120. ప్రశ్న :న్యాయాధిపతులు 11:28 వచనములో అతని మీదికి యెహోవా ఆత్మ వచ్చినట్టుగా ఉంది. అయితే ఆయన చేసినటువంటి బలి అర్చన కూడ ఆత్మను బట్టె చేయాల్సి వచ్చిందా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు: ఒక్క ముఖ్యమైన పాయింట్ మీరు మిస్ అవుతున్నారు. మీరు, సకల జనులు కూడ తెలుసుకోవలసిన, గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే, ఆత్మతో ఒకసారి అభిషేకించబడినవాడు, ఆ ఆత్మయొక్క ప్రభావములోనే మిగిలిన జీవితమంతా ఉంటాడనే గ్యారంటీలేదు. ఒకసారి పరిశుద్ధాత్మను పొందినవాడు, ఆత్మ వశుడైన వాడు ఆత్మ అభిషిక్తుడైనవాడు, ఆ తరువాత నుండి వేసే ప్రతి అడుగు కూడ పరిశుద్ధాత్మ స్వాధీనములోనే వేస్తాడు అనే గ్యారెంటీ లేదు. అలా వెయ్యడు అనే గ్యారెంటీ ఉంది. అలా వెయ్యాల్సిన అవసరం లేదు. దావీదు పరిశుద్ధాత్మ అభిషిక్తుడే.  దేవుడి ఆత్మచేత బలపరచబడి గొలియాతును చంపాడు.  సింహాన్ని చంపాడు. ఎలుగుబంటిని చీల్చాడు. ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేసాడు.

            ఆయన బత్సెబ దగ్గరకు వెళ్ళింది, ఆత్మవశుడై వెళ్ళలేదు కదా? గనుక పరిశుద్ధాత్మ వశుడైనాడు కూడ కొన్ని పొరపాట్లు చేస్తాడు.  పరిశుద్దాత్మ దేవుడు రావడం అనేది పూనకం పట్టినట్టు ఉండదు. ఏదో దురాత్మల ఆధీనంలోకి వెళ్ళిపోయినట్టు ఉండదు. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్య్రము ఉండును అన్నాడు పాలు.  కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన స్వాతంత్ర్యాన్ని భంగపరచి, ఒక నియంతలాగ మనల్ని వశపరచుకొని, అన్ని పనులు మన ఇష్టాలతో సంబంధం లేకుండా, ఆయనే ఖచ్చితంగా తన ఇష్టప్రకారం చేయించడం అనేదుండదు.  పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడటం అనేది అనుక్షణం మనం ఇష్టపూర్వకంగా లోబడాలి.  ప్రతిరోజు ఒక నిబంధన చేసుకోవాలి.  ప్రతిరోజు పరిశుద్ధాత్మకు మనం అప్పగించుకోవాలి.

            ఈ రోజు నన్ను వాడుకో.  ఈ గంట నన్ను వాడుకో.  నన్ను నడిపించు. అని మన స్వచిత్తమునకు ఏమాత్రం చోటియ్యకుండా, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా గంటకోకసారి మనం నిబంధన చేసికొని ఉంటే మన అడుగులన్నీ గూడ, ఆత్మస్వాధీనంలో అడుగులు వేయగల్గుతాం.  ఒకప్పుడు ఆత్మచేత నింపబడిన య

యెఫ్తా ఆ తరువాత పరిశుద్దాత్మ దేవుని కంట్రోల్లోనుండి తప్పిపోయాడు. అది అక్కడ నేర్చుకోల్సిన పాఠం. అలాగే సౌలుగూడ పరిశుద్దాత్మ అభిషిక్తుడే.  ముందు సమూయేలు తైలం పోసినప్పుడు, సౌలురాజు కూడ పరిశు ద్ధాత్మ అభిషిక్తుడే.  తరువాత ఆత్మ ప్రభావం కాకుండ దురాత్మ ప్రభావంలో పనులు చేసాడు. గనుక యెఫ్తా కూడా ఎక్సెంషన్(Exemption) ఏమీ కాదు.

 మన అందరికీ హెచ్చరిక! ఇవాళ్ళ మనం పరిశుద్ధాత్మ వశులమై ఉండొచ్చు. అయితే మనం జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో మనం ఆత్మవశమునుండి బయటికి వచ్చేసేయవచ్చు.  మన సొంత కార్యాలు చెయ్యొచ్చు. ఎన్నో పొరపాట్లు చేసే అవకాశం ఉన్నది.  గనుక జాగ్రత్తపడి, ఎప్పటికప్పుడు మనం పరిశు ద్ధాత్మకు అప్పగించుకుంటూ, ఆయన పరిపాలనలోకి మనం మళ్ళీ-మళ్ళీ వస్తూ ఉండాలి.