127. ప్రశ్న: ఇప్పుడు మన బైబిల్ ప్రకారం పాపక్షమాపణ నిమిత్తము ఏదైనా జంతుబలి జరగాలి అని!ఇప్పుడు సేమ్ హిందువులు కూడ మొక్కుకుని అదే విధంగా చేస్తున్నారు కదా? ఈ సంప్రదాయం బైబిల్ నుండి వచ్చిందా? అది వీళ్ళకు ఎలా తెలుసు? మన పాపాలు క్షమించాలంటే ఒక కోడిని బలివ్వాలని హిందువులకి ఎలా తెలుసు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:  అది ఒక విషయంలో కొంచెం పొరపాటు అవగాహన సృష్టికర్త రక్తప్రోక్షణ ఆవశ్యము అనే నియమము నియమించినప్పుడు బైబిల్ ఇంకా వ్రాయబడలేదు. ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు ఒక మేకపోతును దేవుడు బలిగా అర్పించి ఒక చర్మముతో ఆదాముకు ఒక చొక్కా, హవ్వ కొరకు ఒక చొక్కా చేయించినప్పుడు ఆదికాండం రాయబడలేదు కదా? అది జరిగినాక కనీసం 2500 యేండ్ల తర్వాత BC1500 నాడు ఆదికాండం బైబిల్లో మొదటి గ్రంథం రాయబడింది. గనుక బైబిల్ లో రాయబడిన సంగతి వాళ్ళకెలా తెలుసు అనేది కాదు. బైబిల్ లో సృష్టి ఆరంభము చరిత్ర రాయబడింది. సృష్టి ఆరంభంలో దేవుడు ఈ రక్తప్రోక్షణాచారం నియమించాడు అనే సంగతి వాస్తవం.

బైబిల్ ఇంకా రాయబడకముందే బాబేలు గోపురం నుండి జాతులందరు చెదిరిపోయారు. కొందరు ఇండియాకు వచ్చారు.  వచ్చేటప్పుడు వాళ్ళు ఏ దేశానికి వెళ్ళిపోయినా, ఈ జ్ఞానాన్ని మోసుకొని పోయారు. మన జాతి  మూల పితరుడు పాపము చేసినప్పుడు దేవుడు జంతుబలిని చేసి, జంతుబలి ప్రోక్షణం ద్వారా వారి నగ్నత్వాన్ని కాపాడాడు. వారు ఆకులతో కచ్చడాలు చేసుకుంటే దేవుడు అంగీకరించలేదు. పాపము చేసినవారికి రక్తప్రోక్షణం ద్వారానే వారియొక్క నగ్నత్వాన్ని కప్పాలి. దేవుని ముందుకి వెళ్ళినపుడు రక్తప్రోక్షణం ఆవశ్యం, అనే జ్ఞానం ఆదాము నుండే వచ్చింది.  గనుకనే హేబేలు రక్తప్రోక్షణ ఆచారం చేసాడు. అక్కడ నుండి నోవాహు కూడ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరందరూ ప్రతిచోట బలిపీఠాలు కట్టారు. బలి అర్పించారు. అప్పటికింకా ఆదికాండము రాయబడలేదు.

            అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత 500 ఏండ్ల తర్వాత మోషే పుట్టి ఆదికాండం రాసాడు.  గనుక మానవజాతి ఆరంభంలో దేవుడు ఈ రక్తప్రోక్షణ ఆచారం నియమించిన విషయం, మన జాతి మూల పురుషులందరికి తెలుసు. ఆ బాబేలు గోపురము దగ్గరనుండి అన్ని దేశాలకు, ఖండాలకు వ్యాపించినట్వంటి చెల్లా చెదురైపోయినా అన్ని జాతులు మూల పురుషులకు ఈ విషయం తెలుసు.  రక్తప్రోక్షణం లేకుండా దేవుని ముందుకు వెళ్ళకూడదని. అందుకే వీళ్ళు ఎన్ని దేశాలకు చెదిరిపోయినా, ఎన్ని మతాలు కల్పించుకున్నా అన్ని మతాలలో ఈ రక్తప్రోక్షణం అనేదొకటి ఉన్నది. అసలు అన్ని దేశాలకు చెదిరిపోయి. అన్ని దేశాల్లో రక్త ప్రోక్షణం చేసిన తర్వాతనే బైబిల్ రాయబడింది. కనుక బైబిలి ని చూసి వాళ్ళు కాపీ కొట్టడం కాదు. అన్ని దేశాలలో మతాలలో రక్తప్రోక్షణ ఆచారం నియమించబడి ఆ మతాలు కొనసాగుతున్న తర్వాత బైబిల్ రాయబడింది. గనుక ఈ బైబిల్ రాసిన దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు బైబిల్ రాయబడకముందే మానవజాతిలో వ్యవహారం జరుపుతూ వచ్చిన దేవుడు అని అదొక నిరూపణ.