(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ప్రసంగాలు తయారుచేయడం అనే కాన్సెప్టే నాకసలు లేదు. After coming to the full time ministry. I never prepared a message. ఎందుకంటే ఒక్కటే ఒక ప్రసంగం నేను సిద్ధపరచుకుని చేసాను. అప్పుడు నేను ఫుల్‌టైం. ప్రీచర్ కాదు. నేను హైదరాబాద్ బాప్టిస్టు చర్చ్ యూత్ కాన్ఫెరెన్స్‌లో, యూత్ రిట్రీట్‌లో ఒక మెస్సెజ్ ఇవ్వమని అడిగారు. అందరు కూడ ఆ కండక్ట్ చేసినవారి లోపల పోటీ అన్నమాట. మీకు తోచిన ప్రసంగం చేయండి. ఎవరు మంచిగా ప్రసంగం చేస్తే వాళ్ళకు ప్రైజ్ ఇస్తాం. అందులో నేను పాల్గొన్నాను. అందులో నేను చెప్పిన ప్రసంగం రాసుకుని, మూలవాక్యం, క్రాస్ రెఫరెన్సెసస్, కంక్లూషన్!
అప్పుడు ద్వితియోపదేశకాండములోనుండి పొలములో ఒకడు ఒక చిన్న దాన్ని కలుసుకొని ఆమెను అత్యాచారం చేసినప్పుడు. ఆమెను ఏం అనకూడదు. అత్యాచారం చేసినోడినే రాళ్ళతో సావగొట్టాలి. ఊర్లో చేసిన అత్యాచారం అయితే ఇద్దర్ని చావగొట్టాలి. ఎందుకంటే ఆమె సైలెంట్‌గా ఉన్నది. కేకలు వేస్తే ఎవరన్న వచ్చి రక్షించేవారు గనుక ఆమె కూడ కో-ఆపరేట్ చేసింది. అందుకే ఇద్దర్ని కొట్టాలి.
పొలంలో అయితే నేమో అరిసినా కేకలు వేసినా రక్షించువాడు ఎవడూ లేకపోవును. గనుక ఆమె దోషి కాదు, విక్టిమ్. So, dont punish her. Punish only the rapist అని. నాకు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రసంగం చేసా! నాకు తెలిసి నేను ప్రిపేర్ చేసుకున్న ప్రసంగం అదొక్కటే! ఆ తరువాత నేనెప్పుడు కూడ ప్రిపేరు చేసుకోలేదు. ఎందుకంటే నా గురువులు, ఆధ్యాత్మిక విద్య నేర్పినట్వంటి మహానుభావులు చాలా మంది నాకు చెప్పారు. నాయానా, నీవు సిద్ధపడకుండా, పులిపీఠంమీదికి వెళ్ళద్దు. ముందుగా నువ్వు ఏం చెప్తావో దేవుడ్ని అడిగి, ఆయన వాక్కు పొంది, సిద్ధపాటు చేసుకుని వెళ్ళాలి. లేకపోతే టైం వేస్ట్ అయిపోతుంది. మానవ జ్ఞానం ప్రవేశిస్తుంది. తప్పకుండా రాసుకుని వెళ్ళాలని చెప్పారు.
ఆ విధంగా పి.యల్ పరంజ్యోతిగారు, పి. యల్ సముయేల్ గారు, భక్తసింగ్ అయ్యగారు అందరూ కూడ ప్రిపేర్ చేసుకున్నవాళ్ళే అని ఆ పెద్దలే చెప్పారు. కనుక నేను ప్రసంగ పరిచర్య మొదలుపెట్టిన తర్వాత మొదటిసారి నేను వాక్యం చెప్పటానికి వెళ్ళెటప్పుడు, దేవుడిని అడిగాను, ప్రభువా, నాకు ఏదో ఒక వాక్కు, ఒక మెస్సేజ్ బయలుపరచు. లేకపోతే ఖాళీకుండగా, ఏమీ సిద్ధపాటు లేకుండ నేను ప్రసంగ వేదిక ఎక్కలేను, నేను సిద్ధపాటు లేకుండా వెళ్తే నాకు అవమానం, నీకు అవమానం, అక్కడేం చెప్పాలో తెలియదు. So, prepare me now here in the prayer room. ఇక్కడ నుంచి నేను నింపబడిన వ్యక్తిగా వెళ్ళాలి అని నాకు పెద్దలు చెప్పిన పద్ధతిలో ప్రార్థన చేసాను.
దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీవు, పలానా తప్పు నీలో ఇంకా ఉంది, ఒప్పకోవాలి, క్షమాపణ కోరాలి, పశ్చాత్తాపపడాలి, కడుక్కోవాలి, శుద్ధి చేస్కోవాలి. తర్వాత ఈ పనులు నాకొరకు చెయ్యాలని ఏంటేంటో ఆయన మాట్లాడుతున్నాడు తప్ప, ఇప్పుడు చెప్పే ప్రసంగం బయలుపరచడం లేదు. నాతో మాట్లాడు తండ్రి లేకపోతే నా ప్రాణం ఇక్కడే తీస్కో, ప్రసంగం చేసే టైం అయింది. నువ్వు నాతో మాట్లాడటం లేదు. ప్రసంగం నాకు బయలుపరచడం లేదు. అని తెల్లకాగితం, పెన్ను పట్టుకుని, బైబిల్ తెరచి మోకరించి ప్రార్ధన చేస్తున్న, ప్రసంగం ఏంటి అని అడిగితే మాత్రం, నా మైండ్ బ్లాంక్ గా ఉంది. ఆకాశము ఇత్తడిలా అయిందంటారే! అలా అయ్యింది నా పరిస్థితి. మిగతా ఇష్యూస్ అన్ని మాట్లాడుతున్నాడు.
కనుక ఇవాళ నా పరువు పొయ్యేటట్లు ఉంది. ప్రభువా, ఇలా పరువు పొయ్యే పరిస్థితి అయితే నేను వేదిక ఎక్కనే ఎక్కను నన్ను చంపేసేయు అని అడిగా. అప్పుడు దేవుని స్వరం నేను విన్నా. ఏంటంటే, ఇక్కడే ఎందుకు నీకు నేను బయలుపరచాలి? వేదికమీదికి నేను నీతోపాటు రావొద్దా? నన్ను ఇక్కడ వదిలేసి నువ్వొక్కడివే వెళ్తావా? అంటే అలా కాదు ప్రభువా, నువ్వు నాతో రావాలి. నేనొక్కడినే వెళ్ళలేను అంటే వస్తాను కదా మరి అక్కడే చెప్తాను. ఇక్కడెందుకు చెప్పమంటున్నావు? నన్ను ఇక్కడ వదిలేసి వెళ్తానంటే చెప్పు. ఏదో ఒకటి నీ నోట్లో పెట్టి, నీకేదొ ఒక సిద్ధపాటు ఇచ్చి నిన్ను పంపిస్తాను. నీవు అక్కడికి వెళ్ళి అప్పగించుకో! నేను కూడ నీతో వద్దాం అనుకుంటున్నాను. ఆ టైంలో చెప్తాను. ఇప్పుడెందుకు? అప్పటినుండి ఇప్పటిదాక 40 సంవత్సరాలు ప్రసంగ పరిచర్యలో, నేను పెద్ద మాదిరి అని కాదు, అందరూ నాలాగ ఉండమని కాదు!
