:

మొట్టమొదటి విషయం పిల్లలు పుట్టలేదంటే లోపం మీలోనైనా ఉండొచ్చు లేదా ఆమెలోనైనా ఉండొచ్చు. ఆమె ఎప్పటికీ తల్లి కాలేదు అని Medical గా doctors declare చేస్తే, అతడు విశ్వాసవీరుడైతే అబ్రాహాము లాగా ఎన్ని సంవత్సరాలైనా wait చేసి నా భార్యతోనే కంటాను అనేది ఒక దారి. లేదు నేను అంతటి విశ్వాస వీరున్ని కాదు అనుకుంటే, ఆ భార్య ఒప్పుకుంటే ఆమెకు divorce ఇచ్చిన తరువాత legal గా పెళ్లిచేసుకోవచ్చు. అంతేగాని ఆమెను ఉంచుకొని ఇంకొకరిని చేసుకోవడం తప్పు అవుతుంది. At any given time man should have only one wife. నేను ఇచ్చే అన్నిటికంటే Ultimate advice ఏమిటంటే, ఈ లోకంలో తల్లి తండ్రి లేని అనాధ పిల్లలు కోట్ల మంది ఉన్నారు. కొంత మంది కని పారేసి వెళ్లిపోయినవారు, లేకపోతే బిడ్డ పుట్టగానే తల్లి చనిపోవడం లాంటి unfortunate cases ప్రపంచంలో కోట్లు ఉన్నాయి. మనమేదో కనాలి, ఉద్ధరించాలి అని కాకుండా, మనకు పిల్లలు పుట్టే అవకాశం లేనప్పుడు, తల్లిదండ్రి లేని ఒక అమాయకపు ప్రాణికి మనం ఆ place fill చేస్తే దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు. మనకూ తృప్తి ఉంటుంది. ఆ concept లోకి వస్తే మంచిది.