(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: బైబిల్ గ్రంథం దేవుని ఆత్మ ద్వారా రాయబడిన గ్రంథం అంటున్నారు కదా? దానిని గూడ వడపోయకుండా అక్షరం అక్షరం, ఉన్నది ఉన్నట్లు క్రైస్తవులు నమ్ముతున్నారా? అని నేనొక పెద్ద సవాలు విసురుతున్న. అలా నమ్ముతుంటే, యోబు, ‘దేవుడు నాకు అన్యాయము చేసెను అన్నాడు. దీన్ని అక్షరాల నమ్ముతారా? దేవా నీవెంతవరకు మేలుకొనకుండా ఉంటావు? ఎంత వరకు నిద్రపోతావు? అని దావీదురాజు ప్రార్ధన చేసాడు. దేవుడు నిద్రపోతాడు అనేది అక్షరాల నమ్ముతారా? దేవుని వెర్రితనం మనుష్యుల జ్ఞానం కంటే జ్ఞానము కలది. అంటే దేవునికి కూడ కాస్తంత వెర్రి ఉన్నదని నమ్ముతారా? మరి బైబిల్ అంతా దేవుని వాక్యం అని, దాంట్లో కొన్ని వచనాలు ఎలా పక్కన పెడతారు? యదార్థత లేదు అందుకే నేనేం చెబుతున్నానంటే, బైబిల్ పట్ల మనము ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి? మనం ఎలా బైబిల్ని అవగాహన చేసుకోవాలి. అనే విషయంలో దానికి హెర్మెన్యుటిక్స్ అనే ఒక శాస్త్రం ఉన్నది. అంటే వ్యాఖ్యాన శాస్త్రము. బైబిల్ను వ్యాఖ్యానించే వ్యాఖ్యాన పద్ధతులు. ఆ శాస్త్రం ఆ వ్యాఖాన శాస్త్రం ప్రకారం బైబిల్ లోని ప్రతి అక్షరం దేవుడే డిక్టేట్ చేసి రాయించాడు. అయినప్పటికి, అక్కడున్న అక్షరాన్నే, అక్షరం పట్టుకుంటే చచ్చిపోతాం. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపజేయును.
కొన్నిసార్లు, లూకా వంశావళివేరుగా, మత్తయి వంశావలి వేరుగా ఉన్నది. కొన్నిచోట్ల కాపీస్ట్ మిస్టేక్స్ యెష్షయికి ఎంతమంది పిల్లలో, సరిగ్గా ఏడుగురా? ఎనిమిది మందా? అనే లెక్క తేలలేదు. ఇలాంటి కొన్ని (Dispenses) బైబిల్ లో ఉన్నప్పుడు మనం ఏం అనుకుంటున్నాము? అక్కడ హ్యుమన్ కంటెట్, కాపీస్ట్ మిస్టెక్స్ అంటారు. చూసి రాతగాళ్ళు శాస్త్రులు, వాళ్ళు ఏదో ఒక పొరపాటు రాసి ఉంటారు. ఒరిజినల్గా అలా ఉండదు. ఎందుకంటే రెస్టే ఆఫ్ ది స్క్రిప్చర్స్, లేఖనాల్లో మిగతా లేఖనాలు దీన్ని ఒప్పుకోవట్లేదు గనుక అది రాతగాడెవడో చేసిన పొరపాటు అని అనుకోవాలి, వదిలేయాలి అని అంటున్నాం.
ఇప్పుడు బైబిల్ని దేవుడు వ్రాయిస్తున్నప్పుడు మనుష్యులయొక్క కొన్ని పొరపాట్లు ఎలాగు జొరబడ్డయో అలాగే మనుష్యులు రాస్తున్నటువంటి గ్రంథాలలో దేవుడెందుకు జొరపడి అక్కడక్కడ తాను జోక్యం చేసుకోకూడదు? అక్కడ అభ్యంతరం ఏంటి? అంటే ముందు వీళ్ళు విశాలహృదయలు కారు! యదార్థవంతులు కాదు. అందుకొరకే తనయెడల యదార్థ హృదయము గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి సంచారం చేస్తుంది. ఈ ఆధ్యాత్మిక విషయంలో నిజాయితీ ఉండాలి.