ఇప్పటికి పెద్దపెద్ద బోధకులు చార్లెస్ స్పర్జన్ గారు, ఆస్వాల్డ్.జె.స్మిత్గారు, బిల్లీగ్రహంగారు అందరు కూడ ప్రసంగం ప్రిపేర్ చేసుకునేవాళ్ళే! మరి ఎందుకొరకో దేవుడు నన్ను ఇలా నడిపించాడు. నేను ప్రసంగ వేదిక ఎక్కి పట్టుకునే దాక మైండ్ బ్లాంకే! అక్కడకెళ్ళి ముందు మోకరిస్తాను. ప్రభువా, ఇదిగో నువ్వు రమ్మంటే వచ్చాను. నా నొట్లో ఏదైనా ఒక మాట పెట్టు అని! లాస్టు మూమెంట్ దాకా నామైండ్ మోత్తం బ్లాంక్! లాస్ట్ సెకెండ్లో, ఇక నేను నోరు విప్పుతాననగా, ఒక మాట ఏదో, ఒక ఫ్లాష్ పరలోకం నుండి రావడం. నోట్లో ఒక మాట రావడం. దాంట్లో నుంచి చకచకచక మైక్రో సెకెండ్స్‌లో నా మైండ్‌లోనే ఒక ప్రసంగం, ఒక Structure ఏర్పడటం! ఇదన్న మాట కంక్లూషన్ అనుకోవడం మరి మధ్యలో ఏ రూట్లో వెళ్తానో, నాకే తెలీదు. ప్రసంగం మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ, దానికి సంబందించిన, వచనాలు, ఇష్యూస్ దేవుడు జ్ఞాపకం చేసి, ఏమీ సిద్ధపాటు లేకుండా మూడు, నాలుగు గంటలు, రెండు గంటలైతే చాలా సామాన్యమైన విషయమే నాకు! అలాగ దేవుడు 40 సంవత్సారాలు నడిపించాడు. 40 సంవత్సరాలలో నేను వాక్యం చెప్పని రోజు ఒక్కటి కూడ లేదు. ప్రతి రోజు రెండు, మూడు, నాలుగు చేసిన ప్రసంగాలున్నాయి. ఒక్కొక్క ప్రసంగం రెండుగంటలనుండి నాలుగు గంటల వరకు అలాగ ఐదు గంటల వరకు అలాగ వెళ్తుంది.
ఎన్ని వేల గంటలు, ఎన్ని వేల ప్రసంగాలు చేసానో, లెక్కలేదు. చెప్పింది మళ్ళీ ఎప్పుడు చెప్పలేదు. అలాగ దేవుడు విచిత్రంగా నడిపించాడు మహాభక్తులందరూ World Speakers. Preachers, Apostles అందరూ రాసుకొనే ఉంటారు. నాతో చాలా మంది అన్నారు. నేను, భక్తసింగ్ గారిని, పి.యం. సముయేల్గారిని, కె.ఎ. అబ్రహాముగారు, పరంజ్యోతిగారు. ఇలాంటి మహాభక్తులందరు కూడ ప్రిపేర్ చేసుకుని చిన్న స్లిప్ తీసికుని వచ్చినోల్లె అప్పటిదాక ఆ మాట, ఈ మాట మాట్లాడుకుని నిద్రపోయి, వేరే పనుల్లో ఉండి, టకీమని వేదికెక్కేసి అభిషిక్తమైన ప్రసంగం నిన్నే చూసాము. అని చాలా సీనియర్ పాస్టర్స్, నా తండ్రి వయసు ఉన్నవాళ్ళందరూ అన్నారు. ఏమో అయ్యగారు మరి, నాకు ఇంతకంటే చాతకాలేదు. దేవుడు నన్ను ఇలా తయారు చేసాడు. అని చెప్తున్నా. This is a mystery అని నేను అనుకుంటాను..
దేవుడు నాకిచ్చిన ఒక వరమది. బిలామునోట్లో ఒక మాట ఉంచి, యెషయాతో నీ నోట నామాటలుంచి అంటాడు, యిర్మీయాతో – నీ నోట నా మాట ఉంచి అంటాడు. నోట్లో పెట్టడం మాట, తలకాయలో బెట్టి అక్కడనుంచి రావటం ఒక పద్దతి. డైరెక్టుగా నోట్లో పెట్టడం! నోట్లో నుండి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అలాంటప్పుడు, నా కాంగ్రిగేషన్తో పాటు నేను కూడ ప్రేక్షకున్ని, విద్యార్థిని, శిష్యున్ని, శ్రోతని. నాముందు లక్షమంది కూర్చున్నా, పదివేలమంది కూర్చున్నా, వేయి మంది కూర్చున్నా వాళ్ళతో పాటు ఆ ప్రసంగం నేను కూడా వింటున్నాను. (Question and answers continues)……