❓ ప్రశ్న: పాపం చేయకుండా ఉండటానికి అపోస్తలుల బోధ ఏ విధంగా సహాయపడుతుంది? సాధన (Practice) సులువుగా ఉండటానికి మార్గం ఏంటి? (0:26:54)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (08m 30s)
- 🛡️ పాపం చేయజాలడు: సహవాసంలో ఉండి, రొట్టె విరవడంలో, అపోస్తలుల బోధలో మరియు ప్రార్థనలో నిమగ్నమై ఉన్నవాడు.. పాపం చేయడానికి వానికి టైమ్ (Time) ఎక్కడ ఉంటుంది? వాడు పాపం చేయడు, చేయజాలడు అని యోహాను వాక్యం చెబుతోంది.
- 🧱 సాతాను వ్యూహం: మనం పాపంలో పడాలీ అంటే సాతాను ముందుగా ఈ నాలుగింటికి మనల్ని దూరం చేస్తాడు. ప్రార్థన ఆపేస్తాం, చర్చికి వెళ్ళడం మానేస్తాం. అప్పుడు మనకు తెలియకుండానే మనం బలహీనపడతాం. సంసోను లాగా నాలో బలం ఉందని అనుకుంటాం కానీ, వాడు చిన్నగా తోయగానే పాపంలో పడిపోతాం.
- ⚖️ తేలికైన కాడి: దైవ భక్తి విషయంలో సాధన (Practice) అంటే హిమాలయ పర్వతం ఎక్కడం కాదు. యేసు ప్రభువు అంటారు – “నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నది”. ఇది ఆనందకరమైన సాధన. శ్రమ అంతా ఆయనే పడ్డారు, మనం చేయాల్సింది కేవలం ఆయన యొద్ద నేర్చుకోవడమే.
- ✨ నిర్లక్ష్యం వద్దు: ఈ చిన్న పనులు చేయలేకపోవడాన్ని సోమరితనం లేదా నిర్లక్ష్యం అంటారు. ఈ నాలుగు పనులు క్రమంగా చేసేవారు అద్భుతంగా ఎదుగుతారు. పాపం మీద జయం పొందడం వారికి చాలా సులభం అవుతుంది.
Detailed English Translation:
❓ Question: How does Apostolic teaching help in avoiding sin? How can we make spiritual practice easy?
- Occupied with God: A person busy with fellowship, communion, doctrine, and prayer has no time for sin. As John wrote, such a person cannot continue in sin.
- Satan’s Strategy: To make us fall, Satan first distances us from these four pillars. We lose our strength without realizing it. Like Samson, we assume we are fine until a small push lands us in sin.
- An Easy Yoke: Spiritual discipline is not a burden. Jesus said His yoke is easy. He bore the heavy cross so our path to holiness could be joyful and light.
- Avoiding Negligence: Failure to do these simple things is just laziness. Those who are diligent in these practices find it easy to overcome temptation and grow rapidly.