ఇతర గ్రంథాలను మానవులే రాసారు అనుకుందాం. ఆ టైంకి ఇంకా మోషే భక్తుడే పుట్టలేదు ఋగ్వేదం రాసినప్పుడు. ఇంకా 500 ఏండ్లవరకు మోషే భక్తుడు పుట్టాడు. మరి వాళ్ళు కూడ దేవుణ్ణి వెదుకుతున్నారు. గనుక వెదికేవాళ్ళకు నేను ప్రత్యక్షమవుతాను అని ఆయన అన్నాడు. కనుక దేవుడు ఎవరు అని తపించి వెదికినప్పుడు, దేవుడు వాళ్ళకు జ్ఞానం మనసులో పెట్టి ఉండొచ్చు. ఎన్నోసార్లు చెప్పాను. బైబిల్ లోని ప్రతి అక్షరము దేవుని వాక్యం అని నేను నమ్ముతున్నాను. Bible is the word of God, other book have some content, some portion of the word of God. ఇతర గ్రంథములో అక్కడక్కడ దేవుని మాటలు దొర్లుతాయి. నేను పట్టుకున్న దేవుని గ్రంథంలో ప్రతి అక్షరము దేవుని వాక్యమే అని ఎన్నోసార్లు ప్రకటించాను.
వేరేవాటికి, బైబిల్ కి ఉన్న స్టేటస్ నేనివ్వలేదు. నా ఐడియాలజీలో నేను ఇవ్వడం ఏంటి? నువ్వు ఎవడు ఇవ్వటం అని నా మీద తిరగబడొచ్చు ఎవ్వరైనా, నన్ను తృణీకరించొచ్చు. కాని నా ఐడియాలజీలో, నా ప్రపంచంలో, నా మనో ప్రపంచంలో బైబిల్ కి ఉన్న స్టేటస్ ఏ పుస్తకానికి లేదు. నేనెప్పుడు అనలేదు గూడా? బైబిల్ అన్నిటితోసమానం అని చెప్పలేదు. మరి వాటిని తీసుకోవలసిన అవసరం ఎందుకొచ్చింది అన్నారు! అది ఇంకొక ప్రశ్న ఎందుకు అవసరం వచ్చిందంటే ఈ బైబిల్లోనే ఉన్న వచనాలు ఎత్తి చెబితే, ఇది నాకక్కరలేదు అనే వర్గం ఒకటి మానవ సమాజంలో ఉన్నది. నీ బైబిల్ లో ఏమి రాసుందో నాకెందుకు చెబుతున్నావ్? నీ సోది నాకెందుకు? నాకవసరం లేదు ఎవడికి కావాలి? నీ బైబిల్లో లో ఏమైనా రాసిండొచ్చు We don’t care, we don’t bother about that. Don’t tell me, what your bible says. I hate your bible అంటున్నాడు. అతనికి యేసును ఎలా చూపించాలి? సరే బాబు, బైబిల్ అంటే నీకిష్టము లేకపోవచ్చు. నీవు ఏ గ్రంథమునైతే గౌరవంగా చూస్తున్నావో, ఆరాధన భావం ఏ గ్రంథం మీద నీకున్నదో, నీకు పూజ్యభావం కలిగిన ఆ గ్రంథంలో ఈ విషయం వ్రాయబడి ఉంది కదా? దాన్ని ఆలోచించు. అని ఆ రకంగా యేసును వాళ్ళ కళ్ళ ముందుకు తెస్తున్నాం. మనకెందుకవసరమైందంటే?
బైబిలే చెప్పాలంటే క్రైస్తవులు వింటారండి! క్రీస్తును ద్వేషించేవారు బైబిల్ లోని మాటలు ఎలా వింటారు? వినరు గదా? వాళ్ళకు యేసును చూపించడం మన భాధ్యత, ఏదో రకంగా చూపిస్తాం. యేసును చూపించిన తర్వాత వాళ్ళను ఆకర్షించుకుని రక్షించుకోవడం, పరిశుద్ధాత్మ దేవుని కార్యం. మన బాధ్యత తీరిపోయింది. యేసును వారిముందు ప్రెజెంట్ చేయడం వరకే మన బాధ్యత. ఆ తర్వాత దేవుని బాధ్యత మొదలవుతుంది.
అవును! యేసును వారికి చూపిస్తూ ఉంటే, క్రైస్తవులెందుకు బాధపడతున్నారనేది అగోచరమైన విషయం. ఇప్పుడు నేను వేరే గ్రంథాలను ఎత్తుకుని యేసును వేరే గంథ్రాల్లో చెబుతున్నాననే ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను. దానికి ఆ ప్రశ్నకు సమాధానం ఉన్నది. కాని ఏదో ఒక రూపాన యేసయ్యను వారికి చూపిస్తున్నప్పుడు యేసు భక్తులు ఎందుకు కుల్లుకుంటున్నారనేది జవాబు లేని ప్రశ్న!
వీళ్ళు క్రైస్తవులా? క్రీస్తు విరోధులా? గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళలాగ వీళ్ళందరు అసలు క్రైస్తవులు కాదని నేను చెబుతున్నాను. వీళ్ళంతా నిజంగా క్రీస్తును ప్రేమించి ఉంటే క్రీస్తును నేను వాళ్ళకు చూపిస్తున్నందుకు వాళ్ళు సంతోషించాలి!